E-Paper
Advertisement

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్..ఉష అక్క టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్..ఉష అక్క టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే!
Advertisement

Usha Akka Top Folk Songs:ఫోక్ సాంగ్స్ ఇపుడు సినిమా సాంగ్స్ కన్నా మించి దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా పాటల్ని ఇలా వదిలితే అలా మిలియన్ల వ్యూస్ ని ఈజీగా క్రాస్ చేసేస్తున్నాయి.ఇక ఒకప్పుడు పల్లె ప్రాంతాలకే పరిమితమైన సింగర్స్ ఇపుడు ఊహించని క్రేజ్ సొంతం చేసుకుని స్టార్స్ గా వెలుగొందుతున్నారు.వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఉష అక్క.మరి ఉషక్క పాడిన పాటల్లో టాప్ 5 ఏంటో చూసేద్దాం !

ఉష అక్క విషయానికి వస్తే ఆవిడ పూర్తి పేరు మాడపొళ్ళ ఉషనమ్మ.వీరి ఇంట్లో ఉషనమ్మ చినప్పటి నుండే వాళ్ళ అమ్మ బతుకమ్మ పాటలు , పీర్ల పాటలు పాడుతూ ఉండేది.అలా చినప్పటి నుండి పాట పరిచయం కాగా అలా అలా పాటల్ని గుర్తుపెట్టుకుని పాడటం క్రమంగా అలవాటైపోయింది.

Advertisement

కెమరా పట్టినడే సీమ దసరా చిన్నోడు

ఇక అలా ఊర్లోనే పాటలు పాడుకునే ఉషక్క కి బాగా పేరు తెచ్చిన పాట ఏదైనా ఉందంటే అది ‘కెమరా పట్టినడే సీమ దసరా చిన్నోడు’ పాటనే.నిఖితతో కలిసి పాడిన ఈ పాట నెట్టింట ఏకంగా 12 కోట్లకి పైగా వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.ఇక ఈ పాట వచ్చినప్పుడే కాక ఇప్పటికీ ఈ పాటపై ఏంటో మంది రీల్స్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డీజే శేఖర్ అందించిన బీట్ కి ఉషక్క గొంతు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

Advertisement

‘రాతిరి రాతిరి రాతిరిలో’

ఇక ఉషక్క కి బాగా పేరు తీసుకొచ్చిన మరో పాట ‘రాతిరి రాతిరి రాతిరిలో’ అనే పాట. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కలిసి స్టెప్పులేసిన ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేసిసింది,ముఖ్యంగా వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది కూడా.ఇక సంతోష్,ప్రశాంత్ కలిసి రాసిన ఈ పాటని కృష్ణుడు ట్యూన్ చేయగా ఇప్పటికి ఈ పాట 97 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక నర్సింలు తో కలిసి ఉషక్క పాడటం పాటని మరో మెట్టు ఎక్కించింది.

ప్రమీల

ఇక ఇదే మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కాంబోలో ప్రమీల అంటూ మరో సెన్సేషన్ హిట్ అందించింది ఉష అక్క. సురేందర్ రాసిన ఈ పాట ఇప్పటికి 94 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుందంటే ఉషక్క వాయిస్ కున్న పవర్ అని చెప్పకతప్పదు. ఇక దీనికి కృష్ణుడు అందించిన మ్యూజిక్ తో పాటు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి స్టెప్పులు కూడా బాగా కలిసి వచ్చింది.

ఓ జానమ్మ

ఇక ఉషక్కకి పేరు తెచ్చిన మరో పాట ఓ జానమ్మ.జాను,సాగర్ కలిసి నటించిన ఈ పాటకి ప్రవీణ్ అర్జున్ సంగీతం అందించగా ఇప్పటికి ఈ పాట ఏకంగా 2 కోట్ల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం.కొంగరి కృష్ణ రాసిన ఈ పాట కి లీడింగ్ కోరియోగ్రఫీ వారు డిజైన్ చేసిన స్టెప్పులు ఆడియన్స్ ని ఎంతో అలరించాయి. ఇక ఉషక్క తో పాటు ఈ పాటని నికిత దామ కలిసి పాడటం విశేషం.

ఓం రెడ్డి ఓం పల్లి ఓ బావయ్య

ఇక ఇవే కాక ఓం రెడ్డి ఓం పల్లి ఓ బావయ్య అంటూ దిలీప్ తో కలిసి పాడిన పాట కూడా మంచి పేరే తెచ్చింది.దీనికి కూడా కొంగరి కృష్ణ లిరిక్స్ అందించగా, ఫోక్ ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న కళ్యాన్ కీస్ మ్యూజిక్ అందించడం విశేషం.మొత్తంగా 300 పాటలు పాడిన ఉషక్క రాబోయే రోజుల్లో మరిన్ని పాటలతో అలరించాలని కోరుకుందాం !

ALSO READ:నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

 

Tags

Related News

నిన్ను పుట్టించిన మీ అమ్మ అంటూ.. సోషల్ మీడియా బూతుల పై అనన్య ఎమోషనల్!

ఇంటిమేట్ సీన్స్.. బట్టలతో ప్రాబ్లం కాదు.. ఇండస్ట్రీ పై అనన్య శర్మ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?

నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

నిర్ణయం తీసుకోలేని వారు విజేత ఎలా అవుతారు.. ముఖేష్, త్రిగుణ్ పై నెటిజన్స్ ఫైర్!

గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న టాప్ కంటెస్టెంట్.. ఎవరంటే?

హౌస్ నుండి రామకృష్ణ కిడ్నాప్.. అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×