Ninnu kori serial today Episode: షాలినికి రౌడీ ఫోన్ చేసి విరాట్‌ను యాక్సిడెంట్ చేసి చంపేశానని చెప్తాడు. పక్కాగా చనిపోయాడా అని షాలిని అనుమానంగా అడిగితే యాక్సిడెంట్ ఏ రేంజ్‌లో జరిగిందో మీరే చూడండి వీడియో సెండ్ చేశాను అని చెప్తాడు. వీడియో చూసిన తర్వాత షాలిని రౌడీకి డబ్బులు సెండ్ చేస్తానని కొద్ది రోజులు అండర్ గ్రౌండ్ కు వెళ్లమని చెప్తుంది. రౌడీ సరే అంటాడు.
చంద్రకు చాలా పెద్ద కష్టం వచ్చిందని దేవుడా నువ్వే ఆమెకు సాయం చేయాలి అని బాధపడుతూ వెళ్తుంటే.. డాక్టర్, పోలీసులు ఒక అనాథ శవం గురించి మాట్లాడతారు. అదంతా విన్న మదన్ పోలీసులు వెళ్లిపోయాక డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ అనాథ శవం ముఖం విరాట్ గారికి రిప్లేస్ చేయోచ్చా అని అడిగితే.. చేయోచ్చు కానీ విరాట్ భార్య ఒప్పుకుంటుందా..? అంటే చంద్ర గారికి చెప్పి ఒప్పిస్తానంటాడు మదన్. అలాగే పోలీసులకు చెప్పి ఒప్పించాలి అంటే నేను వెంటనే చంద్ర గారికి చెప్పి పోలీసులతో కూడా మాట్లాడమంటాను అంటూ చంద్ర దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు. డాక్టర్ కూడా ప్లాస్టిక్ సర్జీరీ చేయోచ్చని చెప్పారు అనగానే.. చంద్ర ఎమోషనల్ అవుతూ నిజంగానా బావకు మళ్లీ మంచి రూపం వస్తుందా..? అని అడుగుతుంది.
వస్తుందండి విరాట్ గారి రూపం మారుతుందేమో కానీ ఆయన త్వరగా పూర్తిగా కోలుకుంటారు అంటూ మదన్ చెప్తుంటే.. అప్పుడే జగదీశ్వరి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని అడుగుతుంది. మాయ కోసం వెతుకుతున్నాము అని చెబితే విరాట్ మీ దగ్గరే ఉన్నారా..? అని అడిగితే.. లేదు అత్తయ్య ఆయన వేరే దగ్గర వెతుకుతున్నారు. నేను మదన్ వేరే దగ్గర వెతుకుతున్నాము అంటూ చెప్తుంది. జగదీశ్వరి మాయ సంగతి వదిలేయమని ఇద్దరూ ఇంటికి రమ్మని చెప్తుంది. అది జరగదని మాయ లేకుండా ఇంటికి రానని చంద్ర చెప్తుంది. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయమని జగదీశ్వరి ఆర్డర్ వేస్తుంది.
వెనక నుంచి అంతా వింటున్న షాలిని మాత్రం అయ్యో పాపం అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న చంద్ర, విరాట్‌కు సర్జరీ చేయించమని చెప్పి తాను ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోతుంది. మదన్ వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చంద్ర ఒప్పుకుందని చెప్తాడు. ఆవిడ ఒప్పుకుంటే సరిపోదు పోలీసులు కూడా ఒప్పుకోవాలి అని చెప్పగానే.. పోలీసులు ఒప్పుకోకపోతే అయ్యో చంద్ర పరిస్థితి ఏంటి..? అని మనసులో అనుకుని డాక్టర్‌ను పోలీసులకు చెప్పొద్దని వాళ్లు ఒప్పుకోకపోతే పరిస్తితి ఏంటని రిక్వెస్ట్ చేస్తాడు. చంద్ర పరిస్థితి జగదీశ్వరి పరిస్థితి చెప్తాడు. కాస్త ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తాడు. మదన్ ఓకే అంటాడు.
ఇంట్లో జగదీశ్వరి బాధపడుతుంటే.. కామాక్షి ఓదారుస్తుంది. నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్తుంది. రెస్ట్ తీసుకోమని శృతి చెప్తుంది. అప్పుడే క్రాంతి వస్తాడు. వెళ్లిన పని ఏమైందని రఘురాం అడిగితే ఏ హోప్స్ దొరకలేదు నాన్న అని చెప్తాడు. అన్నయ్య ఇంకా రాలేదా అని క్రాంతి అడిగితే రాలేదని చెప్తారు. క్రాంతి, చంద్రకు ఫోన్ చేస్తానంటే తాను మాట్లాడానని తాను కూడా రావడం లేదని జగదీశ్వరి చెప్తుండగానే.. చంద్ర డల్లుగా వస్తుంది. కామాక్షి ఏంటి చంద్ర అలా ఉన్నావు..? విరాట్ ఏడీ అని అడుగుతుంది. శృతి కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
రఘురాం కోపంగా మీరు కాసేపు మౌనంగా ఉండండి.. అంటూ తిడతాడు. జగదీశ్వరి విరాట్ గురించి తెలిసిందా అని అడుగుతుంది. చంద్ర మాత్రం యాక్సిడెంట్ జరిగిన విషయం గుర్తు చేసుకుని బాధపడుతుంది. చంద్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే.. శృతి ఏంటి చంద్ర ఏదో తేడాగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అంతా వింటున్న షాలిని మాత్రం బావగారి ఆచూకీ తెలియడం లేదని చెప్పలేక బలే కవర్ చేస్తున్నావు చంద్ర అని మనసులో అనుకుంటుంది. జగదీశ్వరి కూడా ఏడుస్తూ.. ఎప్పుడూ లేనిది వాడికి ఏదో జరిగిందని మనసు శంకిస్తుంది అంటూ బాధపడుతుంది. ఇంతలో ఈరోజు నిన్నుకోరి సీరియల్ ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.