E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన పారిజాతం   

Karthika Deepam 2 Serial Today Episode August 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన పారిజాతం   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యో కోపంగా సూరజ్‌ దగ్గరకు వెళ్లి ఇంట్లోంచి వెళ్లిపోతానన్నావు ఇంకా ఇక్కడెందుకు ఉన్నావు అని అడుగుతుంది. నేను అవుట్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోతానని చెప్పాను వెళ్లిపోయాను అని చెప్తాడు. అందుకు జ్యో నువ్వు ఆఫీసులో ఉండకూడదు. అసలు నాకు ఎదురుపడకూడదు అంటూ కోపంగా వార్నింగ్‌ ఇవ్వడం చూసి సూరజ్‌ నవ్వుకుంటాడు. నువ్వేదో గట్టిగానే ప్లాన్‌ చేశావు అని నాకు డౌటుగా ఉందంటుంది. అప్పుడే ఆఫీస్‌ బాయ్ వచ్చి సార్‌ మిమ్మల్ని చైర్మన్‌ గారు పిలుస్తున్నారు అని చెప్పగానే.. సూరజ్‌ వెళ్లిపోతాడు.

జ్యో, పారిజాతానికి ఫోన్‌ చేసి సూరజ్‌ వెళ్లిపోలేదని.. ఆఫీసుకు వచ్చాడని చెప్తుంది. దీంతో పారిజాతం నేను ముందే ఊహించాను ఆ వెధవ నువ్వు తిడితే వెళ్లిపోవడం ఏంటని.. అది నిజమేనన్న మాట అనగానే.. అందుకేనా నువ్వు మా అమ్మకు సపోర్టుగా మాట్లాడావు అంటుంది జ్యోత్స్న ఏదో అలా మాట్లాడాను.. అంటూ పారిజాతం చెప్తుంటే.. కోపంగా జ్యో కాల్‌ కట్‌ చేస్తుంది.

Advertisement

శివనారాయణ, సూరజ్‌ను పిలిచి ఏంటి అవుట్‌ హౌస్‌లో ఉండటం లేదని అడుగుతాడు. ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందే కదా సార్‌ అంటాడు సూరజ్‌. ఎప్పటికైనా వెళ్లాలని కూడా చెప్పలేదు కదా..? అయినా నీకు నా మనవడు కార్తీక్‌కు ఇచ్చిన స్థానమే నీకు ఇచ్చాను.. ఆ స్థానం ఇచ్చానంటే నీకు ఎంత విలువ ఉందో నువ్వే అర్థం చేసుకోవాలి అని చెప్పగానే.. అంతటి స్థానం ఇచ్చినందుకు థాంక్స్‌ సార్‌..  కానీ విలువైన స్థానాలు ఎప్పటికీ శాశ్వతం కావు.. అతిథిగా వచ్చిన వాడు అతిథిగా వెళ్లాల్సిందే అని చెప్పగానే.. నువ్వు అతిథివి కాదు సూరజ్‌ అంటాడు శివనారాయణ. అవసరానికి మించి మర్యాద తీసుకోవడం నా వల్ల కాదు సార్‌ అని చెప్తాడు సూరజ్‌.

ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతాను సార్‌ నా మనసుకు నచ్చని చోట నేను ఉండలేను అంటూ సూరజ్‌ చెప్పగానే.. శివనారాయణ తన అనుభవ గురించి తనకు ఉన్న ఇష్టాఇష్టాల గురించి చెప్తూ.. నీ విషయంలో నేను ఏమైనా తప్పు చేశానా.? నా వాళ్లు ఎవరైనా తప్పు చేశారా..? అని అడగ్గానే.. జ్యో కొట్టిన విషయం గుర్తు చేసుకుని తప్పొప్పులు నిర్ణయించే టైం కాదు సార్‌.. ఆఫీసులో నా వర్క్‌ కూడా అయిపోయింది. దీప గారికి చెప్పి వెళ్లిపోతాను. అంటూ సూరజ్‌ వెళ్లిపోతుంటే.. నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ శివనారాయణ చెప్పగానే.. చెప్పమంటాడు సూరజ్‌. అది ఇంటి దగ్గరే మాట్లాడాలి ఇంటికే రమ్మని చెప్తాడు శివనారాయణ. దీంతో ఆలోచిస్తాను సార్‌ అంటూ సూరజ్‌ వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు ఇంటికి వెళ్లిన జ్యోత్న్ను పారిజాతం తిడుతుంది. తన తెలివితోనే సూరజ్‌ను ఇంట్లోంచి వెల్లగొట్టానని జ్యో చెబితే.. నువ్వు పట్టపగలే కలల కంటున్నావు.. కానీ వాడిని నీకు ఇచ్చి కట్టబెట్టకుండా ఇంట్లో వాళ్లు ఆగేలా లేరు… అది నీ బలహీనతల వల్లే వాడికి ఉన్న బలం కూడా అదే అంటూ సూరజ్‌కు ఇంట్లో వాళ్లందరూ సపోర్ట్‌ చేస్తున్నారు నీకు ఎవ్వరూ సపోర్ట్‌ చేయడం లేదని చెప్తుంది. అయితే నువ్వు కూడా సపోర్ట్‌ చేస్తున్నావా..? అని జ్యో అడిగితే అవునని పారిజాతం అసలు విషయం చెప్తుంది. నువ్వు దాస్‌ కూతురువి.. కానీ నీకు పెళ్లి అయితే ఆస్థి మొత్తం నీదై అవుతుంది. సూరజ్‌ అనాథ కాబట్టి వాడు ఇల్లరికం వస్తాడు. నువ్వు పెళ్లైన తర్వాత నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు.. నువ్వు ఆడిందే ఆట.. పాడిందే పాట నీకు నచ్చినట్టు ఉండొచ్చు.. వాడొక్కడే ఈ రెస్టారెంట్లను నడుపుతాడు. నువ్వు అప్పుడు మహారాణిలా ఉంటావు.. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నీకు వేరే సంబంధం చూస్తారు. అప్పుడు నువ్వు వేరే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అంటూ పారిజాతం చెప్పగానే.. జ్యో మౌనంగా వెళ్లిపోతుంది.

మరుసటి రోజు శివనారాయణ అందరినీ పిలిచి సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి గురించి ఇవాళ మాట్లాడతామని చెప్తారు. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. మీరు కోరుకున్నది ఎప్పటికీ జరగదు అంటుంది. సుమిత్ర కోపంగా జరుగుతుంది అని చెప్తుంది. దీంతో జ్యోత్న కోపంగా మీరెందుకు నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాలని చూస్తున్నారు అని అడిగితే ఇందులో బలవంతం ఏమీ లేదు జ్యోత్స్న.. మేము చెప్పినట్టు విని సూరజ్‌ ను పెళ్లి చేసుకో అంటాడు దశరథ. జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Big Stories

Advertisement
×