Intinti Ramayanam Today Episode May 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆరాధ్యను స్కూల్ మార్పించిన విషయాన్ని ప్రణతి వాళ్ళతో చెప్తుంది. తల్లి బిడ్డను వేరు చేయాలనుకోవడం ఎంత పాపము అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇంటి నుంచి కోడల్ని గెంటేసారు ఇప్పుడు తల నుంచి బిడ్డని వేరు చేయాలని చూస్తున్నారా ఇలా చేయడం వల్ల ఎంత పాపమో తెలుసా అని అందరూ తలా ఒక మాట అంటారు. కానీ అవని మాత్రం నేను నా బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తానో ఇప్పటివరకు నేను మౌనంగా ఉండడమే చూశాను అని అంటుంది. బిడ్డ కోసం నేను ఏం చేయాలో అది చేస్తాను మీరు ఏం కంగారు పడకండి అని అవని వెళ్ళిపోతుంది. అవినీతి ఎలాగైనా న్యాయం చేయాలంటే మనము ఆ ఇంటి ముందర ధర్నా చేయాలని స్వరాజ్యం ప్రణతి భరత్ దయాకర్ అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… రాజేంద్రప్రసాద్ ఇంటి ముందర స్వరాజ్యం దయాకర్ ప్రణతి భరత్ తో పాటు మరికొందరు కూర్చొని అవినీతి న్యాయం జరగాలంటూ ధర్నా చేస్తారు. పల్లవి డబ్బులు ఎరగా వేసి మీకు ఎంత కావాలంటే అంతిస్తాను ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అడుగుతుంది. డబ్బులు కోసం వచ్చిన వాళ్ళమైతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు వదిన మీకు ఫోన్ చేస్తే కావాలని అడిగే వాళ్ళం కదా అని ప్రణతి దిమ్మ తిరిగే సమాధానం చెబుతుంది. శ్రీకర్ కమల్ కూడా అవనికి న్యాయం జరగాలంటూ వాళ్లతో కూర్చొని ధర్నా చేస్తారు. అవని మనుషులు ఇంటి ముందర ధర్నా చేస్తున్నారని పార్వతి అక్షయకి ఫోన్ చేసి చెప్తుంది. అక్షయ్ వెంటనే అవనిని పిలిచి అరుస్తాడు. నువ్వు అనుకున్నది నెరవేరడం కోసం నీ వాళ్ళ నా ఇంటి ముందర ధర్నా చేయమని కూర్చోమని చెప్పావా ? మర్యాదగా వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయమను లేదా నా స్టైల్ లో నేను పోలీసులను పిలిపించి ఖాళీ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు అక్షయ్.
అవని టెన్షన్ పడుతూ వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లారు నేనేం చెప్పలేదు కదా అని వెంటనే అక్కడికి బయలుదేరుతుంది. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ అని అవని అందరిపై సీరియస్ అవుతుంది. నీకు న్యాయం జరగాలంటే వీళ్ళు చేయరు.ఇలా చేస్తేనే నీకు న్యాయం జరుగుతుందని స్వరాజ్యం అంటుంది. ఇలా చేస్తే ఇంటి పరువు పోతుంది కానీ నాకు న్యాయం జరుగుతుందా? నా సమస్యలను తీర్చాలి అనుకున్నారు. కానీ ఇంకా నా సమస్యలు పెద్దలు చేయాలని అనుకుంటున్నారా? అని అవని అంటుంది.
అప్పుడే అక్కడికి అక్షయ వస్తాడు. మీ వాళ్ళని ఇకనుంచి కాళీ చేయమని చెప్పు.. లేదంటే మాత్రం నా స్టైల్ లో నేను చూడాల్సి వస్తుందని అవనితో అంటాడు. అవినీకి న్యాయం జరగాలని మేము ఇక్కడ కూర్చున్నాం న్యాయం జరిగేంతవరకు మేము ఎక్కడికి వెళ్ళమని స్వరాజ్యం అంటారు. ఇంత వయసొచ్చింది మీరు చేసే పనులేంటి ఇలా చేస్తే న్యాయం జరుగుతుందా అని అక్షయ్ అడుగుతాడు. దానికి స్వరాజ్యం అదే మాట మీ తల్లిదండ్రులని మేము అడిగితే ఎలా ఉంటుంది అని దిమ్మతిరిగేలా చెప్తుంది. ఇక అందరూ అవని మాట విని అక్కడి నుంచి ఖాళీ చేస్తారు.
పార్వతి ధర్నా చేయమని చెప్పింది నువ్వే ధర్నాని ఆత్మని నువ్వే చెప్తున్నావా ఎన్ని నాటకాలు ఆడుతున్నావే అని అవనిని దారుణంగా అవమానిస్తుంది. ఇక అందరూ భోజనం చేస్తుంటే అవని చేసిందని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీకర్ కమల్ అవని చేసింది దాంట్లో తప్పు లేదని మా వదిన గ్రేట్ అంటూ పొగిడేస్తుంటారు. రాజేంద్రప్రసాద్ మాత్రం న్యాయమే గెలుస్తుంది న్యాయమే ఇక్కడ రాజ్యమేలుతుంది అని చెప్తాడు. సడన్ గా భానుమతి ప్లేట్ ఫిరాయిస్తుంది. అవనీని సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో అందరూ షాక్ అవుతారు.
ఇక భానుమతి తనని ఆట ఇక భానుమతి తనని పట్టించడానికి తన మనవడే తన భర్త వేషంలో వస్తున్నాడా లేక తన భర్త నిజంగా వస్తున్నాడో తెలుసుకోవడానికి పల్లవి చెప్పిన ప్లాన్ ని వర్కౌట్ చేయాలని అనుకుంటుంది. కమల్ నిద్రపోతున్నాడని కన్ఫామ్ చేసుకొని అట్లకాడ తీసుకోవడానికి వెళ్తుంది. పడుకున్న పల్లవి మీద దుప్పటి వేస్తాడు. భానుమతి పల్లవికి అట్లకాడతో వాత పెడుతుంది.. ఇద్దరూ ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపు ఎపిసోడ్లో రాజేంద్రప్రసాద్ పై అక్షయ సీరియస్ అవుతాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..