Mother In Law Rape| తల్లి లాంటి అత్తపై ఓ దుర్గార్గుడు అత్యాచారం చేశాడు. భార్య తల్లి తన తల్లితో సమానమని కూడా చూడకుండా మద్యం సేవించి ఉద్రేకంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ నీచ కృత్యం చేసినందుకు కోర్టు అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం బాంబే హై కోర్టులో ఒక పిటీషన్ విచారణ జరిగింది. ఆ పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తన భార్య తల్లిపై అత్యాచారం చేశాడని కేసు. అయితే తాను అత్యాచారం చేయలేదని ఆమె ఇష్టంతోనే శృంగారం చేశానని కానీ తనపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టారని ఆ నిందితుడు హైకోర్టులో పిటీషన్ వేశాడు. అతని పిటీషన్ విచారణ చేసిన కోర్టు నిందితుడిదే తప్పు అని నిర్ధారించి 14 ఏళ్ల కఠిన జైలు శిక్షను వేస్తూ తీర్పు వెలువరించింది.
కేసులో ఏం జరిగిందంటే..
నాగ్ పూర్ కు చెందిన యువకుడు 2014లొ పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఇద్దరూ విడిపోయారు. పిల్లలు మాత్రం తండ్రి వద్దనే పెరుగుతున్నారు. ఈ క్రమంలో నిందితుడు
2018లో ఒకరోజు తన భార్య పుట్టింటి వెళ్లి అక్కడ గొడవ చేశాడు. ఆ సమయంలో నిందితుడి అత్త (55) అక్కడి ఉంది.
నిందితుడు తన భార్యతో కలిసి పోతానని.. దానికోసం తన అత్తను సాయం చేయమని అడిగాడు. తన భార్యకు నచ్చజెప్పి తనతో కాపురానికి పంపించమని అత్తను పట్టుకొని ప్రాధేయపడ్డాడు. ఇదంతా చూసి ఆమె కరిగిపోయింది. భార్యభార్తలను కలిపేందుకు అంగీకరించింది. అయితే ఆ సమయంలో నిందితుడి భార్య ఇంట్లో లేదు. ఆ తరువాత తన మనవళ్లతో కలిసేందుకు తన ఆమె తన అల్లుడి ఇంటికి వెళ్లింది.
Also Read: బిర్యానీ కోసం హత్య.. కాలయముడైన స్నేహితుడు..
అక్కడికే తన కూతురిని కూడా రావాలని ఫోన్ చేసి చెప్పింది. అయితే వెళ్లే దారిలో కారు ఆపి ఆ అల్లుడు మద్యం సేవించాడు. ఆ తరువాత దారిలో అంతా తన అత్తతో గొడవపడ్డాడు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా తన అత్త మామలపై తీవ్రంగా విమర్శించాడు. ఈ క్రమంలో ఆమె అతనితో కోపంగా మాట్లాడింది. అంతే ఆ వ్యక్తి తన ఎదురుగా ఉన్నది తన అత్త అని మరిచిపోయి ఆమెపై కొన్ని గంటల వ్యవధిలోనే మూడుసార్లు అత్యాచారం చేశాడు.
ఇదంతా జరిగినందుకు నిందితుడి అత్త సిగ్గుతో ఎవరితోనూ చెప్పలేకపోయింది. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చాక.. తన కూతురితో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. దీంతో తల్లీకూతుళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కీచక అల్లుడిపై ఫిర్యాదు చేశారు.
రేప్ కేసులో అల్లుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సెషన్స్ కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేసిన తరువాత సెషన్స్ కోర్టు నిందితుడికి 14 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. కానీ ఆ అల్లుడు తాను రేప్ చేయలేదని హై కోర్టులో సెషన్స్ తీర్పుని సవాల్ చేశాడు.
హై కోర్టులో విచారణ సందర్భంగా అత్తపై రేప్ చేసిన అల్లుడు.. ఇదంతా తాను తన అత్త కోరిక మీదే చేశానని చెప్పాడు. తనను జైలుకి పంపించడానికి తన భార్య, ఆమె తల్లి కుట్ర పన్నారని ఆరోపణలు చేశాడు. కానీ బాంబే హై కోర్టు నాగ్ పూర్ బెంచ్ అల్లుడి లాయర్ వాదనలకు తిరస్కరించింది.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
ఒకవేళ సదరు అత్త తన ఇష్టంతోనే అల్లుడితో శృంగారం చేసిఉంటే ఆమె తన కూతురితో ఆ విషయం చెప్పేది కాదని, విషయం బయటపెడితే తన పరువు పోతుందని ఆమె వెనుకడుగు వేసేది. కానీ అలా జరుగలేదు. ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్భయంగా కోర్టులో చెప్పింది. దీనిబట్టి నిందితుడు ఉద్దేశపూర్వకంగానే రేప్ చేశాడి హై కోర్టు నిర్ధారించింది. అందుకే సెషన్స్ కోర్టు విధించిన 14 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. దోషి అలా చేస్తాడని బాధితురాలు (అతనిఅత్త) కలలో కూడా ఊహించి ఉండదు. ఈ సిగ్గుమాలిన చర్యకు పాల్పడినందుకు నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందేనని హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఎ సనప్ అన్నారు.