E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్.. రమ్య ఎంట్రీతో షాక్.. భరత్ కు వార్నింగ్..

Intinti Ramayanam Today Episode: అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్.. రమ్య ఎంట్రీతో షాక్.. భరత్ కు వార్నింగ్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 9th : ఇక పంతులుగారు పూజ చేసి మంత్రాలు చదివి మొత్తాన్ని పూజను విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే పూర్తయిన తర్వాత పానకంలో ఇక్కడ పూజ చేసిన పసుపు కుంకుమ ని వేసి పానకం ని మీరు సేవిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది అని పంతులుగారు చెప్పగానే అలానే అని అంటారు. ఇక పల్లవి మాత్రం వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదో ఒకటి చేసి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలి అని అనుకుంటుంది.. అయితే ఆ పానకంలో ఏదో ఒకటి కలిపి వీళ్ళందరికీ ఏదో ఒకటి జరిగేలా చేయాలి అని ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. పల్లవి ఏదో ఒక ప్లాన్ తో వచ్చింది అని అటు అవినీతి కంగారు పడిపోతూ ఉంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న రమ్య..

ఇక రమ్య పెద్దింటి వాళ్ళు కాబట్టి మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అని అవని వాళ్ళ ఇంటికి వెళ్లి ఎందుకు రెడీ అవుతూ ఉంటుంది. అయితే మంచి డ్రెస్ వేసుకొని వెళ్లాలని వెతుకుతూ మొత్తానికి డ్రెస్ వేసుకొని బయటికి వస్తూ ఉండగా వాళ్ళ అన్నయ్య సడన్గా ఎంట్రీ ఇస్తాడు. నువ్వు కూడా నన్ను వదిలేసి లేచిపోతున్నావా ఎవరితో వెళ్తున్నావు అని అవమానించేలా మాట్లాడుతాడు. నేను ఎప్పటికీ ఎవరిని ప్రేమించిన అన్నయ్య నువ్వు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది అని రమ్య అంటుంది. అయితే పండగే కాబట్టి ప్రసాదం చేశాను అని రమ్య ఎంత చెప్తున్నా సరే వాళ్ళ అన్నయ్య మాత్రం మందులోకి ఎవరైనా మంచి కారంగా తినాలనుకుంటాడు ఇలా తీయగా పాయసం చేయాలనుకుంటాడా అని దాని విసిరి కొట్టేస్తాడు సరే అన్నయ్య నీకోసం నేను ఏదైనా తీసుకొని వస్తానులే అని అంటుంది ఇక మొత్తానికి అబద్దం చెప్పి గుడికి అని అవని వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

పల్లవి మాస్టర్ ప్లాన్..

Advertisement

పూజ పూర్తవుగానే అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అయితే అలా వాళ్ళందరూ సంతోషంగా ఉండడం చూసిన పల్లవి కుళ్ళుకుంటుంది.. చూసావా పల్లవి నువ్వు ఒక్కదానివి ఉన్నావన్న సంగతి కూడా వెళ్లి మర్చిపోయి చాలా సంతోషంగా ఎలా ఉన్నారు అని భానుమతి పక్కనుంచి పల్లవికి ఎక్కిస్తూ ఉంటుంది. ఈ సాయంత్రం పూజ అయ్యేలోగా నిన్ను ఒక్కరైనా కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని పల్లవికి భానుమతి సలహాలు ఇస్తూ ఉంటుంది. నువ్వు పిలిచినందుకు నేను రాలేదు నేను చేయాలనుకున్నది చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను అని పల్లవి మనుషులు అనుకుంటుంది ఎలాగైనా సరే ఆ పనిని తప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి.

అవని చచ్చిపోతుందా..?

అతనిని అలాగే అత్తయ్యని చంపేస్తే నా గురించి తెలిసిన నిజాలు ఎవరికీ తెలియవు కదా అని అనుకుంటుంది పల్లవి. అయితే స్వామివారి పానకంలో విషయం కలిపి వాళ్ళిద్దరికీ ఇచ్చి చంపేయాలని అనుకుంటుంది. కానీ కమల్ వచ్చి ఈ మధ్యలో ఆ పానకంను విసిరి కొట్టేస్తాడు దాంతో పల్లవి ఫ్యాను దారుణంగా ఫెయిల్ అయిపోతుంది నువ్వు నాటకాలు ఆడుతూ ఇలా చేయడం వల్ల నీకు ఏమీ రాదు అని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఈ తింగరోడు ఒక్క నిమిషం లేట్ వచ్చినా నా ప్లాన్ సక్సెస్ అయ్యేది అని కమల్ గురించి పల్లవి అనుకుంటూ ఉంటుంది.అయితే అమ్మవారి ప్రసాదం నేలపాలు చేశాడు అని కమల్ని అందరూ అరుస్తారు. అమ్మవారికి దండం పెట్టుకుంటాను అని కమల్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు రమ్య ఇంట్లోకి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ పల్లవి మాత్రం షాక్ అవుతుంది.

రమ్య ఎంట్రీతో పల్లవికి షాక్..

Advertisement

రమ్య ఇంట్లోకి రావడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా తనని లోపలికి తీసుకొని వస్తారు. దాంతో ఎవరు ఈవిడ ఇంత విఐపి లాగా చూసుకుంటున్నారే అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కొత్త క్యారెక్టర్ పైన నాకు ఏదో అనుమానంగా ఉంది ఎవరు ఈవిడ కనుక్కోమని భానుమతిని పంపిస్తుంది. భానుమతి కూడా ఆ రమ్య ఎవరు అంతగా తనని పొగిడేస్తున్నారే అంతగా అభిమానిస్తున్నారు. అందరూ కలిసి తనని చూసుకుంటున్నారు కదా.. ఇంతకీ ఎవరు ఈ అమ్మాయి కమల్ తో కూడా చాలా సరదాగా మాట్లాడుతుందని అనుమానంగా చూస్తూ ఉండిపోతారు. ఇక పల్లవి ఎలాగైనా సరే ఈ రమ్యని కమల్ కి దూరం చేయాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మహా అవుట్..?

Related News

Brahmamudi Serial Today Episode November 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు చుక్కలు చూపించిన శేషు  

అబ్బా.. పంచెకట్టులో బాలు ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు ఫిదా..!

‘ పొదరిల్లు ‘ మనీషా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మహా అవుట్..?

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

దీవాలి స్పెషల్.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీముఖి.. పప్పన్నం పెట్టబోతుందా?

2029 లో ఏపీ సీఎం అయ్యేది అతనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?

Big Stories

Advertisement
×