Deepavali special Show: ప్రతి ఒక్క పండక్కి తెలుగు టీవీ చానల్స్ ప్రత్యేకమైన షోలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏ పండగ వచ్చినా ఆ పండగ టీం కి సంబంధించిన షో నీ నిర్వహిస్తూ పలు చానల్స్ టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. మొన్న దసరా ప్రోగ్రాంలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కొద్ది రోజుల్లో దీపావళి వస్తున్న సందర్భంగా టీవీ చానల్స్ ఆ పండగ ఈవెంట్లను చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈటీవీ ఛానల్ లో దీపావళి సందర్భంగా స్పెషల్ షో ని నిర్వహించనున్నారు. ఆ ఈవెంట్ కు సంబంధించిన టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి కొద్ది రోజుల్లో రాబోతున్న దీపావళి పండుగ సందర్భంగా.. టీవీ చానల్స్ స్పెషల్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఈటీవీలో ఈ దీపావళికి మాస్ జాతర.. పేరుతో ఆల్రెడీ ఒక షో రెడీ అయ్యింది.. ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ కనిపించాడు. అలాగే నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. ప్రతి ఈవెంట్ జాతరలా ఉంటుంది ఈవెంట్ అంతకుమించి ఉంటుంది అంటూ ప్రతి అదిరిపోయే డైలాగ్ తో స్టార్ట్ చేస్తారు. ఈ ఈవెంట్ కి శేఖర్ మాస్టర్ నాగబాబు కూడా వస్తారు. ఈ దీపావళి వచ్చే దీపావళి వరకు యాద్ ఉంటది అని ప్రదీప్ అంటాడు. కానీ శేఖర్ మాస్టర్ నీ నవ్వుకి ఫ్యాన్స్ ఉన్నారు నాగబాబు గారు అని అంటాడు. దానికి రియాక్ట్ అయిన నాగబాబు ఊరుకో శేఖర్ నీ డాన్స్ కి కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు అని నడుము గిల్లుతాడు. దాంతో శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా కెవ్వు మంటాడు. ఆ సీన్ చూసినా ఆది ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అవుతారు..
Also Read: మళ్లీ అదే తప్పు చేస్తున్న పూజా.. ఇప్పటికైన తగ్గితే బెటర్..
బుల్లితెర మీద కనిపించే హీరోయిన్స్, కమెడియన్స్ అంతా వచ్చి డాన్స్ లు వేశారు. అలాగే చివరికి అందరూ కలిసి ఈ స్పెషల్ షోలో సందడి చేస్తారు.. ఆట పాటలతో స్పెషల్ డ్యాన్స్ లతో దీపావళి సంబరాలు మరింత అట్రాక్టివ్ గా మారతాయి. డాన్స్ పెర్ఫార్మన్స్ అయిన తర్వాత అందరూ కలిసి దీపాలు బాంబులు అని తెలిసి సంబరాలు చేసుకుంటారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దీపావళి స్పెషల్ ఈవెంట్లో ఇంకెంత హంగామా ఉంటుందో తెలియాలంటే ఈ స్పెషల్ ఈవెంట్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ప్రస్తుతం టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.. నాగబాబు బుల్లితెరపైకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య జబర్దస్త్ లో కనిపించారు. ఇప్పుడు పండగ స్పెషల్ ఈవెంట్లలో ఆయన సందడి చేస్తున్నాడు. ఇక శేఖర్ మాస్టర్ స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నారు.