BigTV English

GudiGantalu Today episode: దినేష్ కు దిమ్మతిరిగే షాక్..గుణతో చెయ్యి కలిపిన రోహిణి.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్..

GudiGantalu Today episode: దినేష్ కు దిమ్మతిరిగే షాక్..గుణతో చెయ్యి కలిపిన రోహిణి.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode October 9th: నిన్నటి ఎపిసోడ్ లో..  మీనా ఇంట్లోకి రాగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నేనేమీ చెప్పకుండా వెళ్ళలేదు కదా ఎందుకు అందరూ టెన్షన్ పడ్డారు అని మీనా అంటుంది. నేను శృతికి చెప్పే వెళ్లాను కదా ఏం శృతి చెప్పే వెళ్లాను కదా ఏం శృతి నీకు చెప్పాను కదా వేడి నీళ్లు ఇచ్చినప్పుడు నీకు ఇదే కదా నేను చెప్పింది అని అంటుంది.. నాకు నువ్వు చెప్పావా అయితే నేను ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను అప్పుడు చెప్పినట్టున్నావ్ దానికి నేను సరే అన్నాను ఇప్పుడు గుర్తొచ్చింది అని శృతి అంటుంది. ఇప్పుడేమంటావ్ అమ్మ వదిన చెప్పేసే వెళ్లింది అని రవి అంటాడు. దానికి మీనా తప్పు లేదని అందరు తెలుసుకుంటారు. బాలు మీనా మధ్య దూరం కూడా తగ్గిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ షాప్ కి దిలీప్ రావడం చూసి రోహిణి షాక్ అవుతుంది. డబ్బులు కావాలని ఎన్ని సార్లు అడుగుతావు నా దగ్గర డబ్బులు లేవు అని రోహిణి అంటుంది. ఈ షాప్లో ఖరీదైన ఫన్నీచర్స్ ని నేను తీసుకెళ్లి పోతాను అని తనకు నచ్చిన వాటిని తీసుకొని వెళ్ళిపోతాడు. మనోజు ఆ డబ్బులు ఏవి అని అడుగుతాడు రోహిణి సైలెంట్ గా తప్పించుకుని వెళ్ళిపోతుంది.. దినేష్ గొడవని ఎలాగైనా సరే దూరం చేసుకోవాలని రోహిణి ఫిక్స్ అవుతుంది. వాడికి వార్నింగ్ ఇవ్వాలని విధ్యతో ఎవరైనా రౌడీ ఉంటే చెప్పు అని అడుగుతుంది.

సరే నువ్వైతే పార్లర్కి రా ఆ తర్వాత ఎవరున్నారో ఆలోచించి చెప్తాను అని విద్య అంటుంది. శృతి మీన దగ్గరికి వచ్చి నీకున్న ఓపికకి మెచ్చుకోవాలి మీనా అని మీనాపై ప్రశంసలు కురిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ అయితే అమ్మాయి వెంటనే పుట్టింటికి వెళ్తుంది. నాకైతే నీకున్నంత సహనం లేదు. నువ్వు కోపం వస్తే నీ పుట్టింటికి వెళ్తావా అని అడుగుతుంది మీనా. లేదు నేనెందుకు వెళ్లాలి రవికి ముక్కు పగలగొడతానని అంటుంది. మాటల్ని ప్రభావతి వింటుంది. ఇక మీనా నీకు కోపం వచ్చేలా నేను చేస్తే ఏం చేస్తావు అని అంటుంది. మరి అత్తయ్య మీద కోపం వస్తే ఏం చేస్తావు అని అంటుంది.


మాటకి మాట దెబ్బకి దెబ్బ అత్తయ్య ఏమంటే దానికి ఖచ్చితంగా దీటుగా సమాధానం చెప్పాల్సిందే. నాకు ఆంటీ నేను తిడుతుంటే నువ్వెందుకు ఓపిగ్గా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు మాత్రం చాలా కోపం ఉండేది. ఆంటీకి దెబ్బకు దెబ్బ తీస్తాను అని అంటుంది. అట్లకారతో ఆంటీ వీపు మీద వాత పెడతాను అని శృతి అనడం ప్రభావతి విని షాక్ అవుతుంది. ఇక ప్రభావతి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. వెళ్ళిపోగానే మీనాతో నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నావని అడుగుతుంది. దానికి సపోర్ట్ చేస్తూ ఇంకా మాట్లాడుతున్నావా అని మీనాపై సీరియస్ అవుతుంది.

