E-Paper
Advertisement

ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!

ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!
Advertisement

Rashmika Mandanna: సినీనటి రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల రణబాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక త్వరలోనే మైసా సినిమా(Mysaa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ సినిమా నవంబర్ 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక మందన్న(Rashmika Mandanna) ఈ ఆదివారం బిగ్ బాస్ 10(bigg boss10) వేదికపై సందడి చేసిన సంగతి తెలిసిందే.

ముఖేష్ జూనియర్..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొంటూ హౌస్ మేట్స్ తో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఉన్న అందరిని పలకరించిన ఈమె కంటెస్టెంట్ ముఖేష్ గౌడ (mukesh gowda)ను కూడా పరిచయం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ముఖేష్ తో మాట్లాడుతూ .. ఇక్కడ రష్మిక ఉంది నీకు ఇష్టమైన మైసూరు కన్నడలో మాట్లాడతావా, బెంగళూరు కన్నడలో మాట్లాడతావా అని నాగార్జున అడిగారు. ఇక వెంటనే ముఖేష్ కన్నడలో రష్మికను పలకరిస్తూ.. కాలేజీలో మీరు నాకు జూనియర్ అని చెప్పారు.

ఒకే కాలేజీలో చదువుకున్న రష్మిక ముఖేష్..

Advertisement

ఇలా రష్మిక ముఖేష్ కు జూనియర్ అనే విషయం తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నా ఫ్రెండ్స్ మీతో కలిసి చదువుకున్నారు అప్పట్లో మిమ్మల్ని కాలేజీలో చూశాను అంటూ ముఖేష్ తమ కాలేజీకి సంబంధించిన విషయాలను పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇలా కాలేజీలో తనకు జూనియర్ అనే విషయం తెలిసిన రష్మిక ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, తన సీనియర్ ఇలా బిగ్ బాస్ వేదికపై కలవడం చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్ అంటూ చెప్పుకు వచ్చారు.

ఓటింగ్ పరంగా కలిసి వచ్చేనా..

ఈ విధంగా వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు అనే విషయం తెలియడంతో ఫాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గురించి ముఖేష్ టీం తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.. ముఖేష్ రష్మిక గారు మైసూర్ కన్నడలో చాలా అద్భుతంగా మాట్లాడుకున్నారు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రష్మిక గారు ముఖేష్ కి జూనియర్ కాలేజీ కనెక్షన్ నుంచి ఇలా బిగ్ బాస్ వేదికపై కలుసుకోవడం అద్భుతమైన క్షణం అంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ముఖేష్ రష్మిక సీనియర్ అనే విషయం తెలియడంతో వీరిద్దరి ఫాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రష్మికకు ముఖేష్ సీనియర్ అని తెలియడంతో ఓటింగ్ విషయంలో ముఖేష్ కి ఏమైనా కలిసి వచ్చేనా? ఓటింగ్ విషయంలో ముఖేష్ సేఫ్ జోన్ లో ఉంటారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

Related News

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

నాగవ్వ క్రేజ్ వేరే లెవల్.. వైష్ణవి సోనీ డాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్.. బుద్ధిలేదన్న శివ!

అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

Big Stories

Advertisement
×