E-Paper
Advertisement

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు
Advertisement

Telangana Govt: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తీపి కబురు చెప్పింది రేవంత్ సర్కార్. ఈ విద్య సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా బ్రేక్‌ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అందించాలని డిసైడ్ అయ్యింది. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

Advertisement

కొద్దిరోజుల్లో విద్యా సంవత్సరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు వేగంగా తీసుకుంది. తాజాగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బ్రేక్ ఫాస్ట్ పథకం ఈ ఏడాది నుంచి అమలు చేయనుంది. బ్రేక్ ఫాస్ట్ పథకానికి సంబంధించిన మెనూ విడుదల చేసింది.

మెనూలో బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా వంటి ఉన్నాయి. అయితే రోజుకో వంటకం ఇంటర్ విద్యార్థులకు వడ్డించనునున్నారు.అదే విధంగా రోజు తప్పించి రోజు పాలు, రాగి జావ మెనూలో యాడ్ చేశారు. జూన్ 12న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు పోషకాలతో కూడిన మెనూను రెడీ చేసింది ప్రభుత్వం.

Advertisement

అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ టు పాలు, జూన్ 12 నుంచి అమలు

ఇక మిడ్ డే మీల్స్ విషయానికి వద్దాం. చట్నీ, సాంబార్, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రీలు ఉండనున్నాయి. ఇంటర్ విద్యార్థులకు ఆహారాన్ని అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్ విధానాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కోసం ఏటా రూ.120 కోట్లను ఖర్చు చేయనుంది ప్రభుత్వం.

బ్రేక్ ఫాస్ట్ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.90 లక్షలమంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది.

ALSO READ: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రారంభించనుంది రేవంత్ సర్కార్. అక్కడ సక్సెస్ అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలలకు వర్తింపజేయాలని ఆలోచన చేస్తోంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×