E-Paper
Advertisement

30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు.. హెయిర్ కలర్ ఎన్నిసార్లు వేయాలి.. ఈ జాగ్రత్తలు పాటించండి

30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు.. హెయిర్ కలర్ ఎన్నిసార్లు వేయాలి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Advertisement

Hair Coloring Tips| ఒకప్పుడు తెల్ల జుట్టు అంటే వయసు పెరుగుతోందనే భావన ఉండేది. కానీ ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వయసులోనే చాలామందికి తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఒకట్రెండు వెంట్రుకలుగా కనిపించినా, క్రమంగా వాటి సంఖ్య పెరుగుతుంది. దీంతో చాలామంది హెయిర్ కలర్ ఉపయోగించడం ప్రారంభిస్తున్నారు. అయితే తెల్ల జుట్టు కవర్ చేయడానికి కలర్ వేయడం మాత్రమే ముఖ్యం కాదు. ఎలాంటి హెయిర్ కలర్ ఎంచుకోవాలి? ఎన్నిరోజులకు ఒకసారి వేయాలి? అందులో ఉండే పదార్థాలు జుట్టు, తల చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అనే విషయాలు కూడా తెలుసుకోవాలి.

30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడానికి కారణాలేంటి?

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి జన్యుపరమైన కారణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని పోషకాహార లోపాలు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చు. కొంతమందికి 20 ఏళ్లలోనే తెల్ల వెంట్రుకలు కనిపిస్తాయి. మరికొందరికి 30 ఏళ్ల తర్వాత ఈ సమస్య మొదలవుతుంది.

ఎన్నిరోజులకు ఒకసారి కలర్ వేయాలి?

Advertisement

తెల్ల జుట్టుకు కలర్ వేయడానికి నిర్దిష్టమైన సమయం లేదు. జుట్టు పెరిగే వేగం, తెల్ల వెంట్రుకల సంఖ్య, సహజమైన జుట్టు రంగును బట్టి ఇది మారుతుంది. ముఖ్యంగా నుదురు దగ్గర, చెవుల పక్కన, పాపిడి ప్రాంతంలో తెల్ల జుట్టు త్వరగా కనిపిస్తుంది. కొత్తగా పెరిగే జుట్టు వల్ల కలర్ టచ్‌అప్ అవసరం ఏర్పడుతుంది.
కొంతమందికి అప్పుడప్పుడు కలర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్నవారికి తరచుగా రూట్ టచ్‌అప్ అవసరమవుతుంది. కొన్ని కొరియన్ బ్రాండ్ హెయిర్ కలరింగ్ క్రీమ్స్ 8 నుంచి 10 సార్లు షాంపూతో తలస్నానం చేసే వరకు రంగు ఉంటుందని పేర్కొంటోంది. అయితే జుట్టు రకం, తలస్నానం చేసే విధానాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు.
ప్రతిసారీ మొత్తం జుట్టుకు కలర్ వేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పెరిగిన తెల్ల జుట్టుకు మాత్రమే రూట్ టచ్‌అప్ చేయవచ్చు.

అమ్మోనియా ఫ్రీ, పీపీడీ ఫ్రీ అంటే ఏమిటి?

హెయిర్ కలర్ కొనేటప్పుడు అందులోని పదార్థాలను పరిశీలించడం ముఖ్యం. ముఖ్యంగా అమ్మోనియా, పారా ఫెనిలీన్ డయామైన్ (PPD) గురించి తెలుసుకోవాలి. కొన్ని హెయిర్ కలర్లలో అమ్మోనియా ఉంటుంది. ఇది జుట్టు పొరను తెరిచి రంగు పట్టేందుకు సహాయపడుతుంది.
PPD అనే పదార్థాన్ని ముఖ్యంగా ముదురు రంగుల హెయిర్ డైల్లో ఉపయోగిస్తారు. అయితే కొంతమందికి దీనివల్ల అలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు. ఉదాహరణకు కొరియన్ బ్రాండ్ క్యూటికలర్ తమ క్రీమ్‌లో అమ్మోనియా, PPD, సువాసనలు, ఆల్కహాల్ ఉండవని బ్రాండ్ పేర్కొంటోంది. అయితే ఈ పదార్థాలు లేవని మాత్రమే ఆ ఉత్పత్తి పూర్తిగా అలర్జీ రహితమని భావించకూడదు. ఉపయోగించే ముందు సూచించిన విధంగా ప్యాచ్ టెస్ట్ చేయాలి.

