PF Withdrawal Process: ప్రావిడెంట్ ఫండ్ (PF) అనేక మంది ఉద్యోగుల ఖాతాలో వారి నెల జీతం నుంచి కొంత కట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం సేవింగ్ చేసే విధానం. ఈ స్కీంను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే, చాలా మందికి తమ పీఎఫ్ డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలో స్పష్టంగా తెలియదు. ఏ రూల్స్ పాటించాలి? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఎలా చేయాలనేది కూడా అవగాహన ఉండదు. అయితే దీని కోసం మీరు పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ పీఎఫ్ డబ్బును ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చో. అది ఎలా చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఆన్‌లైన్ విధానం
-మీ PF డబ్బును ఇంట్లోనే కూర్చొని ఇలా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ పాటించండి.
-దీని కోసం మీరు మీ UAN (Universal Account Number) నంబర్, పాస్ వర్డ్ సిద్ధంగా ఉంచుకోవాలి.
-ఆ తర్వాత EPFO అధికారిక వెబ్‌సైట్ (https://www.epfindia.gov.in) ఓపెన్ చేయాలి.
-తర్వాత మెను పెజీలోని సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్ ఎంచుకోండి
-తర్వాత వచ్చిన పేజీలో సర్వీసెస్ విభాగంలో మెంబర్ UAN ఆప్షన్ సెలక్ట్ చేయండి
-ఆ క్రమంలో వచ్చిన పేజీలో మీ UAN నంబర్, పాస్ వర్డ్ వివరాలు, క్యాప్చా కోడ్ నమోదు చేసి లాగిన్ అవ్వండి
-ఆ తర్వాత మీ ఖాతాలకు ఎంటర్ అవుతారు.
-అప్పటికే మీ కేవైసీ (KYC) వివరాలు అప్‌డేట్ చేయబడి ఉండాలి. అంటే ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు లింక్ అయి ఉండాలి. లేకుంటే కేవైసీ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకుని మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.
-ఆ తర్వాత మనీ విత్ డ్రా కోసం Online Services విభాగంలోకి వెళ్లి Claim (Form-31, 19 & 10C) వీటిలో మీ అవసరాన్ని బట్టి ఆప్షన్ ఎంచుకోవాలి
-ఆ క్రమంలో మీరు ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి, అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సహా పలు వివరాలను నమోదు చేయండి
-చివరకు OTP వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, నీ ఖాతాలోకి డబ్బు 3 నుంచి 15 రోజుల్లో వస్తుంది.
Read Also: Wireless Earbuds Offer: OnePlus వైర్లెస్ ఇయర్‌బడ్స్ పై …
ఆఫ్‌లైన్ విధానం
-ఆన్‌లైన్ విధానంలో చేయడం కుదరకపోతే, నేరుగా PF ఆఫీస్‌కు వెళ్లి మాన్యువల్‌గా ఫారం నింపి సబ్మిట్ చేయవచ్చు.
-అందుకోసం ఫారం-19 (పూర్తి విత్‌డ్రా కోసం) లేదా ఫారం-31 (పాక్షిక విత్‌డ్రా కోసం) తీసుకుని మీ వివరాలను నింపి అక్కడి అధికారులకు సమర్పించాలి.
-దీని కోసం మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ జత చేయాలి.
-10-20 రోజులలో నీ ఖాతాలోకి డబ్బు వస్తుంది
PF విత్‌డ్రా రూల్స్ & షరతులు
పూర్తి విత్‌డ్రా (Full Withdrawal)
-ఉద్యోగం మానేసిన తర్వాత 2 నెలలు (60 రోజులు) ఉద్యోగం చేయకపోతే, పూర్తిగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు
-రిటైర్మెంట్ (58 ఏళ్లు) తర్వాత మొత్తం డబ్బు విత్‌డ్రా చేయవచ్చు.
పాక్షిక విత్‌డ్రా (Partial Withdrawal)
-కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
-పెళ్లి ఖర్చుల కోసం (తనదా లేదా పిల్లలదా?) – 50% వరకు తీసుకోవచ్చు.
-ఇల్లు కొనడం/నిర్మించుకోవడం కోసం – 90% వరకు (కనీసం 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలి).
-మెడికల్ అవసరాల కోసం – 6 నెలల సగటు జీతం వరకు తీసుకోవచ్చు.
-చదువు కోసం (పిల్లల చదువులకు) – 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
పన్ను రూల్స్
-5 ఏళ్ల లోపే PF డబ్బు విత్‌డ్రా చేస్తే, కొన్ని పన్నులు కట్టాల్సి ఉంటుంది.
-5 ఏళ్ల తర్వాత విత్‌డ్రా చేస్తే, ఎలాంటి పన్నులు ఉండవు.
కొత్త అప్‌డేట్స్
-ఈ ఏడాది మే తర్వాత UPI, ATM ద్వారా కూడా PF డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం రానుంది.
-ఏమైనా సందేహాలుంటే, EPFO కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.