Congress vs BJP : అన్నీ ఇస్తున్నాం.. డోంట్ వర్రీ.. ఇదీ కేంద్రమంత్రుల మాట. మీరు ఇచ్చిందేంటి.. వచ్చిందేంటి.. ఇదీ తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న. దీనిపైనే ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం నడుస్తోంది. పక్క రాష్ట్రాలకు ఫటాఫట్ ఇస్తూ తెలంగాణ దగ్గరికి వచ్చే సరికి ఎందుకు ఆగిపోతున్నారన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న. గ్రాంట్ల రిలీజ్ దగ్గర్నుంచి బడ్జెట్ కేటాయింపుల దాకా అన్నిట్లోనూ అన్యాయమే అంటూ లెక్కలను జనం ముందు పెడుతున్నారు. ఇంతకీ తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తోందా? ఏం జరుగుతోందో డీకోడ్ చేద్దాం. లెట్స్ వాచ్.
నిర్లక్ష్యానికి గురైన రంగాలపై ఫోకస్
రైట్ ఇదీ గత కొద్ది రోజులుగా కేంద్ర నిధులపై కంటిన్యూ అవుతున్న డైలాగ్. సీఎంకు, కేంద్రమంత్రులకు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. మరి గ్రౌండ్ లో నిధుల ప్రవాహం ఎలా ఉంది? ఏం జరుగుతోంది? 2023, డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు లోక్ సభ ఎన్నికల కోడ్ అమలైంది. చెప్పాలంటే ఒక పది నెలలే పాలనకు అసలైన సమయం దొరికింది. ఉన్నంతలో ప్రాధాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన వాటిని పట్టాలెక్కించే పని పెట్టుకున్నారు.
కేంద్రంతో తగువులకు దూరం
కేసీఆర్ లా కాదు.. పదే పదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. వినతులు ఇచ్చారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నిధుల కోసం అడిగారు. ఎన్నికలప్పుడే రాజకీయం.. మిగితా సమయాల్లో అభివృద్ధే లక్ష్యం అని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తగువులు పెట్టుకోబోమన్నారు. ప్రధాని పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. దేశ భద్రత ముఖ్యమని నేవీ రాడార్ కు స్థలం ఇచ్చారు. సో ఫెడరల్ సిస్టమ్ వాల్యూ పెంచుతూ.. కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్.
మెట్రో ఫేజ్ 2, RRR, మూసీ పునరుజ్జీవం
సీన్ కట్ చేస్తే కథ మరోలా ఉంటోంది. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంది. గత పదేళ్లుగా పట్టాలెక్కని వాటిపై ఫోకస్ పెట్టి నిధులు కోరుతోంది. అయితే ఢిల్లీ నుంచి అనుకున్నంతగా రావడం లేదన్నది సీఎం రేవంత్ రెడ్డి మాట. ఒత్తిడి పెంచితేనే కాస్తో కూస్తో వస్తున్నాయ్ తప్ప పెద్ద కార్యక్రమాలకు పైసా విదిలించడం లేదంటూ తాజాగా 9 పేజీల లేఖను రిలీజ్ చేశారు సీఎం రేవంత్. లెటర్ లో కొంచెం ఘాటు పెంచారు. ఒక్కసారి ఆ లేఖలో ఏముందో చూద్దాం. మెట్రో ఫేజ్ 2, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్‌కు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామని, ప్రధానిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని లెటర్ లో ప్రస్తావించారు.
నిధులు అడ్డుకుంటున్నట్లు రుజువు చేయాలన్న కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తాను ఏ ప్రాజెక్టుకి నిధులు రాకుండా ఆపుతున్నానో చెప్పాలని అనడంతో.. కేంద్రం ఏయే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలో చెబుతూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇందులో ఓ సింపుల్ లాజిక్ ఉందన్నారు. మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవం తాను పూర్తి చేస్తే పేరు ఎక్కడ వస్తుందోనని ఆపుతున్నారన్నారు సీఎం. ఒకవేళ అదే కారణమైతే ఆ పేరు కూడా కిషన్ రెడ్డే తీసుకోవాలంటున్నారు సీఎం. నిధులు మాత్రం ఆపొద్దంటున్నారు.
