Shiva Kumar Priyanka Engagment: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం ప్రస్తుతం పదవ వారం పూర్తి కాబోతోంది. ఇక పదవ వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో శివకుమార్(Shiva Kumar) ఒకరు. ఇక ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివ కుమార్ కు సంబంధించి హౌస్ లోకి తన ప్రియురాలు, కాబోయే భార్య ప్రియాంక జైన్ (Priyanka)ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ప్రియాంక పెళ్లికూతురుగా ముస్తాబయి అనంతరం పెళ్లి పందిరిని ఏర్పాటు చేసి హౌస్ లో కంటెస్టెంట్ల సమక్షంలో వీరిద్దరూ నిశ్చితార్థం (Engagment) జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా నిశ్చితార్థానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ వీడియో పై సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ లవర్స్, రోహిత్ ఫ్యాన్స్, నెటిజన్స్ స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. రోహిత్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అందుకే టీఆర్పీ కోసం బిగ్ బాస్ తాపత్రయం పడుతున్నట్టు కామెంట్లు చేస్తున్నారు.
ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ లో టాప్ లో ఉన్న కంటెస్టెంట్ ను కనీసం సీక్రెట్ రూమ్ కి కూడా పంపించకుండా హౌస్ నుంచి బయటకు పంపించారు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంటూ రోహిత్ ఫాన్స్ బిగ్ బాస్ టీమ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇకపోతే మరి కొంతమంది బిగ్ బాస్ వీరి నిశ్చితార్థానికి ,పెళ్లికి ఖర్చులు లేకుండా స్టేట్ మొత్తం చూసేలాగా వీరి పెళ్లిని బాగా జరిపించారు. పెళ్లి ఖర్చులకు మిగిలిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
?vrfl=MTU4cTQxcXc1ZnZwZA%3D%3D
ఇకపోతే మరి కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఏకంగా ఫస్ట్ నైట్ వీడియో కూడా ప్లే చేసేయండి బిగ్ బాస్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ ప్రోమో వీడియోకి భారీగా నెగిటివ్ కామెంట్లు రావడం పట్ల ప్రియాంక రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. అయితే వీరిద్దరూ ఇదివరకు ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో ఇలాగా పెళ్లి చేసుకున్నట్టు నటించిన సంగతి తెలిసిందే. ఇలా పలు సందర్భాలలో ప్రియాంక మెడలో తాళి కట్టిన శివకుమార్ నిజంగా ఆమె మెడలో ఎప్పుడూ తాళి కడతారో తెలియాల్సి ఉంది.
Also Read: నీతిగా ఆడుతున్నావ్.. గెలవటమే ముఖ్యం.. అమన్ కు సలహా ఇచ్చిన తండ్రి!