BigTV English

Intinti Ramayanam Today Episode : చావు అంచులవరకు వెళ్లిన మీనాక్షి.. చక్రధర్ గురించి నిజం చెప్తుందా?

Intinti Ramayanam Today Episode : చావు అంచులవరకు వెళ్లిన మీనాక్షి.. చక్రధర్ గురించి నిజం చెప్తుందా?

Intinti Ramayanam Today Episode November 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. గదిలోకి వెళ్లిన అక్షయ్ లైట్ ఆఫ్ చేసి ఉండటం చూసి ఎందుకు రూమ్ లో లైట్ ఆఫ్ చేశావని అడుగుతాడు. అప్పుడు ఎదురుగా అవని రొమాంటిక్ గా రెడీ కనిపిస్తుంది. అవనిని అలా చూసి షాక్ అయిన అక్షయ్ తో అవని నన్ను దూరం పెడతావా అని బాధ పడుతుంది. ఇక నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు.. మొత్తానికి అక్షయ్ మాత్రం అవని నిజం చెప్పేవరకు దగ్గరకు రానివ్వను అని వెళ్ళిపోతాడు. గాయం తగలడంతో హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడ మీనాక్షిని చూసి అసలు నిజం చెప్పాలని, ఆస్తి కోసం వస్తే ఇక నిన్ను, నీ పిల్లలను చంపేస్తాను అని చెబుతాడు.. ఇక మీనాక్షి భయపడుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో అందరు దీపావళి పూజ కోసం పూలు కడుతూ ఉంటారు. పార్వతి పల్లవి, బామ్మ అందరు పూలు కడుతున్నది చూసి అవని అక్కడకు వెళ్తుంది. అక్కడ భర్త అన్న మాటలను తలచుకొని బాధ పడుతూ అక్కడకు వెళ్తుంది. పార్వతి ఏమైంది అవని ఎందుకు బాధ పడుతున్నావా, ఏదైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య అంటుంది. అప్పుడే భరత్ అవనికి ఫోన్ చేస్తాడు. భరత్ ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసాడు. ఏమైంది అని ఆలోచిస్తుంది. అమ్మకు ఏమైనా అయ్యిందా అని ఎక్కిళ్ళు వచ్చినట్లు నాటకం ఆడుతుంది.. ఇక నీళ్లు తాగొస్తానని చెప్పి సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతుంది. భరత్ ఏమైంది అన్ని సార్లు కాల్ చేసావు.. అని అడగ్గా భరత్ అక్కా అమ్మకు సీరియస్ అయ్యింది. డాక్టర్లు చూస్తున్నారు అని అంటాడు. ఎదో చూసి భయపడింది.. ఏమైనా అవుతుందేమో అని టెన్షన్ పడతాడు. నువ్వు టెన్షన్ పడకు నేను వస్తున్నా అని చెబుతుంది.

ఇలా అవని ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లడం అక్షయ్ చూస్తాడు. ఇంత గొడవ జరిగినా నువ్వు వెళ్తున్నావా అని ఆలోచిస్తాడు… ఇక పల్లవి అవని లోపలికి వెళ్లి చాలా టైం అయింది ఇంకా రాలేదని తెలుసుకోవాలని చూస్తుంది. కానీ పార్వతి మాత్రం ఎక్కడికెళ్తున్నావ్ అ పూలయ్యేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చోవాలి అత్తయ్యకి హెల్ప్ చేయాలి అనేసి అంటుంది . ఇదే శాడిజం అంటే అని పల్లవి మనసులో అనుకుంటుంది. ఏమైందో చూసేసి వస్తానని పల్లవి మళ్లీ లేస్తుంది. అప్పుడు బామ్మ పని తప్పించుకోవడానికి ఇదొక వంకా అనుకుంటా అనేసి అంటుంది. ఇక పార్వతి అంత మాట అన్నారు ఏంటి అత్తయ్య పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంతవరకుచాకిరి చేస్తుంది అవని. పనంత ఒక్కటే చేసుకుంటుంది అలసిపోయి పడుకున్నట్టుంది పడుకొనివ్వండి రేపు పొద్దున్నే పూజ గురించి తానే చూసుకోవాలి కదా అనేసి అంటుంది.