ఇక మీనాకు ఫోన్ రాగానే బయటికి వెళుతున్నాను మళ్ళీ చెప్పి వెళ్ళలేదంటారు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి విద్య కలిసి గుణ దగ్గరికి వెళ్తారు. నేను వడ్డీ వ్యాపారం చేస్తాను ఇలా బెదిరించడం నాకు రాదు అని గుణ అంటారు. కానీ వడ్డీ వ్యాపారానికి ముందు నువ్వు ఏం చేసే వాడివో మాకు బాగా తెలుసు అని విద్య అనగానే బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ బాగా చేసుకుని వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అని అడుగుతాడు గుణ.. నన్ను ఒకడు బాగా టార్చర్ చేస్తున్నాడు పర్సనల్గా నాకు ఇబ్బంది పెడుతున్నాడు వాణ్ని ఏదో ఒకటి చేయాలి బెదిరించి వదిలేయాలి అని రోహిణి అంటుంది.

వాడు నిన్ను బెదిరిస్తున్నాడు అంటే ఏదో పర్సనల్ ఇష్యు ఉండనే ఉంటుంది అదేంటో చెప్తే నేను చూసుకుంటాను కదా అని గుణ అంటాడు.. ఇప్పుడు తన పర్సనల్ విషయాలు గురించి నీకు అవసరం లేదు నువ్వు సహాయం చేస్తే చాలు ఎంత ఖర్చవుతుంది అని రోహిణి అడుగుతుంది. నా మాత్రం డబ్బులేం అవసరం లేదు మీరు నాకు కస్టమర్స్ కదా మీకోసం ఏమాత్రం కూడా చేయలేనా అని గుణ అంటాడు. ఇక మీనా బాలు కోసం భోజనం తీసుకొని వచ్చి నేను పూల ఆర్డర్ వచ్చింది వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది.

గుణ ఆ దినేష్ ని పట్టుకుని వచ్చి చితకొట్టేస్తాడు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పండి అని దినేష్ ఎంతగా అడుగుతున్నా సరే గుణ చెప్పకుండా కుమ్మేస్తాడు. దినేష్ అక్కడ్నుంచి పారిపోతూ స్పీడ్ గా వస్తూ ఒక భామని గుద్దేస్తాడు.. అది చూసిన బాలు దినేష్ ని పట్టుకొని చితగ్గొట్టేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు దినేష్ ని తీసుకొని వెళ్ళిపోతారు. పోలీసులు దినేష్ ను తీసుకెళ్లడం ఫోటో తీసిన గుణ రోహిణి కి పంపిస్తాడు. ఇక ప్రభావతి కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రోహిణి మీనా ఇంటికి వస్తారు. మీనా గురించి తప్పుగా మాట్లాడిన ప్రభావతికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది మీనా.

Also Read: శేఖర్ మాస్టర్ కు ఝలక్ ఇచ్చిన నాగబాబు.. షాక్ లో ఆది, ప్రదీప్..

ఇక రోహిణి ప్రభావతికి మంచి బిజినెస్ ఐడియా ఇస్తుంది. మీరు కూడా మంచి సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచిది అని సలహా ఇస్తుంది ప్రభావతి ఆ సలహాని తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రభావతి క్లాసికల్ డాన్సర్ గా మారుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Illu Illalu Pillalu Today Episode: గ్రాండ్ గా బతుకమ్మ సంబరాలు.. కొడుకులకు క్లాస్ పీకిన రామరాజు.. నర్మద ప్లాన్ సక్సెస్..

Nindu Noorella Saavasam Serial Today october 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కిడ్నాప్‌ చేసి చంపబోయిన రణవీర్‌  

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. అవని మాటతో దిమ్మతిరిగే షాక్.. కమల్ కు అనుమానం..

Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను తిట్టిన ధాన్యలక్ష్మీ – ధాన్యలక్ష్మీని ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న రాజ్‌

Deepavali special Show: శేఖర్ మాస్టర్ కు ఝలక్ ఇచ్చిన నాగబాబు.. షాక్ లో ఆది, ప్రదీప్..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వస్తున్న సినిమాలు.. అవే స్పెషల్..

Keerthy Suresh: హీరోయిన్ గా మాత్రమే కాదు.. అలాంటి పాత్రలకు సై అంటున్న కీర్తి సురేష్!

Big Stories

×