WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ( Womens Premier League 2025 ) తుది దశకు వచ్చింది. ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Mumbai Indians vs Delhi Capitals ) మధ్య ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్.. ముంబై బ్రబోర్న్ స్టేడియంలో ( Brabourne Stadium, Mumbai ) జరుగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చాలా అద్భుతంగా ఆడి ఫైనల్స్ కు చేరుకున్నాయి.
Also Read: Indian Cricketers: టీమిండియా క్రికెటర్ల రెస్టారెంట్లు ఇవే..కోహ్లీనే ఇందులో తోపు !
ఫైనల్ మ్యాచ్ స్ట్రిమింగ్, టైమింగ్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Mumbai Indians vs Delhi Capitals ) మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే… ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడొచ్చు. జియో నెట్ వర్క్ ఉన్నవాళ్లకు ఉచితంగానే ప్రసారాలు చేస్తోంది జియో హాట్ స్టార్. అటు స్టార్ స్పోర్ట్ తో పాటు.. స్పోర్ట్స్ 18 లో కూడా ఫైనల్ మ్యాచ్ వీక్షించవచ్చు.
ఫ్రైజ్ మనీ ఎంతంటే ?
ప్రాథమిక అంచనా ప్రకారం… ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్… చాలా బలంగా కనిపిస్తోంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తుందని… చాంపియన్గా నిలుస్తుందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారినా… లేదా మ్యాచ్ రద్దు అయిన… ఆ పరిస్థితులను బట్టి రిజల్ట్ ఉంటుంది. రన్ రేట్ పరంగా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ చాంపియన్ గా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ మొత్తం రద్దు అయితే.. ఇద్దరు కూడా చాంపియన్ గా నిలుస్తారు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫ్రైజ్ మనీ కింద 6 కోట్లు సాధించే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో ఓడి రన్నరప్ గా నిలిచిన జట్టుకు మూడు కోట్లు ఫ్రైజ్ మనీ ఉంటుంది.
Also Read: KKR Performs Pooja: మళ్లీ కప్ గెలవాలని.. KKR పూజలు.. వికెట్లకే దండేసి దండం పెట్టారు !
ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల అంచనా
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XI: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), అమంజోత్ కౌర్, యాస్తికా భాటియా (Wk), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్/పరూనికా సిసోడియా
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XI: మెగ్ లానింగ్ (సి), షఫాలీ వర్మ, జెస్ జోనాస్సేన్, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వాకింగ్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, టిటాస్ సాధు/ఎన్ చరణి