Intinti Ramayanam Today Episode March 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని మంచితనం గురించి రామరాజుకు వేదవతికి నిజం తెలిసిపోతుంది. ఆడపడుచు సుఖంగా ఉండాలని తాను అందరి చేత అవమానాలు పడుతుంది అది బుజ్జమ్మ జరిగిందని ఇద్దరు మాట్లాడుకుంటారు. మాంగల్య ధారణ చేద్దామనేసి పంతులుగారు అందరిని పిలుస్తారు. నువ్వు ఇంటికి వెళ్లి ప్రణతి నేను వస్తానని అవని వెళ్ళిపోతుంది. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కడతాడు.. ఆ తర్వాత ప్రణతి పైకొస్తుంటే అవని నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తాను ఇదంతా తర్వాత మాట్లాడుకుందామని ప్రణతిని పంపిస్తుంది. వీళ్ళిద్దరి మాట్లాడుకుంటున్న సమయంలో భరత్ మండపంలోకి వెళ్తాడు. అక్షయ్ నీ కాలర్ పట్టుకుని మా అక్క ఎక్కడ రాత్రి నువ్వే తీసుకెళ్ళవని అడుగుతాడు ఇద్దరు కాసేపు వాదులు ఆడుకుంటారు.. ఇక అక్షయ్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరమని భరత్ కి అవని చెప్తుంది ఆ తర్వాత పార్వతి అవనీని తిడుతుంది బుజ్జమ్మ మాత్రం అసలు నిజం చెప్పాలని ముందుకు వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీధర్ కోసం అవని, ప్రణతి ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రణతిని బయటే ఉండమని అవని లోపలికి వెళ్తుంది. అయితే అవని ఎంతసేపటికి లోపలి నుంచి బయటికి రాకపోవడంతో భరత్ ఏం జరిగిందో అన్ని టెన్షన్ పడుతూ నేను వెళ్లి చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు ప్రనితి అని చెప్తాడు. బయట ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ప్రనితి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ప్రణతిని చూసినా అక్షయ్ తన చెల్లెల్ని చూసి తట్టుకోలేక పోతాడు ఇక అక్కడున్న ఓ వ్యక్తి సాయంతో తన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ డాక్టరు మరేం పర్లేదు తనకి బాగానే ఉంది మీరు తీసుకెళ్లి పోవచ్చు అని అంటారు తను మీ చెల్లి అని చెప్పారు కదా అయితే కంగ్రాట్స్ అండి మీరు మావయ్య కాబోతున్నారని డాక్టర్ అంటుంది. మాట వినగానే అక్షయ్ షాక్ అవుతాడు.
అవని భరతు ఇద్దరూ బయటికి వచ్చి ప్రణతి కోసం వెతుకుతారు. అక్కడే ఉన్నా కొబ్బరి బోండాలు వ్యక్తిని అడుగుతారు. ఇప్పుడే ఒకతను కారులోంచి వచ్చి తనని ప్రణతి అంటూ పిలిచి తీసుకెళ్లాడు అమ్మాయి కలుగురిగిరి పోయిందని హాస్పిటల్ తీసుకెళ్లారు అని అంటారు. వాళ్లు కూడా హాస్పిటల్ కి బయలుదేరుతారు. అప్పుడే ఎదురుగా అక్షయ్ ప్రణతి ఇద్దరు వస్తారు. భరత్ ని చూసి కోపంతో రగిలిపోయిన అక్షయ్ దారుణంగా కొడతాడు. అవును ఎంత చెప్తున్నా కూడా వినకుండా కొట్టడమే కాకుండా మీలాంటి దానికి జీవితంలో క్షమించనని అవని తిట్టేసి వెళ్ళిపోతాడు.
అవని ప్రణతి కనిపించలేదని దయాకర్ కి ఫోన్ చేయడంతో వాళ్లు టెన్షన్ పడుతూ వెతుక్కుంటూ వస్తారు. అయితే అవని ప్రణతి భరత్ ముగ్గురు కనిపించడంతో వాళ్ళ అక్కడికి వచ్చి మీకోసమే వెతుక్కుంటూ మేము వచ్చాం ప్రణతి కనిపించలేదంటే ఈ పిచ్చి పిల్ల మల్లి ఏం చేస్తుందని కంగారుపడుతూ వచ్చామని స్వరాజ్యం అంటుంది. భరత్ అని చూస్తే దయాకర్ ఏమైంది అలా ఉన్నావ్ అంటే భరత్ మౌనంగా ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కనిపించకుండా పోతే తనకు టెన్షన్ ఉండదా ఏంటి అని స్వరాజ్యం అంటుంది. సరే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇంటికి వెళ్దాం పదండి అని అందర్నీ ఇంటికి తీసుకెళ్తుంది స్వరాజ్యం..
అటు ఇంట్లోని ఏమైందని అక్షయ్ ని అడుగుతారు. అక్షయ మాత్రం మౌనంగా ఉంటాడు. అందరూ అక్షయ్కి ఏమన్నా అయిందేమో అని టెన్షన్ పడతారు. నిజానికి అక్షయ్ మౌనంగా ఉండడంతో పాటుగా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ పోస్ట్ చేసి అడగడంతో ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపడతాడు. ప్రణతి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు ఎందుకు చేసింది అని అందరూ బాధపడతారు.
కానీ పల్లవి మాత్రం సంతోషపడుతుంది. నేను ఈ పనికొచ్చే విషయాన్ని ఎలాగైనా వాడుకొని అవనిని మళ్లీ ఇరికించాలని అనుకుంటుంది. ఆస్తి కోసమే తన తమ్ముణ్ణి ప్రణతి మీ ట్రాప్ చేయించమని చెప్పి ఇలా చేశారు అని అందరూ అంటారు. ఇక దూరం నుంచి ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. భానుమతి చూసావా రాజేంద్రప్రసాద్ నేను మొన్న అంటే నువ్వు కాదని నామీద అరిచావు ఇప్పుడు అదే నిజమైంది అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..