E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode September 9th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   రాథోడ్‌లో ఉన్న దెయ్యం పిల్లలు వెళ్తున్న బస్సు పంక్చర్‌ అయ్యేలా చేస్తుంది. బస్సు పంక్చర్‌ అయ్యాక రాజు, డ్రైవర్‌ కలిసి సిటీ వైపు పంక్చర్‌ వేయించుకురావడానికి వెళ్తారు. రాథోడ్‌లో ఉన్న దెయ్యం అందరికీ మాటలు చెప్పి ప్రచండ ఉన్న దగ్గరకు అందరినీ తీసుకెళ్తుంది. ప్రచండను చూసిన మిస్సమ్మ, పిల్లలు, సరస్వతి భయపడుతుంటారు. మిస్సమ్మ కోపంగా రాథోడ్‌ను తిడుతుంటే.. అప్పుడే రాథోడ్‌ లో ఉన్న దెయ్యం బయటకు వెళ్తుంది. రాథోడ్‌ స్పృహ తప్పి పడిపోతాడు. రాథోడ్ కింద పడిపోవడంతో అందరూ భయపడుతుంటారు. రాథోడ్‌ను ఆవహించిన దెయ్యం ప్రచండకు నమస్తే చెప్పి నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నేను వెళ్తున్నాను ప్రచండ అని చెప్తుంది. దెయ్యం అలా చెప్పడం అందరూ చూసి షాక్‌ అవుతారు.

మిస్సమ్మ బాధగా రాథోడ్‌ను తట్టి లేపుతుంది. రాథోడ్‌ మెల్లగా స్పృహలోంచి బయటకు వస్తాడు. పిల్లలను, మిస్సమ్మను, సరస్వతి వార్డెన్‌ను చూసి ఆశ్చర్యంగా అదేంటి మిస్సమ్మ మనం ఈ అడవిలో ఉన్నామేంటి..? ఎందుకు మీరంతా ఇక్కడికి వచ్చారు అంటూ అడగ్గానే.. మిస్సమ్మ భయంగా ప్రచండ తీసుకొచ్చాడు అని చెప్తుంది. రాథోడ్‌ అటూ ఇటూ చూస్తే ప్రచండ తన వెనకాలే నిలబడి ఉంటాడు. ప్రచండను చూసిన రాథోడ్‌ కోపంగా ఓరేయ్‌ ప్రచండ నిన్ను చంపేస్తాను అంటూ మీదకు వెళ్తుంటే.. ప్రచండ మంత్రం వేసి రాథోడ్‌ను ఆపేస్తాడు. ఎత్తిన చేయి అలాగే స్టక్‌ అయిపోతుంది. ప్రచండ కోపంగా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.. ఇదంతా నా మంత్రబలంలో నిండిన స్థలం బుజ్జమ్మ శక్తులన్నీ వశం చేసుకునే సమయం ఆసన్నమైంది అంటూ చెప్తుంటే.. మిస్సమ్మ కోపంగా ప్రచండ నువ్వు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ అందరినీ అక్కడి నుంచి వెళ్దాం పదండి అని చెబితే అందరూ వెళ్లబోతుంటే.. ప్రచండ తన మంత్రశక్తితో అందరినీ ఆపేసి అందరినీ బంగ్లాలోకి తీసుకెళ్లమని తన శిష్యుడికి చెప్తాడు. కాద్రా అందరినీ పాడుబడిన బిల్డింగ్‌ లోకి తీసుకెళ్తాడు.

Advertisement

అందరినీ ఆ బిల్డింగ్‌లో బంధించడంతో భయపడుతుంటారు. ఎలాగైనా అమర్‌కు విషయం తెలిసేలా చేయాలని అనుకుంటారు. రాథోడ్‌ బాధగా దీనికంతటికీ నేనే కారణం నన్ను క్షమించు మిస్సమ్మ అంటాడు. ప్రచండ మాయ చేస్తే నువ్వేం చేస్తావు రాథోడ్‌ అంటుంది మిస్సమ్మ. ఇంతకీ అతను ఎవరు మిస్సమ్మ అంటూ సరస్వతి వార్డెన్‌ అడిగితే.. ప్రచండ అని పెద్ద దుష్ట మాంత్రికుడు వీడి వల్లనే పిల్లలకు అపాయం ఉందని పిల్లలను బయటకు రావొద్దన్నాను అనగానే.. సరస్వతి బాధగా నాకు విషయం తెలియక ఇబ్బంది పెట్టాను అంటుంది.

అడవిలోకి వెళ్లిన మనోహరి ఆశ్రమం పిల్లలు వచ్చిన బస్సు చూసి హ్యాపీగా ఫీలవుతుంది. ప్రచండ చెప్పినంత పని చేశాడని బస్సు దగ్గరుకు వెళ్లి చూస్తుంది. అప్పుడే వెనక నుంచి వచ్చిన అమర్‌ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి అని అడుగుతాడు. అమర్‌ మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. తిరిగి అమర్‌ను చూసి భయంతో వణికిపోతుంది. చెప్పు మనోహరి నువ్వు ఇక్కడకి ఎందుకు వచ్చావు. షాపింగ్‌కు వెళ్తున్నాను అన్నావు.. పార్థు తోడుగా వస్తానంటే వద్దన్నావు.. సడెన్‌గా ఇలా రూటు మార్చావు.. నిన్ను నేను ఇంటి దగ్గరి నుంచి ఫాలో అవుతున్నాను అంటూ అమర్‌ చెప్పగానే.. మనోహరి భయంగా చూస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Wedensday Movies in Tv : సినీ ప్రియులకు సూపర్ న్యూస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Big Stories

Advertisement
×