Intinti Ramayanam Today Episode March 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి అవనీని పిలవడం పల్లవి చూస్తుంది. విషయాన్ని వెంటనే పార్వతికి చెప్తుంది. అవని ప్రణతితో మాట్లాడడానికి పైకి వెళుతుంది ప్రణతి నువ్వేదో నాకు చెప్పాలని చూస్తున్నావు ఏంటో చెప్పమ్మా అని అడగ్గాని పార్వతి నువ్వు అసలు నా కూతురుతో నేను మాట్లాడొద్దని చెప్పాను అలాంటిది తన గదిలోకి వస్తావా ఈ పెళ్లయ్యేంతవరకు ఒక మూలన ఉండి నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి పార్వతి అవని బలవంతంగా కిందకు తీసుకొస్తుంది. అప్పుడే పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వస్తారు. పార్వతి వాళ్ళు హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తారు. ఇంట్లోకి రాగానే మీ పెద్ద కోడలు ఇంకా రాలేదేంటండి ముహూర్తం కూడా దాటిపోతుంది ముహూర్తం లోపల మీ పెద్ద కోడలు ఇంట్లో ఉండాల్సిందే అనేసి పెళ్లి వాళ్ళు పట్టుబట్టి కూర్చుంటారు. పార్వతి మాత్రం ఎదురుగా ఉన్న అవనిని తన పెద్ద కోడలు అని చెప్పకుండా దారిలో ఉంది వస్తుందండి అని అబద్ధం చెప్తుంది.. ఇక ప్రణతిని గౌరీ పూజకు తీసుకురమ్మని పంతులు తొందర పెడతాడు. ముందుగా అవని ప్రణతిని తీసుకురావడానికి పైకి వెళుతుంది అక్కడ లెటర్ ని చూసి షాక్ అవుతుంది. వెంటనే అక్షయ అక్కడికి వెళ్ళగానే అక్షయ్ ఈ విషయాన్ని తెలుసుకొని నోట మాట రాకుండా ఉండిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఇంకా కిందికి రాకపోవడంతో అక్షయ్ నేను వెళ్లి చెల్లిని ఇక్కడ తీసుకొస్తాను అమ్మని పైకి వెళ్తాడు. అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రణతి ఎక్కడ అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది కానీ నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావని అక్షయ్ అడుగుతాడు. ఆ లెటర్ ని చూసి అక్షయ్ షాక్ అవుతాడు. ప్రణతి ఇలా చేసిందని తెలిస్తే నాన్నగారు ఏమైపోతారు అని అక్షయ్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే శ్రియ నేను వెళ్లేసి వస్తాను అని పైకి వెళుతుంది. ప్రణతిని తీసుకురమ్మంటే మీరు ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు ప్రణతి ఎక్కడుంది వాష్ రూమ్ లో ఉందా అని శ్రీయా అడుగుతుంది కానీ ఆ లెటర్ ని చూసి షాక్ అవుతుంది.. అయితే వీళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతుంటే పల్లవి వచ్చి ఏమైంది లెటర్ రాసిపెట్టి ఎక్కడికైనా వెళ్లిందా ఏంటి ? అంతగా షాక్ అయ్యారు అక్కడి కింద పంతులుగారు తొందర పెడుతున్నారు అనేసి పల్లవి అంటుంది.
ప్రణతి రాసిన లెటర్ ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలని ఉంటుంది. పెళ్లి జరుగుతున్న దగ్గరికి వెళ్లి ప్రణతి లెటర్స్ పెట్టి ఎక్కడికో వెళ్ళింది మావయ్య అత్తయ్య అంటూ టెన్షన్ పడినట్టు నటిస్తుంది. ఆమెను చూసి పెళ్లి వాళ్ళు కూడా షాక్ అవుతారు. మీ అమ్మాయి ఇలాంటిది అని అనుకోలేదు మీ గురించి మీ పెంపకం గురించి తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకున్నాము కానీ ఇలా చేస్తదని మేము అస్సలు ఊరుకోలేదు అని వాళ్ళందరూ నానా మాటలు అంటారు.
అక్షయ్ ఒక అనాధని పెళ్లి చేసుకున్నారు అలాగే శ్రీకర్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు, ఈ మూడు అబ్బాయి అన్న తాళి కట్టాల్సిన అమ్మాయి మెడలో తాళి కట్టి భార్యగా చేసుకున్నారు. ఇక మీ అల్లుడు అమ్మ ఈ పెళ్లికి రాలేదు అంటే మీ మధ్య ఏదో గొడవలు జరుగుతున్నాయని అర్థమైంది. ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా ఇలా లెటర్ రాసిపెట్టి లేచిపోతుందని అనుకోలేదు ఇదేనా మీ పెంపకం అని రాజేంద్రప్రసాద్ నువ్వు నానా మాటలు అంటారు. మీరు రాజేంద్రప్రసాద్ మంచి వ్యక్తి అని అంటే మేము పెళ్లి ఒప్పుకున్నాం లేదంటే ఈ కుటుంబం గురించి తెలుసు మరి పెళ్లి ఎలా చేసుకుంటానని అనుకున్నారంటూ అటు పెళ్లి కొడుకు తండ్రి తల్లి కొడుకు కూడా రాజేంద్రప్రసాద్ ను దారుణంగా అవమానిస్తారు.
డబ్బులు సంపాదిస్తే సరిపోదండి పిల్లల్ని ఎలా పెంచాలి అని ఆలోచించాలి అని పెళ్లి వాళ్ళు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు ప్రణతిని వెతకడానికి బయటకు వెళ్తారు. పల్లవి అవని పై నిందలు వేసి దారుణంగా తిడుతుంది. ఇక అదే నిజం అనుకొని పార్వతి కూడా అవనిని అనుమానిస్తుంది. అక్షయ్ మాత్రం ప్రణతి లెటర్స్ పెట్టి ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళానని ఇంత క్లియర్ గా చెబితే మీరు ఎందుకు నమ్మడం లేదు అంటూ అంటాడు. నా భార్య గురించి ఎవరు ఏం మాట్లాడినా పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా ఎవరేమన్నా నేను అస్సలు ఒప్పుకోను నా భార్య అంటే నాకు తెలుసు నీకు ఎవరికి తెలియకపోయినా పర్లేదు అని అక్షయ్ అవనిని సపోర్ట్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..