E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..

Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 12th : రమ్య చాలా బాధపడిపోతుందని వెనకాలే వెళ్లిన కమ్మలు తనని ఎలాగైనా సరే.. రవి ఇంటిదగ్గర వదిలిపెట్టాలని వెంట వెళ్తాడు. అయితే రమ్య ఇంటికి వద్దు అని ఎంత చెప్తున్నా సరే.. కమల్ మాత్రం ఇక్కడ పోకిరీలు చాలా ఎక్కువగా ఉన్నారు పద.. నేను ఇంటికాడ వదిలిపెడతాను అని తీసుకొని వెళ్తాడు అయితే అప్పుడే వాళ్ళ అన్నయ్య రావడంతో రమ్య వాళ్ళ అన్నయ్యకి కమల్ తో కనిపించి అడ్డంగా దొరికిపోతుంది.. ఎవరి వీడు వీడితో తిరగడానికే నువ్వు వెళ్ళావా? గుడికి వెళ్తానని చెప్పి వీడితో తిరుగుతున్నావా అని రమ్య వాళ్ళ అన్నయ్య అనగానే కమల్ షాక్ అవుతాడు. రమ్య బాధపడుతుంది. ఇక కమల్ ఒక్కసారిగా అతని మాట విని చంప పగలగొడతాడు దాంతో రమ్య వాళ్ళ అన్నయ్య కింద పడిపోతాడు కమల్ కి మా అన్నయ్య ఎందుకలా కొట్టావు అని అడగదని సరే మీ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళు అని రమ్య పంపిస్తుంది.

రమ్యకు సారీ చెప్పిన అవని..

రమ్య వాళ్ళ అన్నయ్య ఎవడేవాడు వారితో తిరుగుతున్నావా వాడితో లేచిపోతావా అంటూ దారుణంగా మాట్లాడడంతో రమ్య చాలా ఫీల్ అయిపోతుంది. ఇక కమల్ ఇంకా ఇంటికి రాలేదని అవని ఎదురు చూస్తూ ఉంటుంది.అయితే అప్పుడే ఇంటికి వచ్చిన కమల్ వాళ్ళ అన్నయ్య ఒక పచ్చి తాగుబోతు అని చెప్పగానే ఏదేమైనా రమ్యకు నా వల్లే ఇదంతా జరిగింది దానికి సారీ చెప్పాలి అని అవని రమ్యకు ఫోన్ చేసి సారీ చెప్తుంది. ఇలాంటి వాళ్ళు నాకు సారీ చెప్పడం ఏంటని ఎంతగా అడుగుతున్నా సరే అసలు వినకుండా అవని నా వల్లేదంతా జరిగింది అని అంటుంది మొత్తానికి రమ్యసరి అక్క పర్వాలేదు అని అంటుంది..

జంగమదేవర ఎంట్రీ..

Advertisement

ఇంట్లోని వాళ్ళందరూ కూడా కాఫీ తాగుతూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడే ఒక జంగమ దేవరా ఇంట్లోకి రావడంతో అందరూ ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చారు ఏదైనా మన ఇంటికి సమస్య రాబోతుందా? దాని గురించైనా మాట్లాడుతున్నారా అని కంగారు పడిపోతూ ఉంటారు. సడన్గా మన ఇంటికి వచ్చాడు అంటే ఏదో సమస్య రాబోతుంది అని అర్థమవుతుంది.. అసలు ఎవరు ఈయన అని అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. జంగమ దేవరా అంటే సాక్షాత్తు అమ్మవారికి స్వయాన భక్తుడు అని అందరూ నమ్ముతారు. పరమశివుడితో ఆయన సమానంగా చూస్తారు కాబట్టి ఆయన ఏం చెప్తే అది అక్షరాల జరుగుతుంది. అయితే మనకు ఇప్పుడు ఆయన వచ్చారు అంటే ఏదో సమస్య గురించి చెప్పడానికి వచ్చారు అదేంటో మనం కూడా కనుక్కుందాం పదండి అని అందరూ బయటకు వెళ్తారు.

భయంకరమైన నిజాలు..

