Intinti Ramayanam Today Episode October 31st: రమ్య తన అన్నయ్య ఎక్కడికి వెళ్లాడో అర్థం కావడం లేదు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు ఏం చేస్తున్నాడు అర్థం కావడం లేదు ఇంత టైం అయినా ఇంకా రాలేదు కదా ఎక్కడికి పోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రమ్య. అయితే అప్పుడే ఎవరో కలుపుకొట్టడంతో ఎవరు వచ్చారు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. బయట ఒక వ్యక్తి కనిపించడంతో షాక్ అవుతుంది రమ్య. అయితే రమ్య ఆ వ్యక్తి వంకరగా చూస్తున్నాడని అర్థం చేసుకుంటుంది అయితే రమ్య మీద ఆయన అఘాయిత్యం చేయబోతాడు. రమ్య దాంతో చాలా భయపడిపోతుంది. అన్నయ్య తాగొచ్చి అందరి చేత ఇలా అనిపిస్తున్నాడు అని బాధ పడిపోతూ ఉంటుంది.
పల్లవి లాయర్ తో ఎలాగైనా సరే కోర్టులోనే తేల్చుకోవాలి అని అనుకుంటుంది. అయితే కోర్టుకు వెళ్లగానే అక్కడ అవని ఇరికించి కమల్ తో నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని ఆలోచిస్తూ ఫోన్ మాట్లాడుతూ వస్తుంది ఎదురుగా వచ్చిన అవనిని చూసి సడన్ గా బ్రేక్ వేస్తుంది. ఎలాగైనా సరే అవనితో తేల్చుకోవాలి అని అనుకుంటుంది అయితే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను అని పల్లవి అనడంతో పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా అవని కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంది. కానీ పల్లవి మాత్రం అవనితో నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. నువ్వు చూస్తూ ఉండు అని చాలెంజ్ చేస్తుంది.
ఎలాగైనా సరే తనకు విడాకులు రాకూడదు అని ఒక లాయర్ ని కలవాలి అని అనుకుంటుంది. అయితే ఆ లాయరు చక్రధరికి తెలిసిన వ్యక్తి అని పల్లవికి తెలుస్తుంది. ఇక లాయర్ దగ్గరికి వెళ్ళగానే మా ఫ్రెండు మిమ్మల్ని కలవమని అపాయింట్మెంట్ తీసుకుంది. నాకు నా భర్త నుంచి విడాకులు వద్దు నా భర్తతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అతను చాలా మంచివాడు కానీ అతని వదిన మా ఇద్దరిని విడగొట్టాలని అనుకుంటుంది. తన నుంచి ఎలాగైనా నా భర్తని దూరం చేసి నాకు దగ్గర చేస్తారని మీ దగ్గరికి వచ్చాను.. నాకు విడాకులు రాకుండా చేయాలి మీరు అని పల్లవి అంటుంది. అయితే ఆ లాయరు మీ నాన్న నాకు బాగా తెలిసిన వారు కాబట్టి మీ కేసిన టేకప్ చేశాను మీకు ఎలాగైనా సరే విడాకులు రాకుండా చేస్తాను అని అతను అంటాడు.. అవని గురించి లాయర్ కి చెడుగా చెప్పి ఎలాగైనా సరే ఈ కేసుని తానే గెలవాలి అని అనుకుంటుంది పల్లవి.
ఇక శ్రీకర్ ఒక మనిషికి టిఫిన్ తీసుకురమ్మని చెప్తాడు అయితే ఆ వ్యక్తి టిఫిన్ తీసుకుని వచ్చి లోపల పెట్టాలని అనుకుంటాడు. అయితే ప్లేట్లు పెట్టి తీసుకురా అని శ్రీకర్ లోపల పంపిస్తాడు. అప్పుడే మంజుల వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేసి నాకు మంజుల నుంచి డాక్యుమెంట్స్ కావాలి అని మాట్లాడుతాడు. అది విన్న ఆ వ్యక్తి మంజుల కి చెప్పేలా కనిపిస్తాడు అయితే శ్రీకర్ మాత్రం అతను పెట్టిన టిఫిన్ ని ఏం మాట్లాడకుండా తింటాడు మరి అతను ఏమైనా అందులో కలుపుతాడా లేదా మంజులకు ఈ విషయం గురించి చెప్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకవేళ మంజుల గనుక దొరక్కపోతే శ్రీకర్రెండు కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అన్నది కాస్త సస్పెన్స్ గానే ఉంది.
భరత్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా భానుమతి భరత్ నువ్వు పల్లవికి తోడుగా ఉన్నావు చాలా థాంక్స్ అని మొదలు పెడుతుంది..అయితే మీ అవ్వని అక్క వల్లే పల్లవి జీవితం ఇలా మారిపోయింది అని భానుమతి చెప్పడంతో భరత్ కూడా అవును అవని అక్క ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు.. అయితే ప్రణతి భరత్ కి అలాగే వాళ్ళ నానమ్మకి కాఫీ తీసుకొని వస్తుంది. అవని గురించి చెడుగా చెప్పి పల్లవి గురించి మంచిగా చెప్పినా కూడా ప్రణతి మాత్రం భానుమతిని అస్సలు లెక్కచేయదు. ఈ ప్రణతి ఎప్పుడూ అవని భజన చేస్తూ ఉంటుంది. పల్లవి గురించి అస్సలు ఆలోచించదు అని అనుకుంటూ ఉంటుంది. ఏమి బాధపడకండి బామ్మ గారు నేను పల్లవి సిస్టర్ కి ఎప్పుడు తోడుగా ఉంటాను అని భరత్ భానుమతికి హామీ ఇస్తాడు..
కమల్ రమ్యతో ప్రేమలో పడేలా కనిపిస్తాడు కమల్ ఎక్కడ కనిపిస్తే రమ్య అక్కడ ఉండడంతో వాళ్ళిద్దరూ మరి కొద్ది రోజుల్లో ప్రేమలో పడే అవకాశం ఉంది అని స్పష్టమవుతుంది మరి త్వరలోనే వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ మొదలవుతుందేమో చూడాలి.. అటు ఆరాధ్య కోసం అమ్మవారి గెటప్ ని చేయించడానికి రమ్యను బుక్ చేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..