E-Paper
Advertisement

ఒకే చోట 500+ ప్రాజెక్ట్‌లు, స్పాట్ లోనే బ్యాంక్ లోన్లు.. హైటెక్స్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో మిస్ కావద్దు

ఒకే చోట 500+ ప్రాజెక్ట్‌లు, స్పాట్ లోనే బ్యాంక్ లోన్లు.. హైటెక్స్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో మిస్ కావద్దు
Advertisement

NAREDCO Property Show: 500కు పైగా ప్రాజెక్టులు, ఆర్థిక సంస్థలు, అనుబంధ రంగాల ప్రతినిధుల భాగస్వామ్యంతో నరెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో నేడు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, నరెడ్కో తెలంగాణ ప్రతినిధులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ఆర్థిక సదుపాయాలపై సమాచారం..

Advertisement

ఈ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో, అక్టోబర్ 30, 31, నవంబర్ 1, 2026 తేదీలలో మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుంది. ప్రారంభ రోజున ప్రముఖ డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య, ప్లాట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను సందర్శకులు పరిశీలించారు. వివిధ అవసరాలు, పెట్టుబడి సామర్థ్యాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాటెడ్ డెవలప్మెంట్లు, వాణిజ్య ఆస్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న ఆర్థిక సంస్థలు గృహ రుణాలు, ఇతర ఆర్థిక సదుపాయాలపై సమాచారం అందిస్తున్నాయి.

ఒకే చోట అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఫ్లాట్లు

Advertisement

ఈ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన 16వ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో, కొనుగోలుదారులకు వివిధ విభాగాల్లో, బడ్జెట్లలో ఉన్న ప్రాజెక్టులను అన్వేషించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులు, డెవలపర్లు, ఆర్థిక సంస్థలను నేరుగా సంప్రదించేందుకు ఇది వేదికగా నిలుస్తోంది. దీనివల్ల సందర్శకులు తమకు నచ్చిన ఆస్తుల ఎంపిక చేసుకోవటంతో పాటుగా ఆర్థిక ప్రణాళికలను మరింత మెరుగ్గా అంచనా వేసుకునేందుకు సహాయపడుతుంది.

శ్రీ శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ..

ఈ సందర్భంగా నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ రెడ్డి కొప్పుల మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా, నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలక వేదికగా నిలిచింది. ఇది పరిశ్రమ వర్గాలను, వినియోగదారులను ఒకచోట చేర్చి అభివృద్ధి, అవకాశాల కోసం ఉమ్మడిగా కృషి చేసేలా ప్రోత్సహిస్తోంది. ప్రారంభ రోజున లభించిన విశేష స్పందన ఇటువంటి వేదికల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ ప్రదర్శన విజయవంతమై, ఎగ్జిబిటర్లకు, గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము’ అని పేర్కొన్నారు.

శ్రీ ఆర్. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ..

నరెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీ ఆర్. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ‘సందర్శకులు తమ మొదటి ఇంటి కోసం చూస్తున్నా, పెట్టుబడి అవకాశాలను అంచనా వేస్తున్నా, లేదా వాణిజ్య రియల్ ఎస్టేట్ను పరిశీలిస్తున్నా, ఈ ప్రాపర్టీ షో ప్రతి అవసరానికి, బడ్జెట్కు తగినట్లుగా ఏదో ఒకదాన్ని అందిస్తుంది. ఒకే చోట విస్తృత శ్రేణి ప్రాజెక్టులు, ఫైనాన్సింగ్ ఎంపికలు అందుబాటులో ఉండటంతో హాజరైనవారు వివిధ అవకాశాలను పోల్చి చూసుకొని, సరైన సమాచారంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది’ అని అన్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న కంపెనీలు విస్తృత శ్రేణి రియల్ ఎస్టేట్ ఆఫర్లను ప్రదర్శిస్తుండగా, ఆర్థిక సంస్థలు, భవన నిర్మాణ సామగ్రి సరఫరాదారులు, అనుబంధ పరిశ్రమల భాగస్వాములు విస్తృత రియల్ ఎస్టేట్ పర్యావరణ వ్యవస్థకు దోహదపడే ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ..

నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కాళి ప్రసాద్ దామెర మాట్లాడుతూ. ‘రియల్ ఎస్టేట్ వాల్యూ చైన్ లోని భాగస్వాములందరినీ ఒకచోట చేర్చే ఈ ప్రాపర్టీ షో, పరిశ్రమ ప్రతి సంవత్సరం ఎదురుచూసే కార్యక్రమాలలో ఒకటిగా మారింది. మా స్పాన్సర్లు, భాగస్వాములు, సభ్య డెవలపర్ నిరంతర విశ్వాసం, మద్దతు ఈ ప్రదర్శన ప్రతి ఎడిషన్తో మరింత బలంగా ఎదగడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి’ అని అన్నారు.

కె. గోపాల కృష్ణ మాట్లాడుతూ..

నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కె. గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రాపర్టీ షో యొక్క ప్రతి ఎడిషన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మారుతున్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. అన్ని విభాగాల డెవలపర్ల నుండి పెరుగుతున్న భాగస్వామ్యాన్ని చూడటం ప్రోత్సాహకరంగా ఉంది. ఇది మార్కెట్ యొక్క విస్తృతిని, నగరం యొక్క దీర్ఘకాలిక వృద్ధి కథపై పరిశ్రమకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది’ అని పేర్కొన్నారు.

శ్రీ కొండల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..

నరెడ్కో తెలంగాణ కోశాధికారి శ్రీ కొండల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక కుటుంబానికి ఇల్లు కొనుగోలు చేయటం అనేది అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలలో ఒకటిగా ఉంటుంది. ప్రాపర్టీ షోలో ప్రముఖ ఆర్థిక సంస్థలు పాల్గొనడం, వినియోగదారులకు ఇల్లు కొనుగోలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయటంతో పాటుగా పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చడానికి పరిశ్రమ చేస్తోన్న సమిష్టి ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది’ అని అన్నారు.

16వ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో స్పాన్సర్లు

* పవర్డ్ బై స్పాన్సర్లు.. వాసవి గ్రూప్, గంగోత్రి ఇన్ఫ్రా ఎడ్జ్, జయభేరి గ్రూప్ , అన్విత గ్రూప్
* ప్లాటినం స్పాన్సర్లు.. రాజపుష్ప ప్రాపర్టీస్, గ్రీన్ మార్క్ డెవలపర్స్, రాధే కన్స్ట్రక్షన్స్, రామ్కీ ఎస్టేట్స్ & ఫార్మ్స్, ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ, మైరాన్ హోమ్స్
* డైమండ్ స్పాన్సర్.. నిఖిల కన్స్ట్రక్షన్స్ & డెవలపర్స్, వెర్టెక్స్ హోమ్స్, వజ్ర నిర్మాణ్, కాన్సెప్ట్ యాంబియన్స్, అపర్ణ       కన్స్ట్రక్షన్స్ & ఎస్టేట్స్, వజ్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్
* గోల్డ్ స్పాన్సర్లు.. గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, ఎలెగాన్స్ గ్రూప్, ప్రణీత డెవలపర్స్, విజన్ ఇన్ఫ్రా, ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, మహారాజా స్పేసెస్
* సిల్వర్ స్పాన్సర్లు.. అర్బన్రైజ్ లైఫ్టైల్, మహిధర ప్రాజెక్ట్స్, ఈఏపీఎల్ గ్రూప్, శ్రీముఖ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆస్పైర్ స్పేసెస్, అభినందన ఇన్ఫ్రా
* బ్రాంజ్ స్పాన్సర్లు.. ఈశాన్య ఇన్ఫ్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్నో పెయింట్స్ , టఫ్ స్టోన్స్

‘నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2026’

తేదీలు:  30 అక్టోబర్, 31 అక్టోబర్,  01 నవంబర్ 2026
సందర్శన వేళలు: ఉదయం 10:00 నుండి రాత్రి 8:00 వరకు
వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్

Tags

Related News

రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. కట్ చేస్తే ఖాతాలో రూ.10 వేల కోట్లు.. చివరికి ఏమైందంటే!

పెన్షనర్లు ఇక లైన్‌లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి 3 సూపర్ స్కీమ్స్.. పిల్లల భవిష్యత్తుకు కొండంత భరోసా!

భయాందోళన నేపథ్యంలో బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోలు ఇదే సరైన సమయమా?

స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. 1% అదనపు ఛార్జీలు!

నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!

Big Stories

Advertisement
×