E-Paper
Advertisement

లవ్ బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకున్న అనన్య.. సారీ చెప్పిన వర్ష!

లవ్ బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకున్న అనన్య.. సారీ చెప్పిన వర్ష!
Advertisement

Big TV Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం సెలబ్రెటీలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా సెలబ్రిటీ టాక్ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రముఖ నటి అనన్య శర్మ (Ananya Sharma)హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేయగా ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో భాగంగా అనన్య శర్మ తన సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడారు.

సెకండ్ ఛాన్స్ అడిగితే ఇస్తారా..

ఇక సినిమా ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా తన ఫ్యామిలీ గురించి లవ్ గురించి అనన్య మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినీ సెలబ్రిటీలు జీవితంలో లవ్ లైఫ్ ఉండటం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే అనన్య లవ్ స్టోరీ(Love Story) గురించి అడగడంతో కెమెరా కట్ చేస్తే చెబుతాను అంటూ ఫన్నీగా సమాధానం చెప్పారు. ఇకపోతే తన లైఫ్ లో బ్రేకప్ స్టోరీ(Love break Up) ఉందని విన్నాము నిజమేనా అంటూ వర్ష(Varsha) ప్రశ్న వేశారు. అదేవిధంగా బ్రేకప్ చెప్పిన అబ్బాయి తిరిగి వచ్చి సెకండ్ ఛాన్స్ అడిగితే ఇస్తారా? అంటూ కూడా ప్రశ్నించారు.

క్షమాపణలు చెప్పిన వర్ష..

Advertisement

వర్ష ఇలా తన బ్రేకప్ గురించి ప్రశ్నించడంతో అనన్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా అనన్య శర్మ తన బ్రేకప్ విషయంలో కన్నీళ్లు పెట్టుకోవడంతో వర్ష తన దగ్గరకు వెళ్లి తనని ఓదారుస్తూ సారీ అనన్య అంటూ తనకు క్షమాపణలు చెప్పారు. మరి ఈమె ఇంతలా ఎమోషనల్ అవడంతో లవ్ బ్రేకప్ విషయంలో అనన్య చాలా బాధలు పడ్డారని స్పష్టమవుతుంది. మరి ఈమె తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి ఎలాంటి విషయాలు చెప్పారనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.

Advertisement

ఇక అనన్య 30 వెడ్స్ 21 అనే సిరీస్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చిన అనన్య త్వరలోనే హై అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనన్య శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Also Read: బతకడానికి పైసలు లేవు.. ఇష్టంలేని సినిమాలు చేస్తున్నా.. అనన్య కన్నీటి కష్టాలు!

Related News

బతకడానికి పైసలు లేవు.. ఇష్టంలేని సినిమాలు చేస్తున్నా.. అనన్య కన్నీటి కష్టాలు!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్..ఉష అక్క టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే!

నిన్ను పుట్టించిన మీ అమ్మ అంటూ.. సోషల్ మీడియా బూతుల పై అనన్య ఎమోషనల్!

ఇంటిమేట్ సీన్స్.. బట్టలతో ప్రాబ్లం కాదు.. ఇండస్ట్రీ పై అనన్య శర్మ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?

నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

నిర్ణయం తీసుకోలేని వారు విజేత ఎలా అవుతారు.. ముఖేష్, త్రిగుణ్ పై నెటిజన్స్ ఫైర్!

Big Stories

Advertisement
×