Advertisement

Also Read: డేటింగ్ యాప్ ఉపయోగించండి.. పెళ్లి కుదరకపోతే డబ్బులు రీఫండ్

హెయిర్ కలర్ వేసేటప్పుడు తల చర్మాన్ని కూడా గమనించాలి

చాలామంది జుట్టు రంగు, తెల్ల వెంట్రుకలు కవర్ అవుతున్నాయా అనే విషయాలకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ హెయిర్ కలర్ నేరుగా తల చర్మానికి తగులుతుంది. అందుకే స్కాల్ప్ కంఫర్ట్ కూడా ముఖ్యమే. క్యూటికలర్ హెయిర్ కలరింగ్ క్రీమ్‌లో పోర్టులాకా ఒలెరేసియా, బోస్వెల్లియా సెరాటా ఎక్స్‌ట్రాక్ట్స్ ఉన్నాయి. అలాగే పాంథెనాల్, ఆలివ్ ఆయిల్ కూడా ఉపయోగించారు. ఇవి జుట్టుకు కండిషనింగ్ అందించే పదార్థాలుగా గుర్తింపు పొందాయి.

ఈ బ్రాండ్ తన ఉత్పత్తిలో ఎకో మెకానిజం టెక్నాలజీని ఉపయోగించినట్లు చెబుతోంది. ఇది కలరింగ్ సమయంలో స్కాల్ప్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుందని పేర్కొంటోంది. అయితే ఫలితాలు వ్యక్తుల జుట్టు రకం, చర్మ సున్నితత్వాన్ని బట్టి మారవచ్చు.

Also Read: సోషల్ మీడియా ఇష్టంలేని బాయ్‌ఫ్రెండ్.. రీల్స్ అంటే పడిచచ్చే గర్ల్‌ఫ్రెండ్.. ప్రేమ నిలుస్తుందా?

జుట్టుకు కలర్ ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి

30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడం కొందరికి ఆందోళన కలిగించవచ్చు. అలాంటప్పుడు తొందరపడి ఏదైనా హెయిర్ కలర్ ఎంచుకోకూడదు. అందులోని పదార్థాలు, రంగు ఎంతకాలం ఉంటుంది, వాడే విధానం వంటి అంశాలను పరిశీలించాలి. జుట్టు రంగుతో పాటు తల చర్మం ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన ఉత్పత్తిని ఎంచుకుని, అవసరమైనప్పుడు మాత్రమే టచ్‌అప్ చేయడం మంచిది.

గమనిక: ఈ కథనం సాదారణంగా అందుబాటులో ఉన్న సమాాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇందులో ఉన్న బ్రాండ్స్ క్వాలిటీకి బిగ్ టీవి హామీ ఇవ్వదు. హెయిర్ కలర్ కొత్తగా ఉపయోగించేవారు ప్యాచ్ టెస్ట్ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా చర్మ సమస్యలు ఉంటే తగు నిపుణులను సంప్రదించండి.

Related News

భారీ పెరిగిన పాల ధరలు.. అయినా నో టెన్షన్.. తక్కువ ఖర్చుతో పోషకాలు ఇచ్చే 7 ఫుడ్స్ ఇవిగో

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!

ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!

ఖరీదైన క్రీములు అక్కర్లేదు..డ్రై హ్యాండ్స్‌ను సాఫ్ట్‌గా మార్చే నేచురల్ టిప్స్!

పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!

ఏడాది నిల్వ ఉండే.. పండు మిరపకాయ పచ్చడి పక్కా కొలతలతో!

Big Stories

Advertisement
×