OTT Movie : హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టకుండా, సినిమాలు తీయడం కొంతమందికి కష్టంగానే ఉంటుంది. అలా తీసిన ఎన్నో సినిమాలు ఓటీటీలో నడుస్తున్నాయి. కొన్ని సినిమాలు అచ్చు గుద్దినట్లు దింపుతుంటారు. కొంత మంది క్రియేటివిటీ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాను చూస్తే ‘Malèna (2000)’ గుర్తుకువస్తుంది. ఇందులో కూడా ఓ 13 ఏళ్ల అబ్బాయి, అతని కన్నా ఏజ్ లో పెద్దదైన యువతి మీద ఇష్టం పెంచుకుంటాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది . ఇలాంటి స్టోరీనే బాలీవుడ్ నుంచి మరొకటి వచ్చింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘ది టెనెంట్’ (The Tenant). 2023 లో వచ్చిన ఈ సినిమాకి సుశ్రుత్ జైన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షమితా శెట్టి (మీరా), రుద్రాక్ష్ జైస్వాల్ (భరత్), స్వానంద్ కిర్కిరే (మిశ్రా), షీబా ఛద్దా (మిసెస్ మిశ్రా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఇటాలియన్ మూవీ ‘Malèna'(2000) నుండి స్ఫూర్తి పొందింది. మద్ కూలీ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది. సుమారు 1 గంట 40 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.2/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
మీరా అనే ఒక డేరింగ్ యువతి, మోడల్ గా పనిచేస్తుంటుంది. ఆమె ఒక మిడిల్ క్లాస్ అపార్ట్‌మెంట్‌లోకి అద్దెకు దిగుతుంది. ఆమె డ్రస్సింగ్ స్టైల్ ని చూసి అక్కడ ఉన్న ఆంటీలు గుసాగుసలాడుకుంటారు. మీరా ఒంటరిగా ఉండటం, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో సమయం గడపడం, అక్కడ ఉండే నిబంధనలను పట్టించుకోకపోవడంవల్ల చైర్మన్ మిశ్రా ఆమెను అనుమానంతో చూస్తుంటాడు. అతనే కాకుండా అక్కడ ఉండే మహిళలు కూడా ఆమె ప్రవర్తనకి వ్యతిరేకంగా ఉంటారు. ఇలా ఉంటే ఈ అపార్ట్మెంట్ లో నివసించే భరత్అ నే 13 ఏళ్ల బాలుడు, మీరాపై ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అతను ఆమె అందానికి పడిపోయి, ఆమెతో స్నేహం చేయడం ప్రారంభిస్తాడు. మీరా కూడా భరత్‌తో సమయం గడుపుతూ, అతన్ని పార్టీలకు కూడా తీసుకెళ్తుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ట్రిప్ లకు కూడా అతన్ని వెంటబెట్టుకుని పోతుంది.
స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ ఒక ట్విస్ట్ వస్తుంది. భరత్ చేసే ఒక పొరపాటు వల్ల, మీరా గతంలోని ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఈ సీక్రెట్ బయటపడటం వల్ల, ఆమెను అపార్ట్‌మెంట్ నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉండే మహిళలు ఒత్తిడి చేస్తారు. ఈ క్రమంలో ఒక సభ్యుడు మీరాపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ ఇంతలోనే భరత్ ఆమెను రక్షిస్తాడు. ఈ సంఘటన మీరా, భరత్ స్నేహాన్ని మరింత బలపరుస్తుంది. అదే సమయంలో భరత్ తల్లిదండ్రులు విడాకులు తీసుకునే ఆలోచనను విరమించు కుంటారు. తమ వివాహా బంధాన్ని తిరిగి గాడిలో పెట్టుకుంటారు. మీరా డేరింగ్, ఇండిపెండెంట్ జీవనశైలి నుండి వాళ్ళు చాలా తెలుసుకుంటారు. చివరికి మీరా లైఫ్ లో బయట పడ్డ సీక్రెట్ ఏంటి ? ఆమె భరత్ తో ఎలాంటి రిలేషన్ నడుపుతుంది ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.