Hyderabad City: దీపావళి పండగ చాలామంది జీవితాల్లో వెలుగులు నింపితే.. బాణాసంచా కారణంగా కొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. రాత్రి బాణాసంచా కాల్చిన వ్యవహారంలో గాయపడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పదుల సంఖ్యలో బాధితులు మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలివస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
దీపావళి పండగ వేళ కొందరి జీవితాల్లో ఆనందం నింపితే.. మరికొందరు జీవితాల్లో విషాదం మిగిలింది. దీపావళి పండగ వేళ బాణా సంచా కాల్పే క్రమంలో అప్రమత్తంగా లేకపోవడంతో పలువురు కళ్లకు గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి బాధితులు మెహిదీపట్నంలోని కంటి ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఇప్పటివరకు 32 మంది బాధితులు చికిత్స పొందారని అధికారులు వెల్లడించారు.
తీవ్రంగా గాయపడినవారిలో ఆరుగురులో నలుగురు చిన్నారులు ఆసుపత్రిలో చేర్చినట్లు ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. మిగిలిన 26 మందికి మందులు ఇచ్చి తదుపరి సంరక్షణ కోసం తిరిగి రమ్మని కోరినట్టు వెల్లడించారు. మిగిలిన వారికి చికిత్స ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. వారిలో ఒకరు కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయారని చెప్పారు.
దీపావళఇ పండుగ వేళ మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఆ తరహా బాధితుల కోసం 20 పడకలను కేటాయించింది. వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్ల బృందాలను రెడీ చేసింది. వివిధ ప్రాంతాల నుంచి అత్యవసర కేసులను హైదరాబాద్‌కు తీసుకురావడానికి జిల్లాల్లో అంబులెన్స్‌లను మోహరించారు.
ALSO READ: దీపావళి వేళ బాణాసంచా నిప్పు రవ్వలు.. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు, ఆస్తి నష్టం
గత రెండు దీపావళి సీజన్లలో బాణసంచా గాయాలతో బాధితులకు 100 కి పైగా రోగులకు చికిత్స అందించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. బాణసంచాను అజాగ్రత్తగా వాడటం వల్ల కాలిన గాయాలు, కంటికి శాశ్వత నష్టం వాటిల్లవచ్చని హెచ్చరించారు. ప్రాథమిక ప్రథమ చికిత్స సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, కంటికి గాయాలు అయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వారు సూచించారు.