హాస్పిటల్ కి వెళ్ళిన అవని డాక్టర్ని అడుగుతుంది. మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ ఇప్పుడు అని అడుగుతుంది. దానికి డాక్టర్ ఏదో చూసి టెన్షన్ పడింది లేదా ఎవరినో చూసి బాగా కంగారుపడింది. అనేసి అంటుంది. గుర్తు రాకుండా ఉండడానికి ఇంజక్షన్ ఇచ్చాము టెన్షన్ పడడం వల్ల బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయింది. కాసేపు నిద్రపోతుంది మత్తుగా ఉంటుంది మీరు ఆమెని డిస్టర్బ్ చేయకండి అనేసి డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక భరత్ అక్క ఏమైంది అక్క నాకు టెన్షన్ గా ఉంది అనే అంటాడు. అప్పుడు మీనాక్షి నా పిల్లల్ని నీ దగ్గరికి తీసుకురాను నువ్వు వద్దు నువ్వు ఎవరో కూడా నాకు చెప్పను నేను అనుకున్నదే జరిగింది నా పిల్లల్ని ఏం చేయకు అనే టెన్షన్ పడుతూ కలవరిస్తుంది. అంటే నాన్న ఇక్కడికి వచ్చాడా అని అవని మనసులో అనుకుంటుంది. ఇక మీనాక్షిని పిలుస్తుంది ఏమైందమ్మా ఇంతగా కలవరిస్తున్నావ్ . నీకు సడన్గా ఎవరు కనిపించారు ఎందుకు అంత కంగారు పడ్డావు అని అడుగుతుంది . నాన్న ఏమైనా కనిపించాడ ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావ్ చెప్పమ్మా అని అవని మీనాక్షిని అడుగుతుంది. కానీ మీనాక్షి మాత్రం ఏం లేదమ్మా ఏదో పిడకలని చెప్తుంది.

ఇక కమల్కు తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. తనకి పెళ్లయి పది నెలలు అయిందని పెళ్లయిన మొదటి నెల తన భార్య ప్రెగ్నెంట్ అయిందని ఇప్పుడు తనకి కొడుకు పుట్టాడని చెప్తాడు. నాకు పెళ్లయింది కదా నా భార్య ఎందుకు ప్రెగ్నెంట్ అవలేదు అర్జెంటుగా వెళ్లి బామ్మ అని అడుగుతాడు . నాకు పెళ్లయింది కదా నా భార్య ఎందుకు ప్రెగ్నెంట్ అవలేదు. ఇద్దరు వెళ్లి ఇద్దరు హాస్పిటల్ కెళ్ళి చూపించుకోండి అని బామ్మ సలహా ఇస్తుంది. ఇక పల్లవి దగ్గరికి కమలొచ్చింది ఇక కమల్ పల్లవి దగ్గరికి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెప్తాడు. హాస్పిటల్ కి వెళ్తే అబార్షన్ విషయం బయటపడుతుందని పల్లవి హాస్పిటల్ కి వెళ్ళడానికి ఇష్టపడదు. ఇంకా ఆరు నెలలు చూసి తర్వాత వెళ్దామని పల్లవి చెప్పి వెళ్ళిపోతుంది.

ఇక చక్రధర్ తన ఫ్రెండ్ తో సిట్టింగ్ చేసి ఉంటాడు. మీనాక్షి వచ్చిందని చెప్తాడు నీ మొదటి భార్య గురించి మీనాక్షికి తెలుసా? నీ మొదటి భార్య గురించి రాజేశ్వరి కి తెలుసా అని తన ఫ్రెండు చక్రధర్ అని అడుగుతాడు. మీనాక్షి చెప్పదు ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుకోవడం అవసరం లేదనేసి చక్రధర్ అప్పటి అక్కడితో ఆపేస్తాడు దానికి తన ఫ్రెండు కూడా సరే అంటాడు. ఇక తర్వాత రోజు ఇంట్లో దీపావళి పండుగ పూజను మొదలుపెడతారు. అందరూ పూజలో ఉంటే అవని పూజ చేస్తుంది.. ఇక అప్పుడే కమల్ కాఫీ కావాలని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయకు అవని కాఫీ ఇస్తుంది. కానీ అక్షయ్ తీసుకోడు. నా మీద కోపం నా మీదే చూపించాలి కానీ దీని మీద చూపించడమేంటని అడుగుతుంది. ఇక అక్షయ్ అవని మీద అరుస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ అవనిపై అరవడం చూసి అందరూ షాక్ అవుతారు రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Bigtv Kissik Talks:  మహేష్ విట్టా సినిమాల్లోకి అలా వచ్చాడా? ట్విస్టులు చాలానే ఉన్నాయే.. ఫన్ బకెట్ లేకపోతే?

Shobha Shetty: బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. రేపే ప్రారంభం!

Tv Serials: టీవీ సీరియల్స్ కు కమిట్మెంట్ తప్పనిసరినా? ఆ ఒక్కటి చెయ్యడం కుదరదు..

Intinti Ramayanam Today Episode: భరత్ ను ఇరికించిన పల్లవి.. అవనికి బిగ్ షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..?

Nindu Noorella Saavasam Serial Today october 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ   

Big Stories

×