Big Tv Kissik Talks: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీ స్థాయిలోనే ఆస్తులను కూడ పెడుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో భాగంగా ఈ వారం నటి అనన్య శర్మ(Ananya Sharma) పాల్గొన్నారు. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న అనన్య తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి అలాగే కెరియర్ గురించి కూడా మాట్లాడారు. నేపథ్యంలోనే యాంకర్ వర్ష మట్లాడుతూ హైదరాబాదులో సగం ఆస్తులు మనవేనట కదా అంటూ తన ఆస్తుల గురించి ప్రశ్న వేయడంతో అనన్య సమాధానం చెబుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో బ్రతకడానికి కనీసం పైసలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు. ఇష్టం లేకపోయినా సినిమాలు చేయాల్సి వస్తుంది.. సినిమాలను వదిలేసి వేరే కెరియర్ లోకి వెళ్దామని అనుకుంటున్నాను అంటూ అనన్య మాట్లాడారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం తనకు ఇష్టం లేకపోయినప్పటికీ, అవసరాలు నటింపచేస్తున్నాయనే ఉద్దేశంలో ఈమె మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మన జీవితంలో ఫ్రెండ్స్ ని నమ్మి ఎన్నో సందర్భాలలో మోసపోతూ ఉంటాము .అలా ఫ్రెండ్స్ చేతిలో మోసపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటూ కూడా వర్ష (Varsha)మరో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ తన జీవితంలో రొమాంటిక్ బ్రేకప్స్ కంటే కూడా ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఎక్కువగా ఉన్నాయని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తేలు ఎప్పుడు కుడుతూనే ఉంటుందని స్నేహితులు కూడా తేలు లాంటివారు అన్న నేపథ్యంలో ఈమె మాట్లాడారు.
మరి అనన్యను మోసం చేసిన ఆ స్నేహితులు ఎవరు? ఏంటి? అనే పూర్తి విషయాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది. అదేవిధంగా బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనన్య తన లవ్ బ్రేకప్ గురించి కూడా మాట్లాడారు అదే విధంగా ప్రస్తుతం తన స్టేటస్ ఏంటి అనే విషయాలను కూడా తెలియచేసినట్టు ప్రోమో వీడియో చూస్తేనే తెలుస్తుంది.
Also Read: నిన్ను పుట్టించిన మీ అమ్మ అంటూ.. సోషల్ మీడియా బూతుల పై అనన్య ఎమోషనల్!