E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 31st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌, మిస్సమ్మల ట్రాప్‌లో పడిపోయిన అమర్‌         

Nindu Noorella Saavasam Serial Today Episode October 31st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌, మిస్సమ్మల ట్రాప్‌లో పడిపోయిన అమర్‌         
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ప్లాన్‌ ప్రకారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాలని తర్వాత హాస్పిటల్‌లో జాయిన అవ్వాలని.. అక్కడి నుంచి అమర్‌ ఇంటికి వెళ్లాలని.. పార్థు తిరిగి వచ్చేలోపు భాగీని అమర్‌కు దూరం చేసి అమర్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ప్లాన్‌లో భాగంగా గుప్పెడు నిద్రమాత్రలు చేతలో పట్టుకుని మింగబోతూ.. యాదమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆగిపోతుంది. అమ్మో ఇన్ని పిల్స్‌ మింగితే నిజంగా చనిపోతే అనుకుంటూ.. కొన్ని మింగుదామని కొన్ని డబ్బాలో వేస్తుంది. కొన్ని మాత్రమే చేతిలో పట్టుకుని మింగబోతుంటు.. ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ఫోన్‌ తీసుకుని చూసి ఇదేంటి మంగళ ఈ టైంలో వీడియో కాల్‌ చేస్తుంది. ఏమో లిఫ్ట్‌ చేద్దాం అనుకుంటూ లిప్ట్‌ చేస్తుంది.

కట్‌ చేస్తే మంగళ ఇంట్లో ఊడుస్తూ.. మనోహరితో వీడియో కాల్‌ మాట్లాడుతుంది. మంగళ వెనకాలే అయోమయంగా చూస్తూ తలకు గాయాలతో పార్థు కూర్చుని ఉంటాడు. మనోహరి వీడియో కాల్‌ లిఫ్ట్‌ చేసి ఏంటి మంగళ వీడియో కాల్ చేశావు అని అడుగుతుంది. అందుకు మంగళ తాము తీర్థయాత్రలు చేసి వచ్చాము అని చెప్పబోతుంటే.. మనోహరి ఇరిటేటింగ్‌గా తీర్థయాత్రలు చేస్తే పుణ్యం ఏమైనా మూటకట్టుకుని వచ్చావా..? అని అడుగుతుంది. అందుకు మంగళ వెటకారంగా నువ్వు నేను ఎన్ని గుడులు తిరిగినా పుణ్యం రాదులే మనోహరి ఎందుకంటే మనం చేసిన పాపాలు అలాంటివి అంటూ మాట్లాడుతుంటే.. మనోహరి కోపంగా ఏయ్‌ ఫోన్‌ కట్‌ చేస్తావా..? లేదా..? అంటే..

Advertisement

ఆగు మనోహరి ఒక్క విషయం అడుగుదామని ఫోన్‌ చేశాను.. నీకు పెళ్లి అయిందట కదా..? పెళ్లైన మూడో రోజే నీ మొగుడు మటాష్‌ అయ్యాడట కదా అంటే.. మటాష్‌ అవ్వడం కాదు నేనే చంపేశాను.. చాలా ఇక అనగానే.. మంగళ భయంపడుతూనే.. అయినా నువ్వు ఎవ్వరితో కాపురం చేయవు కదా.. అంటుంటే.. వీడియో మంగళ వెనకాల కొద్దిగా కనిపిస్తున్న పార్థును గమనించిన మనోహరి మంగళ నీ వెనకాల సోపా మీద కూర్చున్నది మీ ఆయనా..? అని అడుగుతుంది. కాదు ఎవరో దారినపోయే దానయ్య.. మా ఆయన పాల ప్యాకెట్‌ తీసుకురావడానికి వెళ్లారు భాగీ వాళ్ల ఆయన ఇక్కడకు వస్తున్నారట.. నువ్వు కూడా రావొచ్చు కదా మనోహరి అంటూ మంగళ చెప్తుండగానే.. మనోహరి కోపంగా కాల్‌ కట్ చేస్తుంది. మనోహరిని మంగళ తిట్టుకుంటుంది.

రామ్మూర్తి ఇంటికి బయలుదేరిన అమర్‌కు రాథోడ్‌, మిస్సమ్మ షాక్‌ ఇస్తారు. తమ ప్లాన్‌ ప్రకారం రాథోడ్‌ రాకూడదని అప్పుడే తాను కారులో అమర్‌తో మాట కలపొచ్చని మిస్సమ్మ చెప్తుంది. అందుకు రాథోడ్‌ ఓకే అంటాడు. కానీ చివరి వరకు అమర్‌కు చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. అనుకున్నట్టుగానే.. అమర్‌ రెడీ అయి రాగానే.. అందరూ కారు దగ్గరకు వెళ్తారు. అప్పుడు రాథోడ్‌ కారు కీస్‌ అమర్‌కు ఇస్తాడు. ఎందుకు నువ్వు రావడం లేదా రాథోడ్‌ అని అమర్‌ అడిగితే.. లేదు సార్‌ పిల్లుల వస్తే ఇబ్బంది పడతారు కదా అంటాడు రాథోడ్‌. అందుకు యాదమ్మ ఉంది కదా అని అమర్‌ చెబితే.. యాదమ్మ, మనోహరిని చూడటానికి ఆశ్రమానికి వెళ్లిందని చెప్తాడు. అమర్‌ కోపంగా రాథోడ్‌ను తిడతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Intinti Ramayanam Today Episode: లాయర్ తో పల్లవి అబద్దం చెప్పిందా..? శ్రీకర్ ప్లాన్ ఫెయిల్.. కమల్ లవ్ ట్రాక్..

Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వల్లి.. చందు ప్రియురాలు ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.

Karthika Deepam 2 Serial Today Episode October 31st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తండ్రి మాటలకు బోరున ఏడ్చిన జ్యోత్స్న   

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. గుణ ఎంట్రీతో సీన్ రివర్స్.. శివంగిలా మారిన లేడీస్..

Brahmamudi Serial Today Episode October 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అయోమయంలో అపర్ణ  

Big Stories

Advertisement
×