E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   
Advertisement

Brahmamudi serial today Episode:  నరేంద్ర వచ్చి సుభాష్‌ను పలకరించి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు. సుభాష్‌ బాధగా ఇరవై ఏళ్లుగా ఈ ఇల్లు మన చేతుల్లో లేదని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు అంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. రాజు వచ్చాడు కదా ఎవరికి ఎక్కడ పెట్టాలో వాడికి బాగా తెలుసు. మనకు మళ్లీ పూర్వ  వైభవం వస్తుందండి అంటూ అపర్ణ చెప్తుంది. నేను కూడా అదే ఆశతో ఉన్నాను అంటూ సుభాష్ చెప్పడం రాజు వింటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ హాల్లోకి వెళ్లి అందరినీ పిలుస్తాడు రాజు. అందరూ వస్తారు. శేషు వచ్చి ఏంటి అల్లుడు ఎప్పుడూ ఇలా ఐషు పిలిచేది ఇవాళ నువ్వు పిలుస్తున్నావేంటి అని అడుగుతాడు. సుభాష్ కూడా ఏంటి రాజు అందరినీ పిలిచావు ఎందుకు అంటే..

చెప్తాను ఇవాళ సుభాష్, అపర్ణలకు గత ఇరవై ఏళ్లుగా అన్యాయం జరుగుతుంది. ఒక దొంగల ముఠా వచ్చి వాళ్లను దోచుకుని వాళ్లను మాస్టర్‌ బెడ్‌రూంలో మీరు ఉంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. ఇక ఆ దుర్మార్గానికి చరమగీతం పాడేద్దాం అంటూ రాజు చెప్పగానే.. అది నీకు నువ్వే డిసైడ్‌ చేస్తావా..? అని భూషణ్‌ అడిగితే.. డిసైడ్‌ అయిపోయాను బాబాయ్ ఇదే పైనల్ డిసీజన్‌ అంటాడు రాజు. అపర్ణ, సుభాష్‌, ఇందు హ్యాపీగా ఫీలవుతారు. భ్రమరాంబ మాత్రం ఇది అన్యాయం మరి రేఖ, భూషణ్‌ ఎక్కడికి వెళ్తారు అని అడిగితే.. కరెక్టుగా అడిగావు అత్తా ఇన్నాళ్లు తాతయ్య, అమ్మమ్మ ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటారు అని రాజు చెబితే..

Advertisement

ఉండమని వాళ్లు చెబితే.. ఏంటి అల్లుడు అని శేషు అడిగితే.. అక్కడ ఉండకపోతే దిక్కున్నచోటికి వెళ్లిపోవచ్చు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు.. ఇది అన్యాయం నేను ఒప్పుకోను అంటుంది భ్రమరాంబ దీంతో శేషు.. భ్రమరం ఇది రేఖ, భూషణ్‌ ల సమస్య నువ్వు నోరు మూయకపోతే మనం గెటవుట్‌ అవ్వాల్సిందే.. అంటాడు భ్రమరాంబ సైలెంట్‌ అవుతుంది. తర్వాత రేఖ, భూషణ్‌ వెళ్లి రూం ఖాళీ చేస్తారు. అపర్ణ, సుభాష్ లు లోపలికి వెళ్తారు. రూంలోకి వెళ్లిన తర్వాత అపర్ణ, సుభాష్‌లు ఎమోషనల్‌ అవుతారు. వెంటనే భయంతో ఇదంతా ఆ రేఖ, సుభాష్‌లు మనసులో పెట్టుకుని నిన్ను ఏమైనా చేస్తే ఎలా అంటే.. వాళ్ల కోరలు మొత్తం పీకేశాను ఇక తననేం చేయలేరని రాజు చెప్తాడు.

ఇందు సంతకం చేయలేదని కానీ తాను ఎలాగైనా ఎక్స్‌ఫోకు వెళ్లాలని కానీ ఎలా వెళ్లాలని ఆలోచిస్తూ.. పార్వతీశంకు ఫోన్‌ చేస్తుంది. ఎక్స్‌ఫోకు వెళ్లడానికి ఏదైనా సలహా చెప్పమని అడుగుతుంది. అందుకు పార్వతీశం వేరే దారి లేదని.. ఇందు, రాజుల కాళ్లు గెడ్డాలు పట్టుకుని ఎలాగైనా సంతకం చేయించుకోమని చెప్తాడు. ఇప్పుడెలా అనుకుంటూ రేఖ ఆంటీ ద్వారా ప్రయత్నించాలి అనుకుంటూ వెళ్తుంది. రూంలో బాధపడుతూ ఉన్న రేఖతో శేషు వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఆ రాజు ఉన్నంత వరకు మీరేం చేయలేరని ఇంకా ఎదురు తిరిగితే మాదాకాలం తల్లే అంటూ చిప్ప పట్టుకుని అడుక్కోవడమే మిగిలింది అంటాడు.

Advertisement

అప్పుడే ఐశ్వర్య వెళ్లి ఏంటి ఆంటీ వాళ్ల పంపిస్తే మీరు వచ్చేయడం ఏంటి.? అంటుంది. ఏం చేద్దాం అక్కడ మాట్లాడటం కన్నా ఈ రూంలోకి వచ్చేయడమే బెటర్‌ అనిపించింది అని రేఖ చెప్పగానే.. సరే వెళ్తున్నాను అంటూ ఐశ్వర్య వెళ్తుంటే.. ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు అని రేఖ అడిగితే.. ఆ ఇందు పేపర్స్‌ మీద సంతకం పెట్టడం లేదు కదా మీ వల్ల కూడా కాదని వెళ్లిపోతున్నాను అంటుంది ఐషు. శేషు నవ్వుతూ అక్కకు లేక ఆవకాయ తింటుంటే చెల్లి చిల్లి చికెన్‌ కావాలన్నట్టు ఉంది అంటాడు. ఐశ్వర్య వెళ్లిపోతుంది.

రూంలో ఉన్న రాజు, ఇందు తనను హగ్‌ చేసుకున్నట్టు కలగంటుంటాడు. అప్పుడే వచ్చిన ఇందు చూసి కలగంటున్నావా..? నిన్ను హగ్‌ చేసుకోవాలని నాకు ఉంది బావ. కానీ ఇప్పుడు నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు అంటూ లోపలికి వెళ్లి రాజును పిలుస్తూ.. నిలబడి కలల కంటున్నావా..? ఏంటి..? అంటుంది. రాజు ఉలిక్కి పడి చూస్తాడు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ హౌస్ లో శివ్ ప్రియాంక ఎంగేజ్మెంట్.. ఆడుకుంటున్న నెటిజన్స్!

నీతిగా ఆడుతున్నావ్.. గెలవటమే ముఖ్యం.. అమన్ కు సలహా ఇచ్చిన తండ్రి!

రాను బొంబాయి నుంచి నిమ్మతోట వనంలో వరకు.. సింగర్ ప్రభ టాప్ సాంగ్స్ ఇవే !

‘బిగ్ బాస్’ హౌస్‌లో శివ్, ప్రియాంక ఎంగేజ్మెంట్ డ్రామా, ఇంకా ఎన్నిసార్లు బ్రో?

నాది ఐరన్ లెగ్ కాదు.. ట్రోల్స్ కు శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్..

ఏడిపించేసావ్ బిగ్ బాస్.. ఫ్యామిలీ వీక్ లో అసలైన ఎమోషన్!

Big Stories

Advertisement
×