BigTV English

Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను తిట్టిన ధాన్యలక్ష్మీ – ధాన్యలక్ష్మీని ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న రాజ్‌

Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను తిట్టిన ధాన్యలక్ష్మీ – ధాన్యలక్ష్మీని ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న రాజ్‌

Brahmamudi serial today Episode: రాజ్‌, కళ్యాణ్‌ మాట్లాడుకుంటుంటే డాక్టర్‌ ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ కాల్ లిఫ్ట్ చేసి హలో డాక్టర్‌ చెప్పండి అని అడగ్గానే.. ఇంకా ఎం చెప్పాలండి ఎన్ని సార్లు చెప్పాను నేను అసలు ఏం చేస్తున్నారండి మీరు నేను అంత క్లారిటీ చెప్పినా కూడా మీరు ఎందుకు కావ్య గారికి నిజం చెప్పడం లేదు అని అడుగుతుంది. దీంతో నాకు చెప్పాలనే ఉంది డాక్టర్‌ కానీ చెప్పాక కళావతి ఎక్కడ ఒప్పుకోదో అని చాలా భయంగా ఉంది అంటాడు. మీరిలా భయపడుతూ ఉంటే చివరికి ఎలా జరగకూడదో అదే జరుగుతుందని చెప్పడానికే ఫోన్‌ చేశాను అని డాక్టర్‌ చెప్పగానే..


ఏంటి డాక్టర్‌ మీరనేది అని రాజ్‌ అడుగుతాడు. దీంతో డాక్టర్‌ కావ్య గారికి ఫిప్త్‌ మంత్‌ రావడానిక ఇక ఎంతో టైం లేదు.. అందుకే వీలైనంత ఫాస్ట్‌గా కావ్య గారికి ఈ విషయం చెప్పి కావ్య గారిని ఒప్పిస్తారో ఏం  చేస్తారో మీ ఇష్టం ఒక డాక్టర్‌గా నేను చెప్పాల్సింది చెప్పాను.. ఇక నిర్ణయం మీదే అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. దీంతో కళ్యాణ్‌ ఎమోషనల్‌ గా అన్నయ్య డాక్టర్‌ గారు ఏం  చెప్పారో విన్నావు కదా వెంటనే వదినకు నిజం చెప్పు అన్నయ్య అంటాడు. లేదురా నిజం చెప్పి తనను దూరం చేసుకోవడం కన్నా ఈ అబద్దాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎలాగైనా తనను కాపాడుకుంటాను అంటాడు రాజ్‌.

రూంలో పడుకున్న అప్పు రాజ్, కావ్య గొడవ పడిన విషయం గుర్తు చేసుకుని ఉలిక్కి పడి లేస్తుంది. వెంటనే అక్కతో మాట్లాడాలి.. వెంటనే అక్క దగ్గరకు వెళ్లాలి అని లేచి వెళ్లబోతుంటే అప్పుడే డోర్‌ తెరుచుకుని జ్యూస్‌తో ధాన్యలక్ష్మీ వస్తుంది. లేచావా..? నీ కోసం జ్యూస్‌ తీసుకొచ్చాను తాగు అంటూ ఇవ్వబోతుంటే.. నాకు వద్దు అత్తయ్యా అంటుంది అప్పు.. ఏంటి వద్దు నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లను అనుకుంటున్నావా..? ఇలా వద్దు అంటూనే పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇంత జరిగాక కూడా మళ్లీ అదే మాట అంటావేంటి అంటుంది. దీంతో అప్పు అది కాదు అత్తయ్య తాగాలనిపించడం లేదు అని చెప్తుంది. నువ్వు తాగాల్సిందే..


ఇందాక నువ్వు నీరసంగా ఉన్నావని చెప్పి వెళ్లారు. ఇక నుంచి నీ మాట మేము వినము.. నువ్వే మా మాట వినాలి.. తాగు అంటూ చెప్పగానే.. అప్పు బలవంతంగా జ్యూస్‌ తాగి టాబ్లెట్ వేసుకుంటుంది. ధాన్యలక్ష్మీ బయటకు రాగానే రుద్రాని వెళ్లి తన మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది.  చుట్టూ ఉన్న గొడవలు ఆ పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించావా..? ఇందాక డాక్టర్‌ కూడా చెప్పారు కదా ప్రెగ్నెంట్‌ తో ఉన్న వాళ్లు ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారు అని మరి నువ్వేం చేయవా..? వాళ్లను ఏమీ అడగవా.. ఇలాగే నువ్వు సైలెంట్‌ గా ఉంటే ఇక నువ్వు నీ మనవడి గురించి మర్చిపోయావా..? నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అంటూ వెళ్లిపోతుంది రుద్రాణి.

