Brahmamudi serial today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. ఇంతలో ఇందిరాదేవి.. ధాన్యలక్ష్మీ భోజనానికి రాలేదేంటని వంట మనిషి శాంతను అడుగుతుంది. పిలిచానమ్మా కానీ తనకు ఆకలిగా లేదని ముఖం మీదే తలుపు వేసింది అని శాంత చెప్తుంది. దీంతో ఆకలి లేకపోవడం కాదు ఆస్థి పంపకాలు చేయలేదన్న బాధ అయినా కొంచెం టైం కావాలని చెప్పినా కూడా ఇలా చేయడం ఏంటని ఆలోచిస్తుంది. ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తను వదిలేలా లేదు అత్తయ్యా అంటుంది అపర్ణ. బాధపడని వదిన అంటాడు ప్రకాష్. ఈ ఇంట్లో రోజు రోజుకు మానవత్వం నశించిపోతుంది అంటుంది రుద్రాణి. దీంతో రుద్రాణిని స్వప్న, ప్రకాష్ తిడతారు. నీకంతా బాధగా ఉంటే నువ్వు కూడా భోజనం చేయడం మానేసి వెళ్లి ధాన్యలక్ష్మీని ఓదార్చమని ప్రకాష్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. దీంతో ఆలా ఎలా వెళ్తుంది అంకుల్. మాటలు చెప్పి పక్కవాళ్లను నిందించడం వరకే మా అత్తకు తెలుసు అంటుంది స్వప్న.
ఆఫీస్ మీటింగ్ హాల్ లో కావ్య తన ఎంప్లాయీస్ తో డిజైన్స్ గురించి మాట్లాడుతుంది. ఇంతలో రాజ్ వచ్చి ఏంటి..? మా టింగు ఉండగా.. మీ టింగు పెట్టారేంటి..? ఉప్మాలో కరివేపాకు లాగా మీటింగ్ హాల్లో మీరెందుకు ఇక్కడ. వెంటనే ఈ చెత్తాచెదారం అంతా తీసేసి కడిగిపారేయండి అంటాడు. దీంతో అక్కడ కూర్చున ఎంప్లాయీస్ అందరూ లేస్తారు. దీంతో మీరెందుకు లేచారు. కూర్చోండి.. ఇక్కడ మేమేమీ చింతపిక్కల ఆట ఆడుకోవడానికి రాలేదు. ప్రాజెక్టు గురించి డిష్కర్షన్ చేయడానికి వచ్చాము. మా టింగు ఇక్కడే జరుగుతుంది. మీ టింగు ఇంకెక్కడైనా పెట్టుకోండి అంటూ రాజ్‌కు చెప్తుంది. ఏయ్ మర్యాదగా లేవండి. లేకపోతే కూర్చోవడానికి కుర్చీలు ఉండవు అంటూ రాజ్ వార్నింగ్ ఇస్తాడు.
కావ్య ఏంటి రౌడీయిజం చేస్తున్నారా..? మీరేం చేసినా మా టీం ఇక్కడి నుంచి కదలదు. కూర్చోండి అందరూ కూర్చోండి అంటూ కావ్య చెప్పగానే మేడం మీ ఇద్దరు ఏ టీంలో ఉండాలో డిసైడ్ చేసుకునేదాకా ఈ స్టాండప్ సిడౌన్ కాన్సెఫ్ట్ ను ఆపేయండి మేడం అంటారు ఎంప్లాయీస్. దీంతో రాజ్, కవ్య మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో అక్కడకి జగదీష్ చంద్ర ప్రసాద్ వచ్చి.. నేను విన్నది నిజమే అన్నమాట. మీరిద్దరూ విడిపోయారని మీ గొడవల వల్ల కంపెనీని పట్టించుకోవడం లేదని బయట మార్కెట్ లో అందరూ అనుకుంటున్నారు. మార్కెట్ లో కూరగాయలు కొనకుండా మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు సార్ అంటూ రాజ్ వెటకారంగా అడుగుతూ.. గట్టిగా నవ్వుతుంటాడు రాజ్. మేడం సార్‌కు డీల్ పోతుందన్న భయంతో పిచ్చి పట్టినట్టు ఉంది అంటుంది శృతి.
శృతిని కావ్య తిడుతుంది. రాజ్ మాత్రం ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాక నవ్వుతుంటాడు. దీంతో కావ్య రాజ్‌ను మీరెందుకు నవ్వుతున్నారో ఆయనకు చెప్పండి అంటుంది. దీంతో రాజ్ విడిపోయిన భార్యాభర్తలు కలిసి ఒకేచోట ఎందుకు పని చేస్తారు చెప్పండి. అందులోనూ ఒకే ప్రాజెక్టు కోసం ఎందుకు కష్టపడతారు చెప్పండి అని అడుగుతాడు. మీరు విన్నది ముమ్మూటికీ నిజం కాదు సార్ అని సర్ధి చెప్పాలనుకుంటాడు రాజ్. అయితే నేను ఇక్కడకు వచ్చిన్నప్పుడు మీరు గొడవ పడుతున్నారు. అదేంటి మరి అని అడుగుతాడు జగదీష్. అది గొడవే కాదు సార్.. మేము డిజైన్స్ కోసం చర్చించుకుంటున్నాం అంతే అంటాడు రాజ్.
అయితే సరే మీరు నా కోసం బెస్ట్ డిజైన్స్ వేసి ఇవ్వండి అంటూ వెళ్లిపోతాడు. తర్వాత రాజ్, కావ్యను తిడుతుంది. ఆయనకు ఎందుకు అబద్దం చెప్పారని నిలదీస్తుంది. బిజినెస్ కోసం ఒక్క అబద్దం చెప్తే తప్పేంటి అంటాడు రాజ్. అయితే అవసరం కోసం అబద్దం చెప్తే తప్పు కాదా..? అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. కాదని రాజ్ చెప్పడంతో అయితే ఆరోజు మనిద్దరని కలపడానికి మా అమ్మ క్యాన్సర్ అని ఒక్క అబద్దం చెప్తే ఎందుకు అంత రాదాంతం చేశారు అంటూ కావ్య అడగ్గానే రాజ్ షాక్ అవుతాడు. తర్వాత అది వేరు ఇది వేరు అంటూ ఏదో చెప్పబోతుంటే.. కావ్య రాజ్‌ను తిట్టి చాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంటికి వచ్చిన కళ్యాణ్ పొట్టి నీకో గుడ్ న్యూస్ అంటాడు. ఏంటి కొంపదీసి తండ్రివి కాబోతున్నావా ఏంటి? అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్ నీకు తెలియకుండా అవుతానా అని అడుగుతాడు. ఏమో మీ పెద్దనాన్న లాగా చిన్నిల్లు ఏమైనా ఉందేమో అంటుంది అప్పు. కళ్యాణ్, అప్పు చెవి పట్టుకుని మీ ఇంట్లో అందరూ ఇంతేనా..? వదిన కూడా ఇంతే నోరు జారి ఇక్కమాట అంటే ఇక నెలల తరబడి దెప్పిపొడుస్తూనే ఉంటుంది అని కళ్యాణ్ చెప్తుంటే ఏదో సరదాగా అన్నానులే కవి.. ఏంటో గుడ్ న్యూస్ చెప్పు అనగానే తనకు రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్ గా చాన్స్ వచ్చిందని చెప్తాడు కళ్యాణ్. అప్పు హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నావా…? అని అడగ్గానే కళ్యాణ్ అగ్రిమెంట్ విషయం పొట్టికి తెలిస్తే గొడవ చేస్తుంది అని మనసులో అనుకుని అలాంటిదేం లేదని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.