E-Paper
Advertisement

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
Advertisement

Moinabad Tragedy: కాలేజీలో జరిగే ఫెస్ట్ అంటే విద్యార్థులకు పండగే. స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాల్సిన ఆ వేడుక, ఇద్దరు యువకుల జీవితాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని మొయినాబాద్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగింది?

Advertisement

మొయినాబాద్‌లోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫెస్ట్ ముగిసిన తర్వాత, సుమారు 10 మంది విద్యార్థులు కలిసి సమీపంలోని పొలాల వైపు వెళ్లారు. అక్కడ వారంతా కలిసి మద్యం సేవిస్తుండగా.. ఊహించని విధంగా పోలీసుల పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది.

భయంతో పరుగులు.. అనంత లోకాలకు..

Advertisement

పోలీసులను చూసి భయాందోళనకు గురైన విద్యార్థులు దొరికిపోతామనే కంగారులో చీకట్లో పరుగులు తీశారు. ఈ క్రమంలో రైతు రాజిరెడ్డి తన పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించకపోవడంతో, వాటికి తగిలి షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో మోహన్‌తో పాటు మరో విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందారు. సరదాగా గడపడానికి వచ్చి, భయంతో తీసిన ఒక్క పరుగు ఇద్దరి జీవితాలను బలి తీసుకోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఒకే చోట 500+ ప్రాజెక్ట్‌లు, స్పాట్ లోనే బ్యాంక్ లోన్లు.. హైటెక్స్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో మిస్ కావద్దు

Tags

Related News

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

కేంద్రంతో సీఎం రేవంత్ కీలక భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై బిగ్ అప్‌డేట్!

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన క్లైమేట్.. దంచికొడుతున్న వాన.. రాబోయే 2 గంటలు హైఅలర్ట్!

నా చావుకి డాక్టర్లు, పోలీసులే కారణం.. అట్టముక్కపై సూసైడ్ నోట్ రాసి టెక్కీ ఆత్మహత్య!

ఏడాది తర్వాత వీడిన ఖమ్మం మర్డర్ మిస్టరీ.. చెప్పుల క్లూతో చిక్కిన కిల్లర్స్!

మియాపూర్ భూముల కేసులో ప్రభుత్వ గెలుపు.. KCR, KTRలపై విరుచుకుపడ్డ చనగాని దయాకర్

Big Stories

Advertisement
×