E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు చుక్కలు చూపించిన శేషు  

Brahmamudi Serial Today Episode November 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు చుక్కలు చూపించిన శేషు  
Advertisement

Brahmamudi serial today Episode:  అపర్ణ చెప్పినట్టు రాజు రూంలోకి వెళ్లి దుప్పటి దిండు తెచ్చుకుంటాడు. సోపాలో పడుకోవడం పెద్ద పెద్దొళ్లకు తప్పలేదు మనమెంత అనుకుంటూ సోపాలో పడుకుంటాడు. అది చూసిన ఐశ్వర్య ఎస్‌ అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. పక్కనే రేఖ, భ్రమరాంబ ఉండటం చూసి షాక్‌ అవుతుంది. ఏంటి మీరు ఇంకా పడుకోలేదా..? అని అడిగితే.. లేదు అయినా నువ్వేంటి వాళ్ల శోభనం జరగకపోతే సంతోషిస్తున్నావు అని అడుగుతారు భ్రమరాంబ, రేఖ. ఎందుకంటే వాళ్ల శోభనం జరగకుండా ప్లాన్‌ చేసిందే నేను.. ఆ పంతులుకు అలా చెప్పమని డబ్బులు ఇచ్చానని ఐశ్వర్య చెప్తుంది.

మన పర్మిషన్‌ లేకుండా ఇందు మెడలో తాళి కట్టి దానికి మొగుడైపోయానని ఎంత పొగరు చూపించాడు. ఇప్పుడు చూడండి నట్టింట్లో పడుకోబెట్టాను అని చెప్తుంది. రేఖ గుడ్‌ ఐడియా అంటే లేకపోతే నిన్ను అవమానించిన వాడు ఇందుతో సతోషంగా కాపురం చేస్తుంటే.. నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా..? అంటూ ఐశ్వర్య చెప్తుంటే.. ఆ చాల్లే సంబరం అంటుంది భ్రమరాంబ.  అంటే ఏంటి మీరనేది అని ఐశ్వర్య అడిగితే.. ఏముంది పంతులుతో అబద్దం చెప్పించి వాడిని మూడు రోజులు బయట పడుకోబెడితే ఏం వస్తుంది అని భ్రమరాంబ అడుగుతుంది. నాకు మీకంటే తక్కువ అనుభవం ఉండొచ్చు.. కానీ వాళ్లిద్దరితో ఎక్కువ అవమానించబడింది నేను అంత ఈజీగా వదిలేస్తానా..? చూస్తూ ఉండండి నేనేం చేస్తానో అంటూ వెళ్లిపోతుంది ఐశ్వర్య.

Advertisement

అందరూ పడుకున్నాక ఇందును డిస్టర్బ్‌ చేయాలని రాజు వెళ్లి డోర్‌ కొడతాడు. ఇందు వచ్చి డోర్‌ తీస్తుంది. ఎందుకొచ్చావని అడిగితే దాహంగా ఉందని రాజు అడిగితే.. వాటర్‌ బాటిల్‌ ఇచ్చి డోర్‌ క్లోజ్‌ చేస్తుంది ఇందు. ఈ ప్లాన్‌ వర్కవుట్‌ అవ్వలేదు ఇంకో ప్లాన్‌ వేద్దాం అనుకుంటూ.. వెళ్లి మళ్లీ డోర్ కొడతాడు ఇందు వస్తుంది. మళ్లీ ఏంటని అడుగుతుంది. నీ వేషాలు నాకు తెలియదా ఏంటి అంటుంది. అప్పుడే శేషు వస్తాడు. శేషును చూసిన రాజు అక్కడి నుంచి హాల్లోకి వెళ్లిపోతాడు. శేషు ఐడియా ప్రకారం ఇందు, అపర్ణ రూంలోకి వెళ్తుంది. శేషు ఇందు రూంలోకి వెళ్లి పడుకుంటాడు.

అర్ద్రరాత్రి అయ్యాక రాజు మళ్లీ వెళ్లి డోర్‌ కొడతాడు. డోర్‌ ఓపెన్‌ అవుతుంది. దేవుడా నువ్వు ఉన్నావయ్యా..? అనుకుంటూ రూంలోకి వెళ్తాడు. రూంలో శేషు దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు. రాజు మెల్లగా వెళ్లి శేషు పట్టుకుని ముఖం మీద చేయి వేసి చూస్తాడు. చేతికి మీసాలు గడ్డం తగలడంతో ఇదేంటి ఇందు అంటూ దుప్పటి తీసేస్తాడు. శేషును చూసి షాక్‌ అవుతాడు. ఇద్దరి మధ్య ఫన్నీ కామెంట్స్‌ నడుస్తాయి. తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కిచెన్‌లో ఉన్న ఇందును చూసి నందు వెటకారంగా మాట్లాడుతుంది. వాడిపోయిన తోటకూర కట్టలా మారిపోయావేంటి అంటుంది. అందుకు ఇందును నందును తిడుతుంది. నాతో ఆటలాడొద్దు అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని చంపేందుకు పల్లవి ప్లాన్.. రమ్య ఎంట్రీతో షాక్.. భరత్ కు వార్నింగ్..

అబ్బా.. పంచెకట్టులో బాలు ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు ఫిదా..!

‘ పొదరిల్లు ‘ మనీషా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మహా అవుట్..?

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

దీవాలి స్పెషల్.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీముఖి.. పప్పన్నం పెట్టబోతుందా?

2029 లో ఏపీ సీఎం అయ్యేది అతనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?

Big Stories

Advertisement
×