గ్రాంట్ల నుంచి బడ్జెట్ కేటాయింపుల దాకా అంతంతే
కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాలకు ఇచ్చే గ్రాంట్ల దగ్గర్నుంచి బడ్జెట్ కేటాయింపుల దాకా అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి లేకపోయినా మెట్రో ఫేజ్ 2 ప్రయత్నాలు చేయడమేంటని కిషన్ రెడ్డి అంటున్నారు. అయితే తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగా ఉన్నారని, క్యాబినెట్ లో పెట్టించి నిధులు విడుదల చేయించే బాధ్యత ఆ ఇద్దరిపై ఎక్కువగా ఉందన్న విషయాన్ని సీఎం పదే పదే గుర్తు చేస్తున్నారు.
వెనుకబడిన జిల్లాలకు రావాల్సినవి రూ.1,800 కోట్లు
కేంద్ర ప్రాయోజిత పథకాలకే కాకుండా గ్రాంట్ల రూపేణా కూడా ఈ ఏడాది తెలంగాణకు పెద్దగా నిధులు రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపేణా 21 వేల 636 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 4,634 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గ్రాంట్లు ఎక్కువగా రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగింది. సంక్షేమ పథకాల అమలు, పాత అప్పులపై కిస్తీల చెల్లింపులకు ప్రభుత్వం మళ్లీ రుణాలనే సేకరించాల్సి వస్తోంది. వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి పనులకు 1,800 కోట్లు రావాల్సి ఉంది. వాటిని రిలీజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం పదే పదే కోరగా.. కేంద్రం ఈ ఏడాది 450 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 3,277 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. 8 నెలల్లో 2,819 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
తెలంగాణలో 39 హైవేలకు రూ.5,658 కోట్లు నిధులు
తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ బడ్జెట్ పద్దుల లెక్కల్ని రిలీజ్ చేయగా.. అందులో 39 హైవేలకు 5,658 కోట్లు నిధుల్ని కేటాయించారు. 2024-25 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణలో నేషనల్ హైవేస్ కోసం 7,394 కోట్లను ప్రతిపాదించగా.. ఈ ఏడాది మాత్రం దాని కంటే 1736 కోట్ల మేర కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్‌ఆర్‌ఆర్, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణలతో పాటు పునర్విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి బడ్జెట్ పెట్టకంటే ముందే కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. అయినా సరే అనుకున్నంత పని కాలేదంటున్నారు. సో చెప్పుకుంటూ వెళ్తే కథ చాలానే దూరం ఉందన్న వాదనను వినిపిస్తున్నారు.
పవర్ ఫుల్ స్టేట్ కు కేంద్రం ఆసరా మరింత బెనిఫిట్
తెలంగాణకు ఎవరెవరు ఏమేం చేశారు.. తేలుద్దాం రండి… ఇదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు వేసిన సవాల్. కేంద్రంలో మోడీ, గత పదేళ్ల కేసీఆర్ పాలన, అలాగే 12 నెలల కాంగ్రెస్ ప్రజాపాలన లెక్కలేంటో ఫటాఫట్ తేల్చేద్దామంటున్నారు. దీనికి బీజేపీ సై అన్నది. టైమ్ ప్లేస్ డిసైడ్ చేయాలన్నారు. సో ఇలా రాజకీయాలు మాత్రం సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కుతున్నాయి. అయితే ఫైనల్ గా కావాల్సింది తెలంగాణకు జరగాల్సిన ప్రయోజనమే. ఇది డైనమిక్ స్టేట్. ఎక్కువ ఎకానమీ జెనరేట్ చేయగల స్టేట్. తలసరి ఆదాయం ఎక్కువున్న స్టేట్. ఏ రకంగా చూసినా పవర్ ఫుల్ స్టేట్ తెలంగాణ. అలాంటి వైబ్రంట్ సేట్ కు సెంట్రల్ ఫండ్స్ కూడా తోడైతే అభివృద్ధి నెక్ట్ లెవెల్ లో ఉంటుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన.
