Intinti Ramayanam Today Episode March 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్యను వదిన ఏమి తీసుకురాలేదు నేనే తీసుకొని వచ్చాను అని కమలంటాడు.. నువ్వెందుకు తీసుకొచ్చావు రా అని అక్షయ్ అడిగితే మీరిద్దరూ గొడవపడ్డారు. ఇంట్లో గొడవలు ఉన్నాయి.ఆరాధ్యకు అమ్మని ఎందుకు దూరం చేస్తారు అని అంటాడు. ఆరాధ్య కోరిక మేరకు అవనిని అక్షయ్ఇంటికి తీసుకొస్తాడు.. అవని ఇంటికి రాగానే అందరు షాక్ అవుతారు పార్వతి మాత్రం నీ భార్యని ఎందుకు తీసుకొచ్చావు రా ఇది చేసిన మోసాల గురించి మీ చెల్లి చేసిన అన్యాయం గురించి నువ్వు మర్చిపోయావా అని అడుగుతుంది ఆరోగ్య బర్త్డే కదమ్మా ఈరోజు ఏం గొడవలు వద్దు తన కోరిక ప్రకారం తీసుకొని వచ్చాను వేరే ఉద్దేశం లేదు అని అంటాడు. ఆరాధ్య కోసం ఇంకా అందరూ మౌనంగా ఉంటారు. అవని ఆరాధన దగ్గర ఉండి రెడీ చేస్తుంది. ఆరాధ్య బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. అందరూ అవనీని దారుణంగా అవమానిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య బర్త్ డే వేడుకలు అయిపోయిన తర్వాత అవనిని ఇంట్లో వాళ్ళందరూ దారుణంగా అవమానిస్తారు. కానీ కమల్ శ్రీకర్ మాత్రం తన వదిన దేవత అంటూ అంటారు. ఇక అవని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆటోలో వస్తే ఆటో వాళ్ళు అవని పైకి అనేసి అవని బలవంతం చేయాలని అనుకుంటారు. కానీ అక్కడ గుళ్లో ఉన్న పూజారి వల్ల వాళ్ళు అక్కడ వదిలేసి పారిపోతారు. అవని గుడి దగ్గరికి వెళ్లి జరిగి జరిగిన విషయాన్ని చెప్తుంది. పూజారి ఈరోజు చాలా మంచి రోజమ్మ బ్రహ్మ ముహూర్తంలో గుడికి వచ్చావు కాబట్టి నువ్వు నాకు గుడిలో పనులకు సాయం చేస్తావా సేవ చేసుకుంటే మంచిదని అంటాడు. పూజారి మాటలు విన్నా అవని దేవుడికి సేవ చేస్తానని చెప్తుంది. గుళ్లో ఒక జంట పెళ్లి చేసుకోబోతున్నారు ఆ పనులు నాకు సాయం చేయమని అంటాడు. అవని ఆ పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అక్షయ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు.
మన కూతురికి పెళ్లి జరిగి ఇలా అయిపోయింది. ఆ బాదే నన్ను ఇంకా కుంగేలా చేస్తుంది. ఇప్పుడు వేరొకరి పెళ్లికి పెద్దగా ఉండమంటే నేనెలా ఉండగలుగుతానని పార్వతి అంటుంది. అబ్బాయి పదేళ్లదా మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. అతని పెళ్లి కూడా మన చేతుల మీద గాని జరిపిస్తానని నేను అన్నాను. ఇప్పుడు అబ్బాయికి ఇచ్చిన మాటని తప్ప మంటావని పార్వతిని అడుగుతాడు రాజేంద్రప్రసాద్. ఇక రాజేంద్రప్రసాద్ అక్షయ మాట విని పార్వతి వాళ్ళ పెళ్లి చేయడానికి లోపలికి వస్తుంది. పంతులుగారు వచ్చి బాబు మీ వాళ్ళు వచ్చారా అని అంటే వచ్చారు అని అంటారు. అమ్మాయిని అడిగితే మా వాళ్ళు కూడా వస్తున్నారండి అని అంటుంది.
అవని ఇక్కడ ఏం చేస్తుంది ఈ పెళ్లికి ఎవరైనా రమ్మని చెప్పారని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆరాధన మాత్రం పార్వతి మాట్లాడొద్దని చెప్తే మాట్లాడకుండా దూరం నుంచి వాళ్ళ అమ్మని చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రామరాజు ఫ్యామిలీ వస్తారు.. ఆరాధ్య ముడుపు కడుతుంటే రామరాజు సాయం చేస్తాడు. ఎవరికోసం ముడుపు కడుతున్నావమ్మా ఏం కోరుకున్నావని వేదవతి అడుగుతుంది. మా అమ్మ నాన్న దూరమయ్యారు వాళ్ళు కలవాలని కోరుకుంటున్నాను అని ఆరాధ్య అంటుంది. రామరాజు మాత్రం మీ అమ్మానాన్న దూరం అవలేదు మీ అమ్మ ఊరు వెళ్ళింది మాత్రమే అని అంటాడు.
వాళ్లందరూ మీకు అబద్ధాలు చెబుతున్నారు మా అమ్మ మా నాన్న దూరంగా లేరు ఇక్కడే ఉన్నారు అదిగో మా అమ్మ అనేసి ఆరాధ్య అవన్నీ చూపిస్తుంది. వేదవతి రామరాజు వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారు అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తుందని ఆలోచిస్తారు. అయితే అవని కోసం అటు భరత్ ఇటు ప్రణతి ఇద్దరూ వెతుకుతూ ఉంటారు. ప్రణతి వెతుక్కుంటూ గుడికి వస్తుంది అక్కడ అవని చూసి మా వాళ్లకు నేను ఎలాగైనా నిజం చెప్పేస్తాను వదినా నేను ప్రెగ్నెంట్ అని దాచిపెట్టి మీ తమ్ముడు తో పెళ్లి చేశావని చెప్తాను అని అనగానే ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళ గుండెలు పగిలిపోతాయని అవని అంటుంది.
ఆ మాటలు విన్నా వేదవతి రామరాజు అర్థమైందా ఇప్పుడు ఆ పెళ్లెందుకు జరిగిందో ఆ అమ్మాయిని ఎందుకు అపార్థం చేసుకున్నారని అంటాడు. గుడిలోకి వెళ్ళగానే పెళ్లి జరుగుతున్న సమయంలో అవని అక్కడుంటే నా కూతురు పెళ్లి చెడగొట్టావు ఇప్పుడు ఈ పెళ్లి చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావా నా ఇంటి పరువును తీయడానికి మళ్లీ వచ్చావని రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ అవని పై అరుస్తారు. కానీ రామరాజు మాత్రం పార్వతిని అడ్డుకుంటాడు. ఇక వేదవతి మాత్రం మీ కూతురు జీవితాన్ని నాశనం చేసిందని అంటున్నారు కదా అసలేం జరిగిందో మీకు తెలుసా అని అంటుంది. వేదవతి అయితే మొత్తానికి ప్రణతి గురించి బయటపెడుతుంది. మరి అవనిని నమ్ముతారా? లేక వేదవతి చెప్పింది అబద్ధమని కొట్టి పడేస్తారా?అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి…