BigTV English
Advertisement

Daali dhananjay: పెళ్లికి సిద్ధమవుతున్న ‘పుష్ప’ నటుడు.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్..!

Daali dhananjay: పెళ్లికి సిద్ధమవుతున్న ‘పుష్ప’ నటుడు.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్..!

Daali Dhananjay : ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం పుష్ప (Pushpa ). ఈ సినిమాలో జాలి రెడ్డి (Jali Reddy) గా నటించి తనదైన విలనిజం చూపించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందిన కన్నడ నటుడు ధనంజయ్ (Dhananjay) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన అక్కడ విలన్ గా కూడా పలు సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈయనను ఈయన అభిమానులు ముద్దుగా డాలీ అని పిలుస్తారు. అందుకే డాలీ ధనుంజయ్ గా మారిపోయారు.


జాలి రెడ్డిగా అవకాశం…

ఇండస్ట్రీలోకి రావాలనే తపన ఆయనను నటుడిగా మార్చేసింది. అటు కన్నడలో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ధనంజయ్‌ను చూసి ఫిదా అయిన డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రకు కరెక్ట్ గా సరిపోతారని అవకాశం ఇచ్చారు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ అయ్యారు ధనంజయ్. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప -2 సినిమాలో కూడా నటించి అదరగొట్టేయబోతున్నాడు అని సమాచారం. మొత్తానికి అయితే ఈ రెండు సినిమాలు ధనంజయ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును అందించాయి అని చెప్పవచ్చు.


ఓ ఇంటి వాడు కాబోతున్న జాలిరెడ్డి..

ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనంజయ్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా తన కాబోయే భార్య ధన్యత (Dhanyatha) ను పరిచయం చేశారు ధనంజయ్. ఈమె వృత్తిరీత్యా డాక్టర్.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన అమ్మాయి. గైనకాలజిస్ట్ లో స్పెషలిస్ట్ కూడా. అయితే వీళ్ళిద్దరికీ చాలా రోజుల క్రితమే పరిచయం వుందట. మొదట అందరిలాగే వీరు కూడా స్నేహితులుగా మారి, ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడుకొని , ఆ ఇష్టాలను ఒకరికొకరు తెలియజేసుకొని, ప్రేమికులుగా మారారు. ఇన్ని రోజులు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు.

నిశ్చితార్థం పూర్తి..

ధనుంజయ్ కి వివాహం జరిగబోతుందని తెలిసి ఆయన లేడీ ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి భర్త రావాలని కోరుకునే ఎంతోమంది అమ్మాయిలు ఇప్పుడు నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా తన కాబోయే భార్యతో రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అందరిని కట్టిపడేసింది. ఈ ఫోటోలు చూసి అమ్మాయిలు సైతం కుళ్ళుకుంటున్నారు. మొత్తానికైతే జాలిరెడ్డి కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నాడు అని తెలిసి పలువురు సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే లేదా అంతకుముందే వీరు వివాహం చేసుకోబోతున్నారని సమాచారం . ఎట్టకేలకు ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పుష్ప -2 విషయానికి వస్తే.. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

 

View this post on Instagram

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×