Intinti Ramayanam Today Episode September 9th : ప్రణతి బాధ పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. కోల్పోయిన విషయం కన్నతల్లికి చెప్పకుండా.. తనలో తానే ఇలా ఓదార్చుకో లేకుండా ఉండడం నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది.. భరత్ మీనాక్షి మీ భార్యని ఓదార్చాల్సిన అవసరం నీకుంది. తనకి ధైర్యం చెప్పు అని చెప్తూ ఉండగా.. పల్లవి లోపలికి వచ్చి ఇలాంటి ధైర్యం నాకు చెప్పేవాళ్ళు లేరు నా భర్తకి చెప్పి నా దగ్గరికి పంపించిన వాళ్లు లేరు మా అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను అని పల్లవి అంటుంది. పల్లవి మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రణతి మా నాన్న చనిపోతే ఇలా ఎలా మాట్లాడుతున్నావ్ వదినా అని అంటుంది ఇక పల్లవి చెప్పిన మాట విని అందరు కూడా మౌనంగా ఉండిపోతారు.
పార్వతి అలాగే ఆరాధ్య ఇద్దరు కలిసి తాతయ్యకి తొందరగా బాగవాలి అని దేవుడి దగ్గర దండం పెట్టుకుందాం పదనానమ్మ అని దేవుడు గదిలోకి వెళ్తారు.. అక్కడ పూజ గదిలో దండం పెట్టుకున్న తర్వాత బొట్టు పెట్టుకునే సమయానికి కుంకుమ కింద పడిపోవడంతో తనకి ఏదో అనుమానం కలుగుతుంది అని అనుకుంటుంది. కానీ పార్వతి చేయి జారిపోయింది లేకపోతే ఇంకా ఏదైనా సమస్యల్లో జరుగుతున్నాయా అని ఆలోచనలో పడుతుంది. పల్లవి మాత్రం ఎలాగైనా సరే పార్వతికి నిజం చెప్పాలి అని అనుకుంటుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందన్నది సస్పెన్స్ గా మారింది..
ఇంట్లో దీపం పెట్టకపోవడానికి కారణం ఏంటి అవని ఎందుకు దీపం పెట్టలేదు. దేవుడి గదిలో దీపం వెలగకుండా ఉండకూడదు తెలుసా అని పార్వతి అడుగుతుంది. ఇంట్లో దీపం వెలగకుండా ఉంటే అష్టదయపురాలు ఇంట్లోనే ఉంటాయని అంటారు నువ్వు ముందు దీపం పెట్టమ్మా అని పార్వతి ఎంతగా చెప్తున్న సరే నిజం చెప్పడానికి భయపడుతుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మకు నిజం చెప్తే ఏమవుతుందని బాధ పడిపోతూ ఉంటారు. పార్వతికి నిజం చెప్తే తను ఏమవుతుందో అని అందరు టెన్షన్ పడిపోతూ ఉండగా పల్లవి మాత్రం నువ్వు కూడా చస్తే అప్పుడు నేను దీపం పెడతాను అని మనసులో అనుకుంటుంది. పార్వతికి అందరి మీద అనుమానం వస్తుంది ఎందుకు మీరు దీపం పెట్టలేదు ఏమైంది అని ఎంతగా అడుగుతున్నా కూడా మౌనంగా ఉంటారు.. అక్షయ మాత్రం నిజం చెప్పేస్తాడు.
కమల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కర్మ కండలన్నీ మనమే చేసాం కాబట్టి ఆమెకు దీపం పెట్టకూడదు అని పెట్టలేదు అత్తయ్య.. ఆమె చనిపోయేముందు మాలో తన కొడుకుల్ని చూసుకుంది. అయితే కర్మ చేసినప్పుడు ఇంట్లో దీపం పెట్టడం మహా పాపం కదా అందుకే దీపం పెట్టలేదు అని అక్షయ్ చెప్తాడు. అక్షయ్ ఆ మాట చెప్పగానే పార్వతికి మొదట అనుమానం ఉన్నా కూడా తర్వాత తల్లి లాంటి ఆమెకు అని అనడంతో పర్వాలేదు రా మీరు చేసేది మంచి పనే కదా చేయండి ఏం కాదు అనేసి సలహా చెప్తుంది. ఒక మంచి పని కోసం ఏదైనా చేయొచ్చు మీ నాన్నగారు ఇదే కోరుకుంటారు అని పార్వతి అంటుంది. కొడుకులను చూసి పార్వతీ చాలా సంతోషంగా ఉంటుంది. కానీ పార్వతిని చూసిన కొడుకులు బాధ పడిపోతూ ఉంటారు..
పల్లవి ఇంట్లోని వాళ్ళందరూ ఇలా బాధపడిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా బాధపడిపోతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ పల్లవి ఆనందపడిపోతూ ఉంటుంది.. కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ రాత్రంతా ఏడుస్తూనే పడుకొని ఉంటాడు అయితే తనని చూసిన పల్లవి నువ్వు ఇలా ఏడుస్తూ పడుకుంటే చచ్చినోడు తిరిగి వస్తాడా ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన మనసులో అనుకొని బాధపడినట్లు నటిస్తుంది. నిజం ఎన్ని రోజులు దాచలేరు ఎలాగైనా సరే బయట పెట్టాలి కదా అప్పుడు ఇంట్లో రణరంగం మొదలవుతుంది మరో చావు కూడా చూడొచ్చు అని పల్లవి మనసులో అనుకుంటూ సంతోష పడిపోతుంది..
రాజేంద్రప్రసాద్ కి పిండ ప్రధాన కార్యక్రమాన్ని జరిపించాలని అవని పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. ఇక పంతులుగారు పూజకి అన్నీ సిద్ధం చేయాలని అనుకుంటారు. ఇంటి బయట పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఇంట్లోనే వాళ్ళందరూ చేపిస్తారు అయితే పార్వతికి రాజేంద్రప్రసాద్ గురించి నిజం తెలిసేలోగా ఈ కార్యక్రమాలను పూర్తవ్వాలని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : సినీ ప్రియులకు సూపర్ న్యూస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..