Intinti Ramayanam Today Episode March 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోనే వాళ్ళందరూ ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేయాలని రకరకాల ప్లాన్లు వేస్తారు. అక్షయ్ ఈ కూడా వృద్ధాశ్రమానికి డబ్బులు ఇవ్వడం అలాగే స్టాఫ్ అందరికీ బోనస్ ఇవ్వడం చూసి అందరూ మెచ్చుకుంటారు. అటు అవని తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా నేను ఎన్నో చేసేదాన్ని అని బాధపడుతూ ఉంటుంది. అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూనే ఉండేది.. నా కూతురు నాకోసం ఎంతగానో బాధపడుతుంది. దానికి స్వరాజ్యం నీ కూతురు దగ్గరికి నువ్వు వెళ్లడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి నీకు తోడుగా నేను వస్తాను నువ్వు వెళ్లి నీ కూతుర్ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి రా అనేసి అంటుంది. ఇక ఇంట్లో అందరూ ఆరాధ్యకి ఒకేసారి విషయాలని బర్త్డే గిఫ్ట్లు అన్ని పట్టుకొని ఆరాధ్య రూమ్ కి వెళ్తారు కానీ అక్కడ ఆరాధ్య లేకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ వెతుకుతారు అవనీనే ఆరాధ్యను తీసుకుపోయి ఉంటుందని పల్లవి అంటుంది. ఇక ఆరాధ్య కోసం అందరూ వెతుకుతుంటారు.. అవని అక్కే ఆరాధ్యను ఇంటికి వచ్చి దొంగతనంగా తీసుకెళ్లిపోయిందని పల్లవి అంటుంది మీకు అంతగా డౌట్ ఉంటే అక్క దగ్గరికి వెళ్లి మీరు ఒకసారి చూడండి ఆరాధ్య అక్కడే ఉంటుంది అని పల్లవి అంటుంది పల్లవి మాట విన్న అక్షయ్ అవని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆరాధ్య ఉండటం చూసి షాక్ అవుతాడు.. ఇంటికొచ్చి ఆరాధ్యను ఇలా దొంగతనంగా తీసుకురావడం మంచి పద్ధతేనా అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్యను వదిన ఏమి తీసుకురాలేదు నేనే తీసుకొని వచ్చాను అని కమలంటాడు.. నువ్వెందుకు తీసుకొచ్చావు రా అని అక్షయ్ అడిగితే మీరిద్దరూ గొడవపడ్డారు ఇంట్లో గొడవలు ఉన్నాయి ఆరాధ్యకు అమ్మని ఎందుకు దూరం చేస్తారు అని అంటాడు. ఆరాధ్య కోరిక మేరకు అవనిని అక్షయ్ఇంటికి తీసుకొస్తాడు.. అవని ఇంటికి రాగానే అందరు షాక్ అవుతారు పార్వతి మాత్రం నీ భార్యని ఎందుకు తీసుకొచ్చావు రా ఇది చేసిన మోసాల గురించి మీ చెల్లి చేసిన అన్యాయం గురించి నువ్వు మర్చిపోయావా అని అడుగుతుంది ఆరోగ్య బర్త్డే కదమ్మా ఈరోజు ఏం గొడవలు వద్దు తన కోరిక ప్రకారం తీసుకొని వచ్చాను వేరే ఉద్దేశం లేదు అని అంటాడు. ఆరాధ్య కోసం ఇంకా అందరూ మౌనంగా ఉంటారు. అవని ఆరాధన దగ్గర ఉండి రెడీ చేస్తుంది.
అందరూ కలిసి ఆరాధ్యతో కేక్ కట్ చేస్తారు. ఎవరి తెచ్చిన గిఫ్ట్ లను వాళ్లు ఆరాధ్యకు ఇస్తారు. ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత పల్లవి అవని అక్క ఇంటికి రావడానికి నువ్వే కదా కారణం బావ అని కమలని అడుగుతుంది. నేనే కారణం అవని వదిన ఇంట్లోంచి వెళ్లిపోయింది ఆరాధ్య బాధపడకూడదని నేను ఇంటికి తీసుకు వచ్చాను అనగానే రాజేంద్రప్రసాద్ ఎవరిని అడిగి తీసుకొచ్చావు రా అనేసి అంటాడు. ఆరాధ్య సంతోషం కోసం నేను ఇలా చేశాను అదే కాదు అవని వదిన తప్పేది లేదని నిరూపించి మళ్లీ ఇంటికి తీసుకొస్తాను అన్నయ్య వదిన ఇద్దరు సంతోషంగా ఉండేలా చేస్తాను అని కమలంటాడు..