భయంకరమైన నిజాలను ఆయన బయటపెడతాడు ఆ ఇంట్లో రాజేంద్రప్రసాద్ చనిపోయినప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు నిజంగానే ఆ ఇంటికి ఒక దుష్ట శక్తి పీడిస్తుంది మళ్ళీ ఈ ఇంట్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ వస్తే ఇల్లంతా అల్లకల్లో జరుగుతుంది అంటూ ఆయన నిజాలు చెప్పడంతో భయపడి పోతారు. మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఏ విషయాన్ని మీరు తక్కువగా తీసుకోవద్దు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి వల్లే ఇన్ని అనర్ధాలు జరిగాయి కాబట్టి మళ్లీ పల్లవి ఎంట్రీస్తే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ ఏదో ఒక సమస్య వస్తుంది. అదేంటో మనం కనుక్కోవాలి అని అందరూ భయపడిపోతూ ఉంటారు.

పల్లవి ఇంట్లోకి వస్తుందా..?

Advertisement

పల్లవి విడాకులు ఇవ్వబోతున్నారు అని ఇంకా కక్ష పెంచుకొని మన ఇంటి మీద పగ పెంచుకుంది మన ఇంట్లో వాళ్ళని ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. అయితే పల్లవికి విడాకులు పంపించాను కదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీకర్ తన ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే పల్లవి మళ్లీ ఇంట్లోకి రావడానికి లాయర్ తో మాట్లాడింది కాబట్టి ఆయన ఎలాగైనా సరే పల్లవిని గెలిపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనం ఆ పల్లవి నీ ఇంట్లోకి రానివ్వకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ పల్లవి వచ్చినా కూడా నేను తనతో కాపురం ఎలా చేస్తాను అనుకుంటున్నావు జీవితంలో నేను కాపురం చేయను అని కమల్ అంటాడు. అయితే పల్లవి ప్లాన్ తెలుసుకున్న అవని మనము తన గురించి తెలుసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి లేదంటే మాత్రం పల్లవి మళ్లీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అందరికీ సమస్యగా తయారవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్..

పల్లవి లాయర్ దగ్గరికి వెళ్లి ఈ కేసు ఇంకా హీరింగ్ రాలేదు కదా ఎలాగైనా సరే అది వస్తే బాగుంటుంది అని లాయర్ ని రెచ్చగొట్టాలని అనుకుంటుంది. అయితే లాయరు పల్లవి దగ్గరికి వచ్చి ఎప్పుడు వస్తుందో తెలీదు వచ్చిన తర్వాత నేను చెప్తాను అని చెప్పగానే పల్లవి తన ఎమోషనల్ డ్రామా అని మొదలు పెడుతుంది. అయితే పల్లవి చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఇక్కడ వృధా అయిపోయింది అని అర్థమవుతుంది. తాను మొదలుపెట్టిన డ్రామాలు లాయర్ ను నమ్మించి ఎలా ఉంటాయి. పల్లవి కన్నీళ్లు పెట్టుకొని ఆ ఇంట్లోకి నేను వెళ్ళాలి నా భర్తకు నేను దగ్గర అవ్వాలి అంటూ లాయర్ తో చెప్పడంతో లాయర్ నిజమే అని కొన్ని నమ్మి ఎలాగైనా సరే నేను రిక్వెస్ట్ చేసి కేసుని త్వరగా పూర్తి చేస్తాను అని అంటాడు. రమ్య వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుంది అయితే తన అన్నయ్య అవతారం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Also Read :సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..

Related News

Intinti Ramayanam Ramya : సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ హౌస్ లో శివ్ ప్రియాంక ఎంగేజ్మెంట్.. ఆడుకుంటున్న నెటిజన్స్!

నీతిగా ఆడుతున్నావ్.. గెలవటమే ముఖ్యం.. అమన్ కు సలహా ఇచ్చిన తండ్రి!

రాను బొంబాయి నుంచి నిమ్మతోట వనంలో వరకు.. సింగర్ ప్రభ టాప్ సాంగ్స్ ఇవే !

‘బిగ్ బాస్’ హౌస్‌లో శివ్, ప్రియాంక ఎంగేజ్మెంట్ డ్రామా, ఇంకా ఎన్నిసార్లు బ్రో?

Big Stories

Advertisement
×