E-Paper
Advertisement

ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?

ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?
Advertisement

LockUpp 2:ఈ మధ్యకాలంలో రియాలిటీ షోలకు ఆదరణ భారీగా పెరిగిపోతోంది. సెలబ్రిటీలకు అదనపు పాపులారిటీతో పాటు అదనపు ఆదాయం కూడా.. ముఖ్యంగా ఈ రియాలిటీ షో లలో పాల్గొనే సెలబ్రిటీలు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఒకవేళ విజేతలుగా నిలిస్తే కోట్లల్లో ఆదాయంతో పాటు అంతకుమించిన లగ్జరీ బహుమతులు కూడా వారి సొంతం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. ఇప్పుడు అలాంటి షో లలో బిగ్ బాస్ ఏ రేంజ్ లో అయితే పాపులారిటీ అందుకుందో.. అటు ‘లాక్ అప్’ షో కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది. వారాల తరబడి ఉత్కంఠ, ఎమోషన్స్, అనూహ్య మలుపులు, వ్యూహాలతో సాగిన ఈ రియాలిటీ షో సీజన్ 2 ఎట్టకేలకు బుధవారం రాత్రి గ్రాండ్ ఫినాలే తో ముగిసింది.

లాక్ అప్ సీజన్ 2 విజేత ఎవరంటే?

ఎవరూ ఊహించని విధంగా కొత్త ట్విస్ట్ లు, ఎలిమినేషన్లు, పోటీదారుల మధ్య విభేదాలు, ఒకరకంగా బిగ్ బాస్(Bigg Boss) ను తలపించిన ఈ లాక్ అప్ రియాలిటీ షో ప్రేక్షకులను టీవీకే కట్టిపడేసింది. చివరి వరకు జరిగిన హోరాహోరీ పోరులో శ్రేయా కల్రా విజేతగా నిలిచి, ట్రోఫీని సొంతం చేసుకోవడంతోపాటు భారీ నగదు బహుమతిని కూడా దక్కించుకుంది. ఇకపోతే ఈమెకు గట్టి పోటీ ఇచ్చిన టెలివిజన్ నటి శివాంగి జోషి రన్నరప్ గా నిలిచింది.. రితేష్ దేశ్ ముఖ్( Riteish Deshmukh), ఫరా ఖాన్ ఈ సీజన్ కి హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక కంటెస్టెంట్స్ కి హోస్టులకు మధ్య ఈ షో మంచి రేటింగ్ తో సాగింది.

ట్రోఫీతో పాటు బోలెడు బహుమతులు కూడా

Advertisement

హోరా హోరీగా కంటెస్టెంట్స్ పర్సనల్ ఎమోషన్స్ తో సాగిన ఈ సీజన్ పీక్స్ కు వెళ్ళిపోయింది. చివరిగా గ్రాండ్ ఫినాలే తో ఆగస్టు 5వ తేదీన ముగిసింది. విజేత పేరును ప్రకటించిన వెంటనే స్టేజి మొత్తం సంబరాలతో మార్మోగిపోయింది. శ్రేయ ట్రోఫీని అందుకోవడం తోపాటు కోటి రూపాయలు నగదు బహుమతులు గెలుచుకుంది . అంతేకాదు ఈ సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కంటెస్టెంట్ గా కూడా నిలిచింది. వీటితోపాటు స్పాన్సర్షిప్ తరఫున కొన్ని ఖరీదైన బహుమతులు ఈమెకు లభించినట్లు సమాచారం.

also read:టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

25 మంది స్పెషల్ జ్యూరీల సమక్షంలో ఎంపిక..

Advertisement

శ్రేయ లాకప్ సీజన్ 2 విజేతగా నిలవడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈమె ఆట తీరు, క్లిష్ట పరిస్థితుల్లో చూపిన సహనం, ఆత్మవిశ్వాసం ఈమె విజయానికి ప్రధాన కారణం అని ఆమెను కొనియాడుతున్నారు. షో ప్రారంభం నుంచి చివరి వరకు ఆమె ఆట తీరు , ప్రతి టాస్క్ ను సవాల్ గా తీసుకొని ముందుకు సాగడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసారి విజేత ఎంపికలో చాలా ప్రత్యేకమైన విధానాన్ని పాటించారు. మీడియా ప్రతినిధులు, మాజీ పోటీదారులు, అప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో కూడిన 25 మంది సభ్యుల జ్యూరీ ఓట్ల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా శ్రేయ విజేతగా నిలిచి అభిమానుల హృదయాలకు మరింత దగ్గర అయింది . పైగా ఈ సీజన్లో ఆమె విజేత అవడం ఆమె కెరియర్ కు మరో మైలు రాయి అని చెప్పవచ్చు.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×