Intinti Ramayanam Today Episode june 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. బయట ఆరేసిన షర్ట్ అవని వాళ్ళ ఇంట్లో పడుతుంది.. ఆ షర్ట్ కోసం దొంగగా ఇంటికొచ్చిన అక్షయ్ ను రాజేంద్రప్రసాద్ కర్రతో చితకబాదుతాడు. మధ్యలో అవని అడ్డుపడి అతను దొంగ కాదు మీ అబ్బాయే అంటుంది.. మీరెవరు మా ఇంటికి రాకూడదనే కదరా అవన్నీ అడ్డుపెట్టాం మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. గేటు దూకి లోపలికి వచ్చాను నా షర్ట్ ఇక్కడ పడిపోయింది అని అంటాడు అక్షయ్. రాజేంద్రప్రసాద్ మాత్రం వీడొక గజదొంగ అని పెద్ద క్లాస్ పీకుతాడు. ఇక పార్వతిని పిలిచి రాజేంద్రప్రసాద్ రచ్చ రచ్చ చేస్తాడు.. అవని కోసమే అక్షయ్ వచ్చాడని చెప్పగానే అవని సిగ్గుతో మురిసిపోతుంది. అటు భానుమతి తన భర్త ఎక్కడున్నాడో కనిపించలేదు అంటూ తెగ బాధ పడిపోతూ ఉంటుంది.. మొత్తానికి కమల్ పక్కా ప్లాన్ తోనే భానుమతిని అవని ఇంటికి రప్పిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. రాజేశ్వరి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే నేను అసలు నమ్మలేకున్నాను అన్నయ్య. నా గుండె తరుక్కుపోతుంది అని బాధపడుతుంది. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ అన్నయ్యా అంటూ ఏడుస్తుంది రాజేశ్వరి.. చానాళ్ల తరువాత నిన్ను చూసినందుకు ఆనందంగా ఉంటే.. కన్నీళ్లు పెట్టుకుంటావ్ ఏంటమ్మా అని అంటాడు రాజేంద్ర. అవునూ మీ ఫ్రెండ్‌కి ఎవరికో బాలేదని అమెరికా వెళ్లావ్.. ఇప్పుడు వాళ్లకి ఎలా ఉంది? నువ్వు ఎప్పుడొచ్చావ్ అని అడుగుతాడు రాజేంద్ర. బాగానే ఉంది అన్నయ్యా..
ఇండియాలో అడుగుపెట్టగానే నేరుగా మీ దగ్గరకే వచ్చేశాను అన్నయ్యా.. ఈ వయసులో వదిన మీకు దూరంగా ఉండటం ఏంటి? అవని అక్షయలు ఇలా విడిపోవడమేంటి ఇదంతా నాకు ఏదో ఒక మహిళ కనిపిస్తుంది. పదండి అన్నయ్య నేను వదిన దగ్గరికి వెళ్లి మాట్లాడుతాను అని రాజేశ్వరి రాజేంద్రప్రసాద్ ను అక్కడికి తీసుకెళ్తుంది. ఎలా ఉన్నావ్ అత్తయ్యా అని అక్షయ్ అంటే.. అందరూ బావుంటే బాగుండేది అక్షయ్.. నేను ఒక్కదాన్నే బావుండటమే బాలేదు’ అని అంటుంది రాజేశ్వరి. నువ్వు మీ అన్నయ్యని వెంటపెట్టుకుని వచ్చావ్ అంటే.. మమ్మల్ని నిలదీయడానికి గొడవలు పడటానికే వచ్చి ఉంటావ్ అని అర్థం అయ్యింది. అందుకే విదేశాల్లో ఉన్న నిన్ను పనికట్టుకుని పిలిపించినట్టుంది… అందుకే ఎలా ఉన్నావని ఎలా అడుగుతాను అని పార్వతి రాజేశ్వరి కి షాక్ ఇస్తుంది.
ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని వదినా ఇప్పుడు ఎలా మారిపోయావో అర్థం అవుతుంది. ఇన్నేళ్లలో నా గురించి నీకు ఇదే నాకు తెలిసింది అని రాజేశ్వరి సీరియస్ అవుతుంది. మీరందరూ కలిసి ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎంత చెప్పినా కూడా పార్వతి మాత్రం అస్సలు వినదు. ఇక బయటకు వచ్చిన రాజేశ్వరి అవనితో ఏంటమ్మా అవని కుటుంబం ఇలా మారిపోయింది అని బాధపడుతుంది. దానికి అవని మీరేం బాధపడకండి పిన్ని మళ్లీ మన కుటుంబాన్ని అలా తీసుకొచ్చే బాధ్యత నాది మీరు మనశ్శాంతిగా వెళ్లి రండి అని అంటుంది.
ఇక ఆ తర్వాత రోజు అవని అక్షయ్ లు ఇద్దరూ ఇంటర్వ్యూ కి వెళ్లడానికి ఆటోను పిలుస్తారు.. ఆటో వచ్చి ఇంటి మీద ఆగ్గానే నేను పిలిచాను నేను పిలిచాను అంటూ వాదులు ఆడుకుంటూ ఇద్దరు చిరాకుపక్క ఆటో నెక్కేస్తారు. అయితే ఓకే ఇంటర్వ్యూ కి ఇద్దరు వెళ్తారు. అవని చీర కొంగు ఆటోలు ఇరుక్కున్న అక్షయ మాత్రం పట్టించుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్లిపోతాడు. అవని నిదానంగా లోపలికి వెళ్ళగానే అక్కడున్న వార్డు బాయ్ ను నా పేరు పిలిచారంట నేను ఇంటికి వెళ్లొచ్చా అని అడుగుతుంది. అతను లేదమ్మా ఒకసారి పేరు పిలుస్తారు రెండో సారి పిలవరు అని అంటాడు. ఆ మాట వినగానే అక్షయ్ నవ్వుతాడు..
Also Read:బాలును రెచ్చగొట్టిన శోభన.. రవి శాశ్వతంగా దూరం అవుతాడా..?
ఆ తర్వాత అక్షయ్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. క్వాలిఫికేషన్ అన్ని బాగానే ఉన్నా కూడా వాళ్ళ ఆఫీసు దివాలా తీయడానికి ఆయనే కారణమని అక్కడ తెలుసుకొని అక్షయ్ ని ఘోరంగా అవమానిస్తారు. ఏంటండీ ఈ జాబ్ మీకైనా వచ్చిందా అని అవని బయటికి రాగానే అడుగుతుంది. అక్కడున్న వార్డ్ బాయ్ ఈయన ఆఫీసు దివాలా తీయడానికి ఈయనే కారణమని వాళ్లకు తెలిసిపోయింది అందుకే బయటకు పంపించారు అని అంటాడు. అవని బయటకు రాగానే చూసారా అండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా.. నేను ఎంత చెప్పినా కూడా వినకుండా సంతకాలు పెట్టి, ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళు అని సలహా ఇస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..