Intinti Ramayanam Today Episode March 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి ఎంగేజ్మెంట్ కి అంత సిద్ధం చేస్తారు రాజేంద్రప్రసాద్ కుటుంబం. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని ఇది మంచి సంబంధం అని ఒకటేసారి ఎంగేజ్మెంట్ ని చెయ్యాలని చూస్తారు. ప్రణతికి మాత్రం ఆ పెళ్ళంటే ఇష్టం ఉండదు దాంతో అవనీకి ఫోన్ చేసి అవని ఇంటికి రమ్మని పిలుస్తుంది. అయితే అవనికి ప్రణతి అసలు నిజం చెప్పలేక పోతుంది. ఇక అందరూ కలిసి ప్రణతికి ఇది చాలా సంబంధం పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పేస్తారు. అమ్మ మాట కాదని లేక ప్రణతి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ప్రణతి మొహంలో సంతోషం ఉండదు అది గమనించిన అవని ప్రణతి ఏదాని గురించి బాధపడుతుందని అనుకుంటుంది. ప్రణతి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది మొత్తానికైతే ఎంగేజ్మెంట్ ని పూర్తి చేస్తే ఇస్తారు. అబ్బాయి మరో వారం రోజుల్లో అమెరికా వెళ్లాల్సి ఉంటుంది అందుకే పెళ్లి కూడా తొందరగా చేస్తే బాగుంటుందని పెళ్లి వాళ్ళు రాజేంద్రప్రసాద్ అంటారు. మొత్తానికి ప్రణతి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో అందరు హ్యాపీగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి తన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినందుకు బాధపడుతూ ఉంటుంది తను ప్రేమించిన వ్యక్తికి ఎక్కడ దూరం అవ్వాలని తన ఏడుస్తూ ఉంటే తన ముగ్గురు అన్నలు ప్రణతి దగ్గరికి వెళ్లి పెళ్ళికొడుకు చాలా మంచివాడు నువ్వు ఈ సంబంధం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటావు అనేసి అందరు మాట్లాడతారు కానీ ప్రణతి మాత్రం అసలు నిజం చెప్పుకోలేక. అవని వదిన అంటే నన్ను బాగా అర్థం చేసుకునేది అందుకే ఇప్పుడు ఆమె లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది.
ఇక ఉదయం లేవగానే పార్వతి పూజ చేసి తన కూతురి పెళ్లి ఎటువంటి విజ్ఞాలు కలగకుండా పూర్తి కావాలని పెళ్లి పత్రికను అక్కడ పెట్టి ఆ తర్వాత చూస్తుంది. పెళ్లి పత్రికలో అవని పేరు ఉండటంతో షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో తెలుసుకోవాలని రాజేంద్రప్రసాద్ ని పిలుస్తుంది. ఇంట్లోనే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతారు. పెళ్లి పత్రికలో అవని పేరు ఎందుకుంది అవని పేరు కూడా ఇందులో ఉండకూడదని నేను చెప్పాను కదా మీరు ఎందుకు పెట్టారు అని రాజేంద్రప్రసాన్ని నిలదీస్తుంది.
పెళ్లి పత్రికలో అవని పేరు కూడా లేకున్నా అంటే మీ కోడలు ఇంతకు బతికిందా చచ్చిందా అని అడుగుతారు అది నీకు ఓకేనా నీ మొండితనమే కానీ నీ పట్టింపులు మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు అవతలి వాళ్ళ గురించి ఆలోచించవా అని రాజేంద్రప్రసాద్ గట్టిగా అరుస్తాడు. ఇక పల్లవి శ్రీయాలు కూడా అవని పేరు ఉంటే మా పేర్లు వద్దు అవని పేరు తీసేయండి మాకు కూడా ఇష్టం లేదని ఇద్దరు బాధిస్తారు. కోమలి కూడా నాకు అమ్మకు నాన్నమ్మకు శ్రేయ పల్లవి కూడా అవని పేరేంటి ఇష్టం లేదు ఇప్పుడు అవని పేరు పెట్టి మా అన్నని బాధ పెడతారా అని అడుగుతుంది.
వినోద్ కూడా కోమలికి గట్టి వార్నింగ్ ఇస్తాడు అవని అక్క పేరు ఉంటే ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతాడు.. పార్వతి మాత్రం అవని పేరు ఉండడానికి వీల్లేదని గట్టిగా కూర్చుంటుంది దానికి రాజేంద్రప్రసాద్ ప్రణతి పెళ్లవ్వకుండానే ఈ గొడవలు చూస్తుంటే నేను ముందే హార్ట్ ఎటాక్ తో పోయేలా ఉన్నానని అంటారు. అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక కమల్, శ్రీకర్ లు దగ్గరికి వచ్చి అవని వదినని ఎలాగైనా పెళ్లికి తీసుకురండి అన్నయ్య అవని వదిన లేకుండా ఎవరి పెళ్లి జరగలేదు ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదని అడుగుతారు. అప్పుడే అక్కడికి పార్వతి వచ్చి నా కొడుకు నా మాట వింటారు. నీలాగా కాదు అవన్నీ గురించి మర్చిపో నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు అని అక్షయకి చెప్తుంది..
ఆ తర్వాత అక్షయ్ అవినీతి పెళ్లి పత్రిక ఇస్తాడు.. పెళ్లికి రమ్మని పెళ్లి పత్రిక ఇచ్చారా వద్దని పెళ్లి పత్రిక ఇస్తున్నారా అని అవని అడుగుతుంది. దానికి అక్షయ్ ఎందుకు అవని ఇంకా అలా మాట్లాడుతున్నావ్. నేను రమ్మనే నీకు పెళ్లి పత్రిక ఇచ్చాను ఒకవేళ వద్దనుకునే వానైతే నీ పేరుని పెళ్లి పత్రికలో ఎందుకు వేయిస్తానని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో పార్వతి కఠిన నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..