E-Paper
Advertisement

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో
Advertisement

Amaravati: రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువులు.. మరోవైపు ఫెస్టివల్ సీజన్ మొదలుకావడంతో చంద్రబాబు సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్, సంక్రాంతి పండగ కానుక. ఇది మూడు నెలలపాటు అందుబాటులో ఉండనున్నాయి.

రేషన్ కార్డుదారులకు శుభవార్త

ఎల్‌నినో ప్రభావం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువులు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రజలపై బాగానే చూపిస్తోంది. పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్, సామాన్యులపై భారం పడకుండా చర్యలు చేపడుతోంది. గడిచిన నెల రోజులుగా ఇదే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా పండగల సీజన్ కావడంతో సామాన్యులపై ఏ మాత్రం ప్రభావం పడకుండా అడుగులు వేస్తోంది.

ఏపీ ప్రజలకు పండగ కానుక

Advertisement

క్రిస్మస్, సంక్రాంతి వరుస పండగ నేపథ్యంలో ప్రజలకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల్ని రాయితీపై పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. క్రిస్మస్‌-సంక్రాంతి ఫెస్టివల్ కారణంగా రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున ఇవ్వనుంది. డిసెంబర్ నుంచి అమలుకానుంది. దాదాపు మూడు నెలలపాటు రాయితీపై నిత్యావసర సరుకులను పంపిణీ చేయనుంది.

నిత్యావసరాల సరఫరాకు నెలకు రూ.100.20 కోట్ల చొప్పున మూడు నెలలకు రూ.300.60 కోట్లు రాయితీగా ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా ఆయా సరుకులను పంపిణీ చేయనుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా చెబుతోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సివిల్ సప్లయిస్ కమిషనర్ కన్నబాబు.

Advertisement

ALSO READ: డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన

ప్రజలకు అందుబాటులో ఉండేలా పామాయిల్ సేకరించాలని ప్రభుత్వం పేర్కొంది. మూడు నెలల తర్వాత రాయితీపై నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమాన్ని పొడిగిస్తే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అందులో ప్రస్తావించింది. ఉచితంగా నిత్యావసర సరుకులను ఇచ్చేబదులు, తక్కువ ధరకు ఇవ్వడం మంచి పరిణామంగా చెబుతున్నారు లబ్దిదారులు.

Related News

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన

రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

కిర్లంపూడి పీఎస్‌లో అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ విడాకులపై ఎమన్నారంటే?

ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!

ఏపీ రాజకీయాల్లో న్యూ ట్రెండ్.. పవన్ విడాకుల వేళ, బాబు-జగన్ సీరియస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×