Shobha Shetty : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేసి సీరియల్ కార్తీకదీపం.. ఈ సీరియల్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మిగిలిన సీరియల్స్ పరిస్థితి దారుణంగా మారింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ స్టోరీ తో సినిమాను తలపించే ఎమోషన్ సీన్లతో ఆ సీరియల్ రావడంతో జనాలు ఎక్కువగా ఆ సీరియల్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా డాక్టర్ బాబు వంటలక్క అంటూ మొదలైన ఆసక్తి.. ఆ తర్వాత ఎన్ని ఎపిసోడ్లు అయినా కూడా వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే జనాలు ఆ సీరియల్ ని ఆ స్థాయిలో తీసుకొని వెళ్లి పెట్టాయి. ఇందులో విలన్ పాత్రలో నటించిన మౌనితకు కూడా అంతే క్రేజ్ దక్కింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మౌనిత ఇప్పుడు సీరియల్స్ కి దూరంగా ఉన్నా కూడా కార్తీకదీపం ఫాన్స్ మాత్రం ఆమెను ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు అయితే ఈమెకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు.. తాజాగా ఆమెను నేలకు సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో వినిపిస్తుంది మరి ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా నటించిన మోనిత అసలు పేరు శోభా శెట్టి.. ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ అక్కడ పలు సీరియల్స్లలో నటించి మోడల్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే తెలుగులో ఈమె నటించిన కార్తీకదీపం సీరియల్ ఆమె క్రేజ్ ని ఒక్కసారిగా పెంచేసాయి కేవలం ఒకే ఒక్క సీరియల్తో ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. అయితే ఈమె సీరియల్ నుంచి తప్పుకున్న కూడా ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చూస్తే హీరోయిన్లకే మైండ్ బ్లాక్ అవుతుంది. అంత మంది అభిమానులు ఆమెను ఫాలో అవుతూ వస్తున్నారు. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. శోభ శెట్టి తన గురించి లేటెస్ట్ అప్డేట్లను ఇవ్వడంతో పాటుగా తన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్రాళ్ళను నిద్రపోనివ్వకుండా చేస్తుంది.. ఈమె నెలకి సోషల్ మీడియా ద్వారా 15 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఆ లెక్కపై క్లారిటీ రావాలి అంటే శోభా శెట్టి రియాక్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే మరి..
బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న శోభా శెట్టి బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అక్కడికి వెళుతుంది. అయితే అక్కడ తనకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది పక్కన పెడితే ఉన్న పేరు పోగొట్టుకునేలా నెగిటివ్ ప్రచారం అయితే బాగా జరిగింది. దాంతో ఆమెకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు కూడా రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే.. కార్తీకదీపం సీరియల్ గా కార్తీకదీపం 2 కూడా ఇటీవల ప్రారంభమైంది. అయితే అందులో మోనిత ప్లేస్ లో విలన్ గా వేరే అమ్మాయిని తీసుకోవడంతోనే అందరికీ అర్థమయిపోయింది.అయితే ఇక బిగ్ బాస్ ద్వారా సంపాదించిన దాంతో సొంత ఇల్లు కొనడంతో పాటుగా ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కూడా.. ప్రస్తుతం యూట్యూబ్లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఏది ఏమైనా కూడా శోభ శెట్టి సీరియల్స్ లేకపోయినా కూడా బిజీగానే ఉండడంతో పాటుగా మంచిగా సంపాదిస్తుంది. కాబట్టి ఆమెకు ఎటువంటి దోకా లేదు ఇకముందు సీరియల్స్ చేస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది..