Gajulu Galagala Song:గాజులు గలగల అనే పాటతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ కొట్టేసిన రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఇప్పుడు రీల్స్ తో మరింత వైరల్ అవుతుంది. ముఖ్యంగా మాధురి రాథోడ్ చేసిన బిందెలు బిందెలు బావయో అనే పాటకి డాన్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది,అలాగే మరికొన్ని పాటలకి కూడా డాన్స్ చేస్తూ ట్రోలర్స్ కి మరింత పని పెడుతుంది.
కొద్ది మంది మాత్రమే బాగుంది అని కామెంట్
అవును ..పాట వదలగానే కొద్ది మంది మాత్రమే బాగుంది అని కామెంట్ చేస్తుంటే ఎక్కువ మంది మాత్రం నెగటివ్ కామెంట్స్ చేయడం ఇక్కడ గమనార్హం. కొందరు మాట్లాడుతూ ఒకరితో పోల్చుకోకు,నీది అసలే పేడ మొహంలా చూడడానికి దర్ద్రంగా ఉంది అంటూ కామెంట్ చేస్తే మరొకరు మాత్రం తమదైన సలహా ఇచ్చారు.
గిన్నె పట్టుకుని అడుక్కు తింటున్నారు
సోషల్ మీడియా నిన్ను పైకెత్తి పైకెత్తి ఒకేసారి కిందకు పడేస్తుంది తస్మాత్ జాగ్రత్త రాధమ్మ బిడ్డ. డబ్బులు సంపాదిస్తావు కానీ నీ జీవితాన్ని మాత్రం కోల్పోతావ్ కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. ఇక్కడ నీకంటే మహా మేధావులు ఎంతోమంది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ఆ తర్వాత ఒకేసారి వాళ్ళని వదిలి పెట్టేస్తే రోడ్డుమీద గిన్నె పట్టుకుని అడుక్కు తింటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండు నీ మంచికే ఇది చెప్తున్నాను జాగ్రత్త అంటూ మరొకరు రాధమ్మ కూతురికి సలహా ఇవ్వడం ఇక గమనార్హం.
డబ్బులు వస్తాయి అంటే డాష్ లా తిరుగుతారు
మరికొందరు ఓరి దీని యేశాలో అంటూ కామెంట్ చేస్తే ఇంకొందరు మాత్రం సరిగ్గా నీకు సరిపోయింది డ్యాన్స్ నీ బతుకు ఇంతేలే అంటూ ఏకీపాడేసారు .ఇక మరి కొంతమంది తెగించిన వారికి ఏముందిలే వాళ్ళు అసలు కామెంట్స్ పట్టించుకోరు .ముందు ముందు ఇలాంటి వాళ్లు డబ్బులు వస్తాయి అంటే డాష్ లా తిరుగుతారు అంటూ నెగెటివ్ కామెంట్స్ పెట్టడం బాధాకరం.
అయితే ఇంతకుముందు కూడా ఈవిడ రీల్స్ చేసినప్పటికీ ఏ ముహుర్తాన గాజులు గలగల సాంగ్ రాత్రికి రాత్రే వైరల్ అయిందో అప్పటినుంచి ఈ రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఫోక్ సాంగ్స్ ,అలాగే ఇంటర్వ్యూస్ అంటూ ఈమధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇంకెలాంటి సంచలనాలకి తెరతీస్తుందో !
ఇక గాజులు గలగల పాట విషయానికి వస్తే రిలీజైన 10 రోజుల్లోనే ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టి సెన్సియేషన్ క్రియేట్ చేస్తుంది చూడాలి మరి ఈ రాధమ్మ కూతురు ముందు ముందు ఇంకెలాంటి సంచలనాలకి తెరతీస్తుందో !
ALSO READ :గాజులు గలగల పాట కోసం రాధమ్మ కూతురు ఎంత తీసుకుందో తెలుసా?