Intinti Ramayanam Today Episode November 16th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే.. భరత్ను స్టేషన్లో పెట్టడంతో అవని ఫీలవుతూ ఉంటుంది. తమ్ముడు లేకపోతే అమ్మ టెన్షన్ పడుతుంది వాడు ఇలా జైల్లో ఉన్నాడని తెలిస్తే ఇంక అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుందని అదే ఆలోచనలతో ఉంటుంది. ఇక భరత్ను విడిపించడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లి లాయర్ తో మాట్లాడి భరత్ కు బెయిల్ ఇప్పిస్తుంది. అక్క నన్ను ఎందుకు విడిపించావు నా తప్పు లేదన్న మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలేదు నిన్ను ఏమైనా అంటారు నీకు కాపురం ఏదైనా అవుతుంది అంటే నా వాళ్ల గురించి నాకు తెలుసులే నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళు అని అంటుంది. ఇక అవని, అక్షయ్ మధ్య ప్రేమ పుడుతుందా అని పల్లవి టెన్షన్ పడుతుంది. వీరిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలని ప్లాన్ చేస్తుంది. లంచ్ బాక్స్ లో ఇంకా కారం ఉప్పు వేసి బాక్స్ కడుతుంది. దాన్ని అక్షయ్ ఆఫీస్ కు తీసుకొని వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఆఫీస్ కు తీసుకొని వెళ్తాడు. అక్కడ డైనింగ్ హాల్ ను ఓపెన్ చేస్తాడు. అందరం కలిసి భోజనం చేద్దాం అని అక్షయ్ అంటాడు. ఇక కమల్ తింటూ టీవీ చూస్తూ ఉంటాడు. ఆఫీస్ కి ఎక్కట్టాలని దొంగ నాటకాలు వేసి నాకు కాఫీ మీద సాకు పెట్టావు కదా అనేసి అడుగుతుంది. ఈ విషయాన్ని నాన్నకు చెప్తానంటే నీ గురించి కూడా నేను నాన్నకు చెప్తానని కమలంటాడు. ఇక ఇంటికి చక్రధర్ రాజేశ్వరిలు వస్తారు. కూతురు నెలతప్పడంతో ప్రతిసారి చూడాలనిపిస్తుందని పార్వతితో రాజేశ్వరి అంటుంది. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. పల్లవిని మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తుంది రాజేశ్వరి. నీకు ఈ కడుపు ఇష్టం లేదా.. ఆ సంతోషం లేదు అని అడుగుతుంది. ఇంటికి నువ్వు వారసుడు ఇవ్వబోతున్నావని సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇది నీళ్లు ఈ బిడ్డ ఇంటి వారసుడని మర్చిపోయి అబార్షన్లు గిబాషను చేయించుకోవాలని చూసావంటే మర్యాదగా ఉండదు. నువ్వు మీ నాన్న ఏ ప్లాన్లు వేస్తున్నారు నాకు తెలుసు అనేసి రాజేశ్వరి పల్లవిని అంటుంది. ఇక అప్పుడే పల్లవి దగ్గరికి చక్రధర వస్తాడు. డాడ్ నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివే రావచ్చుగా మామూలు ఎందుకు తీసుకొని వస్తావ్? మీ ఇంటి బిడ్డని నువ్వే కాపాడుకోవాలని నాకు పెద్ద పెద్ద క్లాసులు ఇస్తుంది అని పల్లవి కోప్పడుతుంది. నేను కాదమ్మా మీ అమ్మాయి నిను చూడాలనిపిస్తుంది అని నన్ను తీసుకొని వస్తుంది అని చక్రధరంతాడు.
ఇక అందరూ కలిసి భోజనం చేయడానికి డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఇక కమల్ సాంబార్ బాగుందని పోసుకొని తాగుతూ ఉంటాడు. అందరూ అతని తిండిని చూసి చిరాకు పడతారు. పార్వతి కూడా ఆ తిండి ఏంట్రా నిదానంగా తినొచ్చు కదా అనేసి అంటుంది. సాంబార్ నేను వేస్తాను కన్నయ్య అని అడుగుతుంది అవని.. అమృతం ఎక్కడ ఉంది అంటారు కానీ మా వదిన చేసిన సాంబార్ లో ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు అనుకుంటా అందుకే వాళ్ళు అలా మూర్ఖులు అనేసి కమలంటాడు. సాంబార్ పోసుకుంటూనే ఉంటాడు. అవని నేను పోస్తాను అంటే కమల్ నేను పోసుకుంటానని అంటాడు అప్పుడు సాంబార్ వచ్చి చక్రధర్ మీద పడుతుంది. ఇక చక్రధర్ మీద పడిన సాంబార్ ని కడుక్కోడానికి వెళ్తాడు. ఇక తిన్న తర్వాత అందరూ టీవీ దగ్గర కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఈ ఇంట్లో వాళ్లకి పని లేదనుకుంటాను, టీవీ చూడడం ఇదే పని అనుకుంటా అనేసి అంటుంది. ప్రణవి సినిమా పెట్టొచ్చుకదా అని భామని అడిగితే, నీకు బామ్మ ఇవన్నీ అయిన తర్వాత పెడతాను అని అంటుంది.
ఇక నువ్విలా నవ్వితే హీరోయిన్ లెక్కున్నావే ముసలి అనేసి కమలంటాడు. అవని దానికి నవ్వుతుంది. ఎంత నవ్వుకుంటావో ఇప్పుడే నవ్వుకో బావ గారు వచ్చిన తర్వాత ఆ నవ్వు నీకు ఉండదు ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది సునామీ జరుగుతుంది అని పల్లవి మనసులో అనుకుంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటుంటే అక్షయ్ కోపంగా వస్తాడు. ఏమైందని పార్వతి అడుగుతుంది. ఇక అవని ఏమైందండీ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. లంచ్ బాక్స్ ఇలా ఇవ్వండి అని అడగ్గాని అక్షయ్ కోపంతో బాక్స్ ని విసిరికొడతాడు. అందరూ షాక్ అయ్యి నిలబడతారు. ఆఫీసులో అందరు అన్న మాటను విని అక్షయ్ కోప్పడతాడు. లంచ్ ప్రిపేర్ చేసింది ఎవరు అనగానే అక్షయ్ అవని నేనే చేశానండి అంటుంది. అలాగే బాక్స్ పెట్టింది ఎవరని అక్షయ్ అడుగుతాడు. నేనే పెట్టాను ఏమైందండీ అని అవని అంటుంది. నీకు మనసు ఎక్కడ పెట్టి చేస్తున్నావు ఎవరి దగ్గర పెట్టి చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదని అక్షయ్ తిడతాడు. ఇంట్లో వాళ్ళందరూ అక్షయనే తిడతారు. అవని చేసిన తప్పేంటి అని పార్వతి అంటుంది. ఇంట్లో అవన్నీ చేసిన వంటలు బాగానే ఉన్నాయి. తిన్నారు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని లేదా ఎవరో కావాలని చేశారని పార్వతి అనడంతో అక్షయ్ కామ్ గా వెళ్ళిపోతాడు .
అవని వంట గదిలో కెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది. పార్వతి వెనకాలే పల్లవి వస్తుంది. అక్షయ్ అన్న మాటలకి బాధపడుతున్నావని అవని నీ పార్వతి అడగ్గానే ఎవరో నా మీద కావాలని ఇది చేస్తున్నారు అత్తయ్య లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తున్నానని అవని అంటుంది. పల్లవి ఎవరో కాదు అదంతా చేసింది నేనే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం ఇంకాస్త పెరిగిందని మనసులో సంతోషపడుతూ ఉంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..