Bigg Boss 10 Telugu Day 66 Promo 3: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని పదవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే ఇన్ని రోజులు ప్రతి వారం హౌస్ లో గొడవలు కొట్లాటలతో రచ్చ రచ్చ సాగింది. ఇక పదోవారం ఫ్యామిలీ వీక్(Family Week) కావడంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషనల్ సన్నివేశాలతో నిండిపోయింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా అడుగు పెట్టడంతో హౌస్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే నరేష్, శ్వేతా, వంశీ ,ముఖేష్, శివ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు తాజాగా అమన్ (Aman)ఫాదర్ కూడా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు.
తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో భాగంగా.. దెబ్జానీ తెలుగు టీచర్ గా మారి వచ్చిరాని తెలుగులో డైలాగులు చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు అనంతరం బిగ్ బాస్ అందరిని ఫ్రీజ్ కమ్మని చెప్పగా బిగ్ బాస్ డోర్ ఓపెన్ కావడంతో అమన్ ఫాదర్ మసూద్(Aman Father Masood) హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా తన తండ్రిని చూడగానే ఒక్కసారిగా అమన్ ఎమోషనల్ అవుతూ తనని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మై ఫాదర్.. మై హీరో ఈజ్ హియర్ అంటూ కేకలు వేస్తూ చెప్పారు. అనంతరం ముఖేష్ వచ్చి మీరిద్దరూ అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు అంటూ మాట్లాడటంతో అమన్ ఫాదర్ ముఖేష్ కు కూడా హాగ్ ఇచ్చారు.
అనంతరం అమన్ తన ఫాదర్ ఇద్దరు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చుని మాట్లాడుతూ.. అమన్ మసూద్ నీతిగా ఆడుతున్నావ్.. మంచిగా ఆడుతున్నావు.. జనాలలో మంచిగా ఉంది. ఇక్కడ నువ్వు కూడా గేమ్ గెలవడానికి వచ్చావు.. ఆ తపనతోనే గేమ్ ఆడు అంటూ తన కొడుకుకి కొన్ని సలహాలు ఇచ్చారు. అనంతరం బిగ్ బాస్ అమన్ తండ్రితో మాట్లాడుతూ మీకు అమన్ జర్నీ చూస్తే ఎలా ఉందని అడిగారు. ఈ ప్రశ్నకు మసూద్ సమాధానం చెబుతూ ఇదివరకు మసూద్ వాళ్ల అబ్బాయి అమన్ అని అందరూ పిలిచేవారు. ఇప్పుడు మాత్రం అమన్ ఫాదర్ మసూద్ అంటున్నారని తెలిపారు.
ఇక గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్లు అందరితో కలిసి అమన్ కు సలహా ఇస్తూ.. బరాబర్ ఆడాలి గెలవాలి అమన్ ఇక్కడ అమన్ మసూద్ అంటూ తన కొడుకుకు మంచి బూస్టప్ ఇచ్చారని చెప్పాలి. ఇక ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో భాగంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వారికి ఇంకా ఎలాంటి సలహాలు ఇచ్చారు అనేది తెలియనుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: కవల పిల్లలు పుట్టారంటూ రూమర్స్.. క్యూట్ రిప్లై ఇచ్చిన సమంత!