రూంలో బాధపడుతున్న కావ్య దగ్గరకు అపర్ణ, ఇంద్రాదేవి వెళ్తారు. కావ్యను ఓదారుస్తారు. ఊరుకోవే ఇప్పుడేం జరిగిందని బాధపడతావు. అప్పుకు ఏం కాదని కళ్యాణ్‌ చెప్పాడు కదా..? తను ఫుడ్డు సరిగ్గా తీసుకోకపోవడం వల్లే కళ్లు తిరిగి పడిపోయిందట.. దానికి నువ్వేందుకు బాధపడటం అంటుంది అపర్ణ. దీంతో అసలు అప్పుకు ఆ పరిస్థితి రావడానికి  కారణం నేనే కదా అత్తయ్యా అంటుంది కావ్య. దీంతో ఇంద్రాదేవి భయంగా ఏంటి కావ్య నువ్వు చెప్పేది అంటూ అడుగుతుంది. అవును అమ్మమ్మ గారు అప్పుకు నా వల్లే ఇలా అయింది. నా బిడ్డను ఆయన వద్దు అన్నప్పటి నుంచి ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో నా జీవితం ఎక్కడ పాడైపోతుందోనని అది బెంగ పెట్టుకున్నట్టు ఉంది. నా గురించి ఆలోచిస్తూ తను కడుపుతో ఉందన్న విషయమే మర్చిపోయింది.

అందుకే టైంకు తినక ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఇందాక కూడా ఆ విషయం గురించి నాతో మాట్లాడటానికి వచ్చింది. అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంది. నేను ఇప్పుడే వెళ్లి ఇదంతా నాటకం అని చెప్పేస్తాను అంటూ వెళ్తుంది కావ్య. వెనకాలే అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. కావ్య హాల్లోకి వెళ్లగానే.. పైనుంచి కోపంగా వస్తున్న ధాన్యలక్ష్మీ కావ్యను చూసి కావ్య నీ ఉద్దేశం ఏంటో..? చెప్పు అంటూ నిలదీస్తుంది. గొడవ చేస్తుంది. ఎవరెన్ని చెప్పినా ధాన్యలక్ష్మీ వినదు. తాము ఇంట్లోంచి వెళ్లిపోతామని చెప్తుంది. ధాన్యలక్ష్మీ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటూ ఇంద్రాదేవి తిడుతుంది.

మాట్లాడటం కాదు అత్తయ్యా ఇదే నా నిర్ణయం..  నాకు నా కోడలు ఆరోగ్యం దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం ముఖ్యం అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో దాన్యలక్ష్మీ, రాజ్‌ మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో సీతారామయ్య కలగజేసుకుని రాజ్‌ను తిడతాడు. అయినా రాజ్‌ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పి వెల్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: గ్రాండ్ గా బతుకమ్మ సంబరాలు.. కొడుకులకు క్లాస్ పీకిన రామరాజు.. నర్మద ప్లాన్ సక్సెస్..

Nindu Noorella Saavasam Serial Today october 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కిడ్నాప్‌ చేసి చంపబోయిన రణవీర్‌  

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. అవని మాటతో దిమ్మతిరిగే షాక్.. కమల్ కు అనుమానం..

GudiGantalu Today episode: దినేష్ కు దిమ్మతిరిగే షాక్..గుణతో చెయ్యి కలిపిన రోహిణి.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్..

Deepavali special Show: శేఖర్ మాస్టర్ కు ఝలక్ ఇచ్చిన నాగబాబు.. షాక్ లో ఆది, ప్రదీప్..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. అవే స్పెషల్..

Keerthy Suresh: హీరోయిన్ గా మాత్రమే కాదు.. అలాంటి పాత్రలకు సై అంటున్న కీర్తి సురేష్!

Big Stories

×