Intinti Ramayanam TRP Rating : తెలుగు సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య వస్తున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తూ ఉండడంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. అయితే ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్ కోసం జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంతో కొత్త కొత్త సీరియల్స్ ని టీవీ చానల్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొత్త సీరియల్స్ ప్రసారమైన ఛానల్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా స్టార్ మా అనే చెప్పాలి.. ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇంటింటి రామాయణం సీరియల్ కి మంచి డిమాండ్ ఉందన్న విషయం అందరికీ తెలుసు.. అయితే ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి రేటింగ్ కూడా ప్రతివారం పెరుగుతూ వస్తుంది. మరి ఈ సీరియల్ రేటింగు నవంబర్ నెలలో ఎలా ఉంది..? సీరియల్ హైలెట్ ఎపిసోడ్స్ గురించి మనం ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇంటింటి రామాయణం సీరియల్ ఒకప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సీరియల్ టిఆర్పి రేటింగ్ కాస్త డౌన్ అవ్వడంతో ఎక్కువ మంది సీరియల్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ నవంబర్నెల హైలెట్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి కమల్ తో విడాకులు వద్దు అని లాయర్ ని కలిసి ఎలాగైనా సరే తనకి ఫేవర్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ కమల్ మాత్రం పల్లవి నీకు జీవితంలో తన భార్యగా ఒప్పుకోను అని తెగేసి చెప్తాడు. కమల్ జీవితంలోకి ఒక కొత్త అమ్మాయి రావడంతో ఈ సీరియల్ లో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇది మాత్రమే కాదు.. పల్లవి ఎలాగైనా సరే మళ్లీ తన ఇంటికి తాను చేరుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది . అయితే ఈ క్రమంలో తనకి తోడుగా ఉన్న భరతు ప్రణతికి దగ్గర అయితే మళ్లీ తనని మార్చేస్తుందని భరత్ నీ రెచ్చగొడుతుంది. ఇక మొత్తానికి పల్లవి తాను అనుకున్న ప్లాన్ ప్రకారం జడ్జి కరిగిపోయేలా చేసి ఎలాగైనా సరే ఆ కేసు గెలవాలని అనుకుంటుంది మొత్తానికి గెలిచి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని అనుకుంటుంది. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవి మళ్లీ వస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడితో ఆగకుండా పల్లవి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది అదే ఈ నెల హైలెట్ ఎపిసోడ్గా నిలుస్తుంది. వచ్చే నెలలో ఎలాంటి ఎపిసోడ్లు ఎలాంటి ట్విస్టులు జరగబోతాయి అన్నది చూడాలి..
ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. పల్లవి మళ్లీ తన భర్తతో కాపురం చేయడానికి కోర్టు 30 రోజులు పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఇంటికి వచ్చి అందరికీ చుక్కలు చూపించాలని అనుకుంటుంది. అయితే ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడినట్టుగానే పల్లవించిన గ్రాండ్ ఎంట్రీ తో పాటుగా తాను ఇంట్లో కడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా టెన్షన్ పడిపోతూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళు తనని పట్టించుకోవడంలేదని వాళ్ళకి నిద్ర లేకుండా చేయాలి అని పల్లవి కూడా చాలా రకాలుగా ప్లాన్లు వేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఇంట్లో వాళ్లకి నిద్ర లేకుండా చేసేందుకు కరెంటు ఫీజు పీకేస్తుంది కానీ కమల్ దయంగా మారి తనని ఒక ఆట ఆడుకుంటాడు ఇది ఈ వారం ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో కమల్ రమ్యను తీసుకురావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.