మెట్రో ఫేజ్ 2 తో విద్య, ఉపాధికి ఊతం
గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో ఫేజ్ 1 మొదలైంది. మెట్రో వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి మరింతగా పెరిగింది. పక్కన ఉన్న బెంగళూరు, చెన్నైకి కేంద్రం మెట్రో మలిదశకు అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు సీఎం ఆలోచన ఏంటంటే.. మన హైదరాబాద్ లో కూడా మెట్రో ఫేజ్ 2 ఆరంభమైతే.. ట్రాన్స్ పోర్టేషన్ మరింతగా పెరిగి విద్య, ఉద్యోగ ఉపాధి రంగాలు స్పీడ్ అందుకుంటాయంటున్నారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్ అయినా, మూసీ పునరుజ్జీవమైనా ఇదే ఆలోచనతో ఉన్నారు. నిజానికి సబర్మతీ, గంగా పునరుజ్జీవ పనులు చేసినప్పుడు మూసీ డెవలప్ మెంట్ కు ఎందుకు ఇవ్వరు అన్నది మరో ప్రశ్న సంధిస్తున్నారు. అక్కడ ఎలా చేయగలిగారు.. ఎలా ఇవ్వగలిగారు.. ఇక్కడెందుకు ఇవ్వలేకపోతున్నారన్న మౌలిక ప్రశ్నలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు.
రాష్ట్ర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలన్న సూచనలు
ప్రాజెక్టులపై మాట్లాడితే.. కేంద్రాన్ని అడిగి ఇచ్చారా? అన్న సమాధానం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వైపు నుంచి వచ్చింది. దీంతో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సీఎం సవాల్ చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదని, ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లకు ముగింపు పలికి జరగాల్సిన పని జరిగేలా చూడాలన్న పాయింట్ కు చర్చను తీసుకొచ్చారు. నిజానికి అన్ని రాష్ట్రాలకు అందుతున్నట్లుగానే రెగ్యులర్ గా వచ్చేవి వస్తూనే ఉంటాయి.
ఎక్కడాలేని ఎకో సిస్టమ్ హైదరాబాద్ సొంతం
అయితే వీటికి అదనంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఇంకొన్ని చర్యలు అవసరం. వాటి కోసం ప్రయత్నిస్తే బెటర్ అన్న వాదన పెరుగుతోంది. ఎందుకంటే ఇది కీలకమైన సమయం. ఇప్పుడు వేగంగా అనుకున్న పనులు చేయగలిగితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మందికి విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా వెలుగుతున్న హైదరాబాద్ లో మరింతగా అవకాశాలు వస్తాయి. ఇది అవకాశాలను సృష్టించే నగరం. ఫార్మా నుంచి ఐటీ దాకా దేశంలో మరెక్కడా లేని ఎకో సిస్టమ్, మ్యాన్ పవర్, హ్యూమన్ రీసోర్సెస్ ఉన్న సిటీ ఇది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని నిధులు అడుగుతోంది.
యూపీ, బిహార్, MP, రాజస్థాన్ కే ఎక్కువ ఫండ్స్
నిజానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడగడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. కేంద్రం ఈ ఏడాది జనవరి పన్నుల వాటా కింద లక్షా 73 వేల 30 కోట్లు రిలీజ్ చేస్తే అందులో జనాభా ఎక్కువుండి, వెనుకబడ్డ రాష్ట్రాలైన యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాలే ఏకంగా 72 వేల 450 కోట్లను దక్కించుకున్నాయి. అంటే 100 రూపాయలు చెల్లిస్తే 200 రూపాయలపైనే UP, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు పొందుతున్నాయి. జస్ట్ 3 వేల 637 కోట్లే. ఆ లెక్కన తెలంగాణ రూపాయి కేంద్రానికి ఇస్తే తిరిగొస్తున్నది 42 పైసలే. ఓవరాల్ గా చూస్తే కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చేది 3 లక్షల కోట్లైతే.. తెలంగాణ తిరిగి పొందుతున్నది 1.68 లక్షల కోట్లే. ఎంత వ్యత్యాసం ఉందో చూడొచ్చు. కనీసం ఈ లెక్కలు చూసినా తెలంగాణ రాష్ట్రం కోరుకున్న ప్రాజెక్టుల కోసం నిధులు ఇవ్వాలన్నది వాదన.
తెలంగాణ రూపాయి ఇస్తే తిరిగొస్తున్నది 42 పైసలే
సో మ్యాటర్ క్లియర్ గా ఉంది. పన్నుల వాటా ఎక్కువ ఇచ్చి.. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణలో ఇంకింత అభివృద్ధి జరిగితే దేశ ఎకానమీకే మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తున్నారు. మరి నిధుల విషయంలో ఒత్తిడి పెంచితేనే వస్తాయా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.