E-Paper
Advertisement

రీల్స్‌లోనూ ఫుల్ ట్రెండింగ్.. ‘కొమ్మల బండున్నది ఉయ్యాలో’కు పెరుగుతున్న క్రేజ్!

రీల్స్‌లోనూ ఫుల్ ట్రెండింగ్.. ‘కొమ్మల బండున్నది ఉయ్యాలో’కు పెరుగుతున్న క్రేజ్!
Advertisement

Kommala Bandunnadi Uyyalo Folk Song :ఫోక్ సాంగ్స్ ఇపుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి.ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ని ఈ జానపదాలు తెగ అలరిస్తున్నాయి .ఇప్పటికే ఇలా ఎన్నో పాటలు అలరించి మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టగా తాజాగా ఇదే లిస్ట్ లోకి చేరింది ”కొమ్మల బండున్నది ఉయ్యాలో ”అనే ఫోక్ సాంగ్ .

కృష్ణుడు మ్యూజిక్ అందించిన ఈ పాటని ఎప్పటిలాగే ప్రభ ,నర్సింలు తమ గాత్రాలతో ప్రాణాలు పొయ్యగా వచ్చిన నెలరోజుల్లోనే ఈ పాట ఏకంగా 4 మిలియన్లకి పైగా వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.

Advertisement

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది

ఇక పాటకి మూలమైన ట్యూన్ ని అవుదుర్తి లక్ష్మణ్ అందించగా పార్వతి మహేష్ అందించిన పదాలు పాటని మరో ఎత్తులో కూర్చోబెట్టాయి.ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పాటలో స్టెప్పులేసిన డీజే సాగర్ ని ,యువ శ్రీ నాయుడు జంటని.యువ శ్రీ తన అందంతో పాటు అభినయంతో అదరగొట్టగా ,డీజే సాగర్ కూడా పాటకి తగ్గ ఫెర్ఫామెన్స్ ఇచ్చి అభిమానులని అలరించాడు.

Advertisement

ఇక ఈ పాటకి ఈ మధ్య కాలంలో వరుస సాలిడ్ హిట్స్ ని తమ ఖాతాలో వేసుకుంటున్న శ్రీకాంత్ లీడింగ్ బాయ్స్ కొరియోగ్రఫీ చేయగా ,యువశ్రీ తో కలిసి స్టెప్పులేసిన డీజే సాగర్ ఈ పాటని నిర్మించడం విశేషం.

also read:అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

ఈ పిల్ల ఏంట్రా అంత బాగుంది

ఇక పాటలకి తనదైన సినిమాటోగ్రఫీతో అద్భుతమైన విజువల్స్ అందించి మరింత ఆకర్షణ ని యాడ్ చేశాడు జనతాబబ్లు .ఇతను గతంలో చాలా హిట్ ఫోక్ సాంగ్స్ కి సినిమాటోగ్రఫీ అందించిన సంగతి మనకి తెల్సిందే.

ఇక ఈ పాటని చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో వదలడం విశేషం.కొంతమంది ఈ పిల్ల ఏంట్రా అంత బాగుంది అంటూ యువ శ్రీని ఆకాశానికి ఎత్తేయగా ,మరి కొందరు పాటని తీసిన విధానానికి ఫిదా అయిపోయి తెగ మెచ్చేసుకున్నారు.

పాటని వింటుంటే మళ్ళీ మళ్లీ

ఇక పాటని వింటుంటే మళ్ళీ మళ్లీ వినాలని కొంత మంది అంటే ,ప్రభ ,నర్సింలు ఎప్పటిలాగే పాటకి న్యాయం చేశారు అంటూ మరికొంతమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .ఇక ఈ మధ్య జానపదాలని చూస్తే బాయిలోనే బల్లి పలికే నుండి రాను బొంబాయికి రాను వరకు ఎన్నో పాటలు మిలియన్ల వ్యూస్ ని కొల్లగొడుతూ అటు అభిమానులకి ఎంటర్ టైన్ మెంట్ ఇటు నిర్మాతలకి కాసుల వర్షం కురిపించినవే.

also read:నాగవ్వ క్రేజ్ వేరే లెవల్.. వైష్ణవి సోనీ డాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

ఏది ఏమైనా ఒకప్పుడు పల్లెపదాలు అనుకున్న జానపదాలు ఇపుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్న పాటలుగా రూపాంతరం చెందడం మెచ్చుకోతగ్గ విషయమే.ఇక రిలీజ్ అయినప్పటి నుండి ఈ పాట రీల్స్ ,షార్ట్స్ ,స్టేటస్ కు అంటూ ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాని తెగ చుట్టేస్తోంది .చూడాలి మరి ముందు ముందు ఈ ”కొమ్మల బండున్నది ఉయ్యాలో ”పాట ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

Tags

Related News

ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

నాగవ్వ క్రేజ్ వేరే లెవల్.. వైష్ణవి సోనీ డాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్.. బుద్ధిలేదన్న శివ!

అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×