Pakistan players stole Smriti Mandhana kit : ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చివరి అంకానికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ జట్లు ఖరారు అయ్యాయి. బంగ్లాదేశ్ తో ఉమెన్స్ టీమిండియా తొలి సెమీ ఫైనల్ ఆడనుండగా… శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్లు సెప్టెంబర్ 13వ తేదీన ఫైనల్స్ ఆడతాయి. ఈ నేపథ్యంలో ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో దొంగతనం కలకలం రేపింది. టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana) క్రికెట్ కిట్టు పాకిస్తాన్ ప్లేయర్లు లేపేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీకి సంబంధించిన one 8 బూట్లు పాకిస్తాన్ ప్లేయర్లు ( Pakistan players stole Smriti Mandhana kit) ధరించిన నేపథ్యంలో ఈ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీకి సంబంధించిన one 8 బ్రాండ్ షూస్ వాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ లేడీ క్రికెటర్ నష్రా సందు ( nashra sandhu) మొదటగా విరాట్ కోహ్లీ బ్రాండ్ one 8 బూట్లు ధరించి మెరిశారు. ఆ తర్వాత హాంకాంగ్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ జట్టులో ఉన్న సగం మంది లేడీ క్రికెటర్లు ఆ బ్రాండ్ బూట్లు ధరించారు. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. విరాట్ కోహ్లీ కి సంబంధించిన బ్రాండ్ షూస్… పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు ఎక్కడి నుంచి వచ్చాయని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన క్రికెట్ కిట్టును పాకిస్తాన్ ప్లేయర్లు దొంగతనం చేశారని.. ఈ క్రమంలోనే వాటిని ధరిస్తున్నారని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఎవరూ లేని సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి దూరి.. స్మృతి మందాన క్రికెట్ కిట్ లేపేసారని అంటున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు కొనుగోలు చేసే బుద్ధి లేదని.. అన్ని లాగేసుకునే అలవాట్లే అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఆసియా కప్ 2025 ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) ఈ దొంగతనం చేసినట్లుగానే… ఇప్పుడు స్మృతి మందాన ( Smriti Mandhana) one 8 కిట్టు కూడా లేపేసారని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ దొంగతనంపై విచారణ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. ఇందులో నష్రా సందు అసలు దోషి అంటున్నారు.