మీరందరూ వదిన ఏదైనా అనొచ్చు రాముడు సీతను అనుమనించాడు తప్ప భరత లక్ష్మణులు ఎప్పుడు అనుమానించలేదు. వదినని అమ్మలాగే ప్రేమించారు మేం కూడా అంతే మా అవనీ వదిన తప్పు చేసింది అంటే మేము ఎప్పటికీ నమ్మము ఖచ్చితంగా వదిన తప్ప ఏమీ లేదని నిరూపిస్తామని అంటారు. ఒరేయ్ అక్షయ్ నీ భార్య ఎందుకోసం వచ్చిందో ఆ పని అయిపోయింది కదా ఇక పంపిస్తే మంచిది అని అంటారు. నువ్వు వచ్చిన పని అయిపోయింది గా ఇక వెళ్ళమ్మా వెళ్ళు అని ఎద్దేవా చేస్తుంది. ఇక ఆవని వాళ్ళింట్లోంచి వెళ్లిపొమ్మన్నారు అన్న విషయాన్ని నీకు గమనించి ఆరాధ్యకు బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళిపోతుంటుంది. రాజేంద్రప్రసాద్ ఆగమని చెప్తాడు. పదేళ్లు పెంచిన నీ కూతురు మీద నీకు ఇంత మమకారం ఆప్యాయత ఉంటే పాతికేళ్లు గారాబంగా మేము అందరం పెంచుకున్న మా బిడ్డని మాకు దూరం చేశావు కచ్చితంగా దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అనేసి అంటాడు.
అటు పార్వతి కూడా మా బిడ్డని మాకు కాకుండా దూరం చేశావు కచ్చితంగా మా ఉసురు నీకు తగులుతుంది అని శాపాలు పెడుతుంది. అసలు జరిగిన విషయం తెలుసుకుంటే మీరే నన్ను క్షమించమని అడుగుతారు ఆ రోజు త్వరలోనే వస్తుందని అవని బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంది. భరత్ బయట అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది భరత్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామంటే అవని అక్క మీ ఇంటికి ఆరాధ్య పుట్టినరోజు కోసం అని వెళ్ళింది ఇంకా రాలేదు అని అంటాడు.
నేను చూస్తున్నాను చాలా సేపు అయింది కదా అక్కడ ఆరాధ్య ఉండమంటే ఉండిపోయింది ఏమో అనంటే అసలే మీ వాళ్ళు మా అక్క మీద చాలా కోపంగా ఉన్నారు ఏ మాటలన్నారో ఎలా అవమానించారో అర్థం కావట్లేదు అని భరత్ అంటాడు. పల్లవి నెంబర్ ఇచ్చి పల్లవి కి ఫోన్ చేయమని ప్రణతి చెప్తుంది ప్రణతి చెప్పినట్లుగా భరత్ ఫోన్ చేస్తే మీ అక్క ఎప్పుడో వెళ్లిపోయింది నాకు ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగోదని.
అవని ఆటోలో ఎక్కుతుంది ఆటో వాళ్ళు అవనిపై కన్నేసి దారి మళ్ళించి పక్కకు తీసుకెళ్తారు అయితే అక్కడ ఒక గుడి ఉంటుంది గుడిలో పూజారున్నారని చెప్పే అక్కడి నుంచి వాళ్ళు భయపడి పారిపోతారు. అవని నా పూజారి ఒక చీర ఇచ్చి కోనేట్లో స్నానం చేసి రమ్మని చెప్తాడు. శివయ్యకు ఈరోజు మంచి రోజు సేవ చేస్తే మీకు అంత మంచే జరుగుతుందని అంటాడు. చెప్పినట్లు అవని అలాగే పూజారి గారు అని అంటుంది. ఇక గుళ్లో ఒక జంట పెళ్లి చేసుకోబోతున్నారు ఆ పనులు నాకు సాయం చేయమని అంటాడు. అవని ఆ పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది.
అయితే అక్కడికి అక్షయ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. గుళ్లోకి రావడం చూసి అవనీ వాళ్ళని చూసి సంతోషపడుతుంది. ఇక్కడ ఈవిడ ఏం చేస్తుంది అని అనుకుంటారు ఆరాధ్య మాట్లాడ పోతుంటే పార్వతి అడ్డుపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రణతి గుడికి వస్తుంది అసలు నిజం మా అమ్మ వాళ్లకు చెప్పేస్తాను అని అంటుంది కానీ అవని వద్దని చెప్తుంది. అమ్మాయి తరఫున బంధువులుగా వచ్చిన రామరాజు ఫ్యామిలీ ఆ విషయాన్ని పార్వతి వాళ్లకు చెప్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..