E-Paper
Advertisement

సరిగమపలో పాటలతో అదరగొడుతున్న కీర్తన.. కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

సరిగమపలో పాటలతో అదరగొడుతున్న కీర్తన.. కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Saregamapa Keerthana:జీ తెలుగులో టెలీకాస్ట్ అవుతున్న సరిగమప -ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ లో సత్తా చూపుతున్న వారిలో సరిగమప కీర్తన ఒకరన్న సంగతి తెల్సిందే.ఇప్పటికే తనదైన గొంతుతో అటు జడ్జ్ లతో పాటు ఇటు యావత్ తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తున్న ఈ అమ్మాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది.

తనది కర్నాటక అని తన తల్లి వైపు కుటుంబ సభ్యులంతా సంగీతానికి సంబంధించిన వాళ్లేనని, తండ్రి తో పాటు తండ్రి ఫ్యామిలీలో ఎక్కువమంది పోలీస్ శాఖలో పనిచేస్తారని తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చింది. ఇక తల్లి హౌస్ వైప్ అయినప్పటికీ తనమ్యూజికల్ జర్నీ సాఫీగా సాగడానికి తానూ అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది

Advertisement

నిజానికి ఒక సింగర్‌గా ఎదగాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదని అందుకు రోజూ సాధన చేయడం తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం కూడా ఎంతో అవసరమని ,ఈ విషయంలో తన తల్లి తనకి అండగా నిలుస్తుందని గుర్తు చేసుకుంది.ముఖ్యంగా తనతో పాటు ఉంటూ, తన అవసరాలను చూసుకుంటూ సంగీతం కోసం ఎంతో కష్టపడుతోందని తెలిపింది.

ఇక సరిగమప కార్యక్రమం తర్వాత తన లక్ష్యం పూర్తిగా మ్యూజిక్ ఫీల్డ్ లోనే కంటిన్యూ కావాలాని కోరుకుంటున్నానని,కేవలం కాంపిటీషన్ లలో పాల్గొనడం, నెగ్గడం వంటివే కాకుండా మ్యూజిక్ నే తన కెరీర్ గా మార్చుకోవాలని కోరుకుంటున్నట్టు మనసులోని మాటల్ని బయటపెట్టింది.ఇక ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటూనే తన వాయిస్ ని మరింత సాన బెట్టె ప్రయత్నంలో ఉన్నానని వివరించింది

Advertisement

సంగీత రంగంలోనే కొనసాగాలని ఉందని కీర్తన స్పష్టం చేసింది. కేవలం పోటీల్లో పాల్గొనడం, గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా సంగీతాన్నే తన కెరీర్‌గా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం సంగీతం నేర్చుకుంటూ తన గాత్రాన్ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇక తెలుగ సినిమాల గురించి కీర్తన మాట్లాడుతూ తానూ ఎక్కువ తెలుగు సినిమాలే చూస్తానని చెప్పుకొచ్చింది ,ఇక తన ఫేవరేట్ హీరో ఎవరనే ప్రశ్నకి సమాధానంగా ఒక్క హీరో అని కాకుండా ఒక్కో సినిమా చూసినప్పుడు ఒక్కో హీరోని ఇష్టపడతానని తెలిపింది.ఇక హీరోయినల్లో తనకి కీర్తి సురేష్, సాయి పల్లవి చాలా ఇష్టమని తన ఇష్టాలని తెలిపింది.

ముఖ్యంగా సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా తనకి బాగా నచ్చిందని, ఆ సినిమాకి తానూ ఫిదా అయ్యానని,అలాగే కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాని కూడా ఎన్నో సార్లు చూశానని తెలిపింది.ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాను కూడా రిపీట్ గా చూస్తానని,అందులో సిద్ధార్థ్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. సిద్ధార్థ్ పాటలు పాడటం కూడా తనకు తెలుసని, అందుకే అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని వివరించింది. మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా తనకు ఇష్టమైన హీరోలలో ఒకరని తెలిపింది కీర్తన.

చూడాలి మరి సింగర్ గా మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించాలని ఆశపడుతున్న ఈ యంగ్ సింగర్ కీర్తన ఆశలు ఎంత వరకు నెరవేరుతాయో, తన గొంతుతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే ఆ రోజు ఎప్పుడొస్తుందో !

ALSO READ:అషు రెడ్డి లుక్స్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఏముందిరా బాబూ!

Tags

Related News

లవ్ బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకున్న అనన్య.. సారీ చెప్పిన వర్ష!

బతకడానికి పైసలు లేవు.. ఇష్టంలేని సినిమాలు చేస్తున్నా.. అనన్య కన్నీటి కష్టాలు!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్..ఉష అక్క టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే!

నిన్ను పుట్టించిన మీ అమ్మ అంటూ.. సోషల్ మీడియా బూతుల పై అనన్య ఎమోషనల్!

ఇంటిమేట్ సీన్స్.. బట్టలతో ప్రాబ్లం కాదు.. ఇండస్ట్రీ పై అనన్య శర్మ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?

నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

Big Stories

Advertisement
×