E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు షాక్.. ప్రేమ పై నర్మద సెటైర్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు షాక్.. ప్రేమ పై నర్మద సెటైర్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 9th: శ్రీవల్లి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ తనకు తానే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీ అంత అందాన్ని హీరోయిన్ అయిపోయేంత ఉంటుంది కానీ నువ్విలా వేస్ట్ చేసుకుంటున్నావు.. త్వరలోనే నీ ప్లాన్లు భాగంగా ఇంట్లోనే ఆడవాళ్ళందరూ వెళ్లిపోతారు. మళ్ళీ ఇంటికి నువ్వే మహారాణి హీరోయిన్వి అని వల్లి తనకు తానే పొగుడుకుంటూ ఉంటుంది.. అయితే వేదవతి అక్కడికి వచ్చి నువ్వేమైనా తప్పు చేశావేమో నాకు చెప్పు ఆ నర్మద నేను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని అనుకుంటుంది.. నేను కుటుంబం విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు అందుకే నిన్ను కాపాడుతాను అని నమ్మించి బల్లితో నిజం చెప్పించాలని అనుకుంటుంది. అయితే అక్కడ శ్రీవల్లి అద్దంలో వెనకాల నర్మదన చేసి ఇదంతా నర్మదా ప్లాన ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఎలాగైనా సరే నేను నిజం చెప్పకూడదు అని మాట మార్చి వేరే నిజం చెప్తుంది. నర్మదకి నేను దొరికిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను అని అనుకుంటుంది..

తిరుపతి, ధీరజ్ ముచ్చట్లు..

తిరుపతి సుకన్య ఇద్దరినీ కలవకుండా భద్ర చేస్తున్న ప్లాన్ గురించి తిరుపతి ధీరజ్ తో చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు.. నీ పరిస్థితి ఏంటి మామ ఇన్నాళ్ళకి పెళ్లి కాలేరు పిల్ల దొరకలేదు అని అనుకుంటే ఇప్పుడు నీకు పిల్ల దొరికింది. కానీ పెళ్లి కావడం లేదు ఏంటి అంటూ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ మందు తాగుతూ ఉంటారు. ఏంటో అల్లుడు నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు ఇన్ని రోజులు నాకు ఎవరూ పడరు అనుకున్నాను కానీ సుకన్య పడింది. ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలని చూసిన కూడా నాకు మాత్రం ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది అంటూ తిరుపతి మందు తాగుతూనే ఇద్దరు మాట్లాడుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరూ బాధ పడిపోతూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ధీరజ్ ప్రేమ రొమాన్స్ హైలెట్..

Advertisement

ప్రేమ అక్కడికి రాగానే తిరుపతి షాక్ అయినా సరే ధీరజ్ మాత్రం ఇది నా జీవితంలోకి మళ్లీ వచ్చేసింది. నన్ను కనీసం మందు కూడా తాగనివ్వట్లేదు అంటూ బాధపడిపోతూ ఉంటాడు ధీరజ్.. ప్రేమ ఏంట్రా నువ్వు రోజురోజుకీ తాగుబోతు లాగా తయారవుతున్నావు. ఎందుకు ఈమధ్య ఎక్కువగా తాగుతున్నావు నాకు అర్థం కావడం లేదు అంటూ ప్రేమ దిమ్మ తిరిగిపోయేలా ధీరజ్కి క్లాస్ పీకుతుంది. ఇక తాగింది చాల్లే పదాన్ని ధీరజ్ని బండిమీద తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుంది. దారిలో ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ధీరజ్ ప్రేమని నడుము పట్టుకుంటాడు. ఇక ప్రేమ ఒక్కసారిగా సిగ్గు పడిపోతూ ఏంట్రా అక్కడ పట్టుకున్నావు అంటూ అంటుంది.. ప్రేమ రొమాంటిక్ గా ఫీల్ అవుతూ ఉంటే ధీరజ్ మాత్రం నువ్వు కొంచెం లావు అయ్యావు అంటూ సెటైర్లు వేస్తాడు..

నర్మదా ఫుల్ హ్యాపీ..

ధీరజ్ ఇంకా రాలేదని అమూల్య బయట వెయిట్ చేస్తూ ఉండగా నర్మదా అక్కడికి వెళుతుంది.. ఏంటమ్మాలి ఇంకా ఇక్కడే ఉన్నావు అంటే తీరదని ఇంకా రాలేదు వదిన అని చెప్పగానే. నర్మదా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎదురుగా ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా స్కూటీ మీద రావడం చూసి వీళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరిద్దరూ షికార్ కి వెళ్ళారా మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము టెన్షన్ పడుతున్నాము కనీసం చెప్పాలి కదా అని నర్మదా వెటకారంగా మాట్లాడుతుంది. కానీ ప్రేమ మాత్రం వీడు తాగితే తీసుకొని వచ్చాను అని అంటుంది. ఇక వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు చాలా సంతోష పడిపోతూ ఉంటారు.

నర్మదా సీక్రెట్ ఆపరేషన్..

Advertisement

నర్మదా తన ఫ్రెండు సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తుంది అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది.. ఆ అమ్మాయి తనని కలవడానికి వచ్చింది అని తెలుసుకుని చాలా సంతోషంగా నర్మద కూడా తన ఫ్రెండును కలవడానికి వెళ్తుంది. అయితే ఏం నర్మదా తన ఫ్రెండుతో చాలా సరదాగా ఉంటుంది ఈ క్రమంలో శ్రీవల్లి గురించి కొన్ని నిజాలను వారికి చెప్పేస్తుంది.. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగవి కదా నువ్వేం చెప్పినా కూడా పోలీసులు వింటారు కాబట్టి నువ్వు వీళ్ళ గురించి ఎంక్వయిరీ చెయ్యి. దొంగ బ్యాచ్ ప్రేమ ధీరజ్ లు విడిపోవడానికి కారణం వీళ్లే.. వీళ్ళ గురించి పూర్తి వివరాలను నువ్వు కనిపెట్టాలి అని నర్మదా అంటుంది. నీకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు అడిగితే ఈ పని చేయలేనా అని నర్మదకి తన ఫ్రెండు భరోసా ఇస్తుంది ఇక బల్లి బాగోతాన్ని తన ఫ్రెండు ఎలా బయట పెడుతుందో చూడాలి.. తిరుపతి ప్రేమతో తన పెళ్లి గురించి చెప్తూ ఉండగానే.. సేన వచ్చి మనం గుడికి వెళ్ళాలి పదా అని తిరుపతిని అడుగుతాడు. నేను ఇందాకే ఇంట్లో పూజ చేసే దండం పెట్టుకున్నాను. మళ్ళీ గుడికి ఎందుకు అన్నయ్య అని ఎంత చెప్తున్నా సరే. నీకు ఈ రోజు నిశ్చితార్థం ఉంది పదా..అనేసి బలవంతంగా తిరుపతిని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పార్వతికి అనుమానం..నిజం చెప్పిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Related News

Podarillu Today Episode : కన్నాకు టెన్షన్.. మనసు మార్చుకొని మాధవ్.. బాధపడ్డ మనీష..

Intinti Ramayanam Today Episode: పార్వతికి అనుమానం..నిజం చెప్పిన అక్షయ్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Ninnu kori Serial Today Episode September 9th ‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్‌కు ప్లాస్టిక్‌ సర్జరీ – ఒంటరిగా ఇంటికి వెళ్లిన చంద్ర

Wedensday Movies in Tv : సినీ ప్రియులకు సూపర్ న్యూస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode September 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అమర్

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

Big Stories

Advertisement
×