Intinti Ramayanam Today Episode October 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి అవనిని ఇంటికి రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది. ఏమైంది పిన్ని అర్జెంట్గా రమ్మని అన్నారు అని అడుగుతుంది. పల్లవి ఒక సూట్ కేసు వాళ్ళ నాన్న చేతికి ఇచ్చి వెళ్లిందమ్మా అది కచ్చితంగా మీ ఇంట్లోంచి తెచ్చి ఉంటుందని నా అనుమానం అది కాదు అవును తెలుసుకోవడానికి నిన్ను రమ్మని పిలిచాను అని రాజేశ్వరి అంటుంది. అయితే రాజేశ్వరి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని పల్లవి ఆ సూట్ కేసును చూడడానికి వెళుతుంది.. ఆ సూట్ కేసును చూసిన అవని ఇది కచ్చితంగా అదే ఎలా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రధర్ నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి అందుకే వచ్చాను అని అంటాడు. అవని వచ్చిందని తెలుసుకున్న చక్రధర్ తెలివిగా డబ్బుల్ని మాయం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నువ్వు బాధ్యతగా ఆ డబ్బులు ఏమయ్యా అని వెతకాల్సింది పోయి సైలెంట్ గా ఉన్నావు.. నాకు ఏమన్నాలో అర్థం కావట్లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. మీరిలా అవనీని వెనకేసుకొని వస్తే ఇంకా రెచ్చిపోతుంది అని అక్షయ్ అంటాడు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పల్లవి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఆ అవని కచ్చితంగా మనం డబ్బులు తీశామని తెలుసుకుంది. ఈ విషయాన్ని బయట పెడితే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. అవని ఆ డబ్బుని కనిపెట్టే ఛాన్స్ లేదు అని చక్రధర్ పల్లవితో చెప్పడంతో పల్లవి కూలై అక్కడ నుంచి వచ్చేస్తుంది.
ఇక అక్షయ్ తన ఫ్రెండ్ తో బిజినెస్ గురించి మాట్లాడుతాడు. అయితే తన ఫ్రెండు నీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి అన్నావు కదరా.. మనిద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం స్టాక్ ని ఎప్పుడు కొందామని ఫోన్ చేసి అడుగుతాడు. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవురా అని అనగానే తన ఫ్రెండు తిట్టేసి ఫోన్ పెట్టేస్తాడు.. నా ఫ్రెండ్ దగ్గర నాకు అవమానమే జరిగింది అంతా అవనీవల్లే అని అక్షయ్ అంటాడు. పల్లవి అసలు ఏం జరిగింది బావగారు అని అడుగుతుంది. నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రాడ్ అయిపోయాను.. అందరూ నన్ను తిట్టిపోస్తున్నారు అని అక్షయ్ సీరియస్ అవుతాడు..
అవని కమల్ ఇంట్లోకి వస్తారు. ఎక్కడికెళ్తున్నావ్ ఊరి మీద పడి తిరిగి వస్తున్నావా ఏంటి అని అక్షయ్ అడుగుతాడు. ఇంట్లో పోయిన డబ్బులు తెలుసుకోవడానికి వదిన మామూలుగా ప్రయత్నాలు చేయట్లేదు అని కమలంటాడు. నీ వల్ల నా ఫ్రెండ్స్ అందరు ముందర ఫ్రాడ్ గా మిగిలిపోయాను ఆ రోజే డబ్బులు ఎవరు తీసారు పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాను కానీ నువ్వు వద్దని అన్నావు అని అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. మీరేం కంగారు పడకండి ఆ డబ్బులు ఎవరు తీశారు రేపు ఉదయం మీకు తెలుస్తుంది అని అవని ధీమా గా చెప్తుంది.
ఏం చేయబోతున్నావు అని అడిగితే రేపు లైవ్ డిటెక్టర్ వాళ్ళు వస్తున్నారు. ఆ డబ్బులు ఎవరు తీశారు వాళ్ళ నోటితోనే చెప్పిస్తారు అని అవని అనగానే పల్లవి షాక్ అవుతుంది. ఇలాంటివి చేయాలంటే లీగల్ గా పెద్ద సమస్యలు వస్తాయి కదా వదినా అని శ్రీకర్ అంటాడు. శ్రీకర్ ఎంతగా చెప్పిన సరే నాకు అన్ని తెలుసు. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇది చేయాలని అనుకున్నాను వాళ్ళు ఒప్పుకున్నారు కచ్చితంగా ఇది చేసి తీరుతాను అని అవని అంటుంది.
నా భర్త లాయరు ఆయన సమస్యలు వస్తాయని చెప్తున్నారు కదా.. అయిన నువ్వు వినవేంటి నీకెందుకు భయం లేదా? నీకు ఎందుకంత పొగరు అని శ్రీయా అంటుంది. అవి సమస్యలు వస్తాయని చెప్తున్నా కూడా నువ్వు వినవేంటి అని అక్షయ్ కూడా సీరియస్ అవుతాడు. ఇప్పుడున్న సమస్యలు చాలా ఏంటి కొత్తగా నువ్వు వేరేటి తీసుకురావడానికి అని అక్షయ్ అంటాడు. ఇంకా ఇంట్లోనే వాళ్ళందరూ కూడా సమస్యలు వస్తాయని అంటున్నారు కదా అమ్మ ఇప్పుడు మళ్లీ కొత్త సమస్య ఎందుకు అని అంటారు..
వదిన ఏం చేసినా అది కరెక్టే ముందు చేయించుకుంటాను అని కమలంటాడు. పల్లవి ఈ టెస్ట్ చేయించడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్.. నేనే చేయించుకుంటాను అన్నప్పుడు నీకేంటి అని కమల్ అంటాడు. ఇలాంటి వాటి వల్ల సమస్యలు వస్తాయని అందరు అంటున్నారు కదా మరి ఎందుకు చేయడం అని పల్లవి అంటుంది. అవని మరేం పర్లేదు అన్ని నేను చూసుకునే వచ్చాను కచ్చితంగా రేపు ఉదయం ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో తేల్చేస్తాను అని అంటుంది. పల్లవి చక్రధర్ కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తుంది.
డాడ్ అవని మామూలుది కాదు రేపు లైవ్ డిటెక్టర్ వాళ్ళని తీసుకొని వస్తానని చెప్తుంది. కచ్చితంగా ఆ డబ్బులు నేనే తీసానని తెలిసిపోతుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. టెన్షన్ గా ఉంది అందుకే మీకు ఫోన్ చేశానని అంటుంది.. డబ్బులు తీసుకుని వచ్చి ఉదయం నీకు ఇస్తాను. ఇంట్లో ఆ డబ్బులు ఎవరికి తెలియకుండా పెట్టేసేయ్ సరిగా వెతకలేదు అని చెప్పి అందరిని నమ్మించేసేయని పల్లవికి చెప్తాడు. కానీ మనం ఆ డబ్బులు తిరిగి పెట్టేస్తే అక్షయ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తాడు కదా అని అవని అడుగుతుంది. ఫస్ట్ మనం ఇరుక్కోకుండా బయటపడడం మనకు కావాలి అని చక్రధర్ అంటాడు.
Also Read: దినేష్ కు దిమ్మతిరిగే షాక్..గుణతో చెయ్యి కలిపిన రోహిణి.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్..
పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఏదో అవుతుంటే నాకు భయమేస్తుంది అని అంటుంది. నువ్వేం భయపడకు అవని ఏం చేయాలనుకుందో అది చేస్తుంది అని అంటుంది. ఇక శ్రియా కచ్చితంగా డబ్బులని పల్లవి నే తీసింది. పల్లవి దొరికిపోతే నా పేరు కూడా చెప్తుంది మేమిద్దరం కలిసే చాలా చేశాము అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే శ్రీకర్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ డబ్బులు ఎవరిదీసరే వాళ్ళు టెన్షన్ పడతారు కదా అని అంటుంది. అటు కమల్ పల్లవి టెన్షన్ పడడం చూసి ఆ డబ్బులు నువ్వు తీసావా అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో డబ్బులు పెట్టడం